ఆక్వామారిన్ గ్రీన్ కలర్ వేరియంటులో ఆకట్టుకుంటున్న వివో వి20ఎస్ఇ కొత్త స్మార్ట్ ఫోన్..

By Sandra Ashok KumarFirst Published Nov 10, 2020, 5:51 PM IST
Highlights

వివో వి20 ఎస్ఇ వేరియంట్ ఆక్వామారిన్ గ్రీన్ కలర్ లో తీసుకొచ్చింది. గత వారం ఇండియాలో లాంచ్ అయిన ఈ స్మార్ట్‌ఫోన్ ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 665 SoC, 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. 

స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వివో ఇప్పుడు  కొత్తగా వివో వి20 ఎస్ఇ వేరియంట్ ఆక్వామారిన్ గ్రీన్ కలర్ లో తీసుకొచ్చింది. గత వారం ఇండియాలో లాంచ్ అయిన ఈ స్మార్ట్‌ఫోన్ ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 665 SoC, 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో వస్తుంది.

ఆక్వామారిన్ గ్రీన్ కలర్ వేరియంట్ ఈ రోజు నుండి వివో ఇండియా ఇ-స్టోర్, ఇ-కామర్స్ వెబ్‌సైట్లు, దేశవ్యాప్తంగా రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉంటుంది. వివో వి20 ఎస్ఇ గ్రావిటీ బ్లాక్ కలర్ వేరియంట్లో కూడా లభిస్తుంది. వివో సంస్థ ప్రకారం సరికొత్త కలర్ వేరియంట్ సముద్రం నుండి ప్రేరణ పొందింది. 

వివో వి20ఎస్ఇ ఆక్వామారిన్ గ్రీన్ ధర, సేల్  ఆఫర్లు
వివో వి20ఎస్‌ఇ ఆక్వామారిన్ గ్రీన్ వేరియంట్ ధర రూ.20,999. వివో ఇండియా ఇ-స్టోర్‌తో పాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. 8జి‌బి ర్యామ్, 128జి‌బి స్టోరేజ్ ఆప్షన్ లో అందిస్తున్నారు.

also read 

 ఐసిఐసిఐ బ్యాంక్‌తో 10 శాతం క్యాష్‌బ్యాక్ (ఐసిఐసిఐ-అమెజాన్ కో-బ్రాండెడ్ కార్డులను మినహాయించి), కోటక్ మహీంద్రా బ్యాంక్‌తో 10 శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఈ స్మార్ట్ కొనుగోలు తేదీ నుండి ఆరు నెలల్లోపు ఒక్కసారి స్క్రీన్ రిప్లేస్ మెంట్ ఇస్తున్నారు. 

వివో వి20ఎస్ఇ స్పెసిఫికేషన్లు
వివో వి20 ఎస్‌ఇలో 6.44-అంగుళాల పూర్తి-హెచ్‌డి + (1,080x2,400 పిక్సెల్స్) అమోలెడ్ డిస్‌ప్లే, డ్యూయల్ సిమ్ (నానో), ఆండ్రాయిడ్ 10 ఫన్‌టచ్ ఓఎస్ 11, 8 జిబి ర్యామ్‌, ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 665 SoC, 128జి‌బి ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది, మైక్రో ఎస్‌డి కార్డ్ ద్వారా 1టి‌బి వరకు స్టోరేజ్  పెంచుకోవచ్చు.

ఆప్టిక్స్ పరంగా ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది, ఇందులో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఎఫ్ / 1.8 లెన్స్‌తో ఉంటుంది. ఎఫ్ / 2.2 వైడ్ యాంగిల్ లెన్స్‌తో 8 మెగాపిక్సెల్ కెమెరా, బోకె ఎఫెక్ట్ కోసం ఎఫ్ / 2.4 లెన్స్‌తో 2 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు.

4,100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 33W ఫ్లాష్ చార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్స్ లో 4జి ఎల్‌టి‌ఈ, వై-ఫై, బ్లూటూత్ 5.0, జి‌పి‌ఎస్/ ఏ-జి‌పి‌ఎస్, ఎఫ్‌ఎం రేడియో, యూ‌ఎస్‌బి టైప్-సి పోర్ట్, ఇన్-డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ 171 గ్రాముల బరువు ఉంటుంది.

click me!