వాట్సాప్‌ ద్వారా ప్రతిరోజూ 10వేల కోట్ల మెసేజులు పంపబడుతున్నాయి: మార్క్ జుకర్‌బర్గ్

By Sandra Ashok Kumar  |  First Published Oct 31, 2020, 11:21 AM IST

 త్రైమాసిక నివేదికను విడుదల చేసిన మార్క్ జుకర్‌బర్గ్, ప్రపంచవ్యాప్తంగా సుమారు 2.5 బిలియన్ల మంది ఫేస్‌బుక్ యాప్ లేదా వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ మెసెంజర్‌లతో సహా ఉపయోగిస్తున్నారు. ఈ ప్లాట్‌ఫామ్‌లలో యాడ్స్ సంఖ్య కూడా భారీగా  పెరిగింది అని అన్నారు. 


ప్రతిరోజూ 10 వేల కోట్ల  మెసేజెస్ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ద్వారా పంపబడుతున్నాయని ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ఈ విషయాన్ని స్వయంగా తెలిపారు. గత సంవత్సరం కొత్త సంవత్సర సందర్భంగా వాట్సాప్ రోజుకు 100 బిలియన్ మెసేజెస్ సంఖ్యను వాట్సాప్ అధిగమించింది.

త్రైమాసిక నివేదికను విడుదల చేసిన మార్క్ జుకర్‌బర్గ్, ప్రపంచవ్యాప్తంగా సుమారు 2.5 బిలియన్ల మంది ఫేస్‌బుక్ యాప్ లేదా వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ మెసెంజర్‌లతో సహా ఉపయోగిస్తున్నారు. ఈ ప్లాట్‌ఫామ్‌లలో యాడ్స్ సంఖ్య కూడా భారీగా  పెరిగింది అని అన్నారు. 

Latest Videos

undefined

కొత్త సంవత్సరం, పండుగల సందర్భంగా చాలా వరకు మెసేజులు వాట్సాప్ ద్వారా పంపించుకుంటున్నారు. 2017 సంవత్సరంలో నూతన సంవత్సర, పండుగల సందర్భంగా 63 బిలియన్ మెసేజెస్ వాట్సాప్‌ ద్వారా  పంపించారు.

2018లో 75 బిలియన్ మెసేజులు, 2019 లో 100 బిలియన్ మెసేజులు పంపించారు. ఇప్పుడు ప్రతిరోజూ 100 బిలియన్ మెసేజెస్ పంపబడుతున్నాయి. వాట్సాప్ ఇతర యాప్స్  కంటే  ఇన్స్టంట్ మల్టీ మీడియా మెసేజింగ్ యాప్ గా మారింది.

ఈ ఏడాది జనవరిలో వాట్సాప్ ఆండ్రాయిడ్ వినియోగదారుల సంఖ్య ఐదు బిలియన్ల మార్కును దాటింది. దీనితో పాటు వాట్సాప్ అత్యధికంగా డౌన్‌లోడ్ చేసుకున్నా యాప్ గా మారింది. 

వాట్సాప్ "ఆల్వేస్ మ్యూట్" ఫీచర్ ను తాజాగా విప్రవేశపెట్టింది, పర్సనల్ చాట్ లేదా గ్రూప్ చాట్ "ఆల్వేస్ మ్యూట్" చేయవచ్చు. ఈ ఫీచర్ గతంలో ఒక సంవత్సరం వరకు మాత్రమే మ్యూట్ చేసే అవకాశం ఉండేది.


 

click me!