అట్ట్రక్ట్ చేస్తున్న వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్‌ టీజర్‌..

By Sandra Ashok Kumar  |  First Published Jul 6, 2020, 1:10 PM IST

 వన్‌ప్లస్ నార్డ్ ధర సుమారు రూ. 37,300 గా ఉండవచ్చని అంచనా. మార్కెటింగ్ కారణంగా వన్‌ప్లస్ నార్డ్ అత్యంత హైప్ చేయబడిన ఫోన్‌లలో ఒకటిగా మారింది. 


చైనా స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం వన్‌ప్లస్ రాబోయే కొత్త  బడ్జెట్‌  స్మార్ట్‌ఫోన్‌పై  తాజాగా ఒక టీజర్‌ను విడుదల చేసింది. ఇందులో వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 765 జితో రాబోతుంది. వన్‌ప్లస్ నార్డ్ ధర సుమారు రూ. 37,300 గా ఉండవచ్చని అంచనా. మార్కెటింగ్ కారణంగా వన్‌ప్లస్ నార్డ్ అత్యంత హైప్ చేయబడిన ఫోన్‌లలో ఒకటిగా మారింది.

వన్‌ప్లస్ సంస్థ యూట్యూబ్‌లో, ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఈ స్మార్ట్ ఫోన్ గురించి ఒక టీజర్ వీడియోను షేర్ చేస్తూ  దీనికి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, డ్యూయల్ సెల్ఫీ కెమెరా సెటప్ అమర్చినట్టు చూపించింది. ఎక్కువ యుసర్లను  చేరుకోవడమే లక్ష్యంగా వన్‌ప్లస్ నార్డ్‌ను బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌గా కంపెనీ ప్రకటించింది.

Latest Videos

undefined

అంతేకాకుండా వన్‌ప్లస్ ఎగ్జిక్యూటివ్‌లు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వన్‌ప్లస్ నార్డ్ గురించి కొన్ని విషయలను  కూడా వెల్లడించారు. వన్‌ప్లస్ యూట్యూబ్ ఛానల్, ఇన్‌స్టాగ్రామ్ పేజీలో “డియర్ పాస్ట్” అనే పేరుతో చిన్న టీజర్ వీడియోను షేర్ చేసింది. వీడియోలో డ్యూయల్ సెల్ఫీ కెమెరా సెటప్‌తో పాటు ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను వెల్లడించింది.

also read  

వన్‌ప్లస్ 8 సిరీస్‌లో ఉన్న కెమెరా మాడ్యూల్‌కు భిన్నంగా, వెనుకవైపు కెమెరా సెటప్ మధ్యలో కాకుండా ఒక వైపు చివరకు ఉన్నట్లు  చూడవచ్చు. సెల్ఫీ కెమెరాలు కూడా మధ్యలో కాకుండా  చివరకు  ఉన్నట్లు తెలుస్తుంది. వన్‌ప్లస్ లోగోను వెనుక ప్యానెల్ మధ్యలో, “వన్‌ప్లస్” బ్రాండింగ్‌తో పాటు కింద చూడవచ్చు.

వన్‌ప్లస్ నార్డ్ కి కూడా వార్నింగ్ స్లయిడర్‌, కుడి వైపున పవర్ బటన్‌ ఉంది. వీడియోలో చూస్తే ఫోన్ కలర్ గ్రే-ఇష్ ఉన్నట్లు అనిపిస్తుంది. ప్రస్తుతానికి, వన్‌ప్లస్ నార్డ్ స్నాప్‌డ్రాగన్ 765 జి, 5 జి సపోర్ట్, 32 మెగాపిక్సెల్, 8 మెగాపిక్సెల్ సెన్సార్ డ్యూయల్ సెల్ఫీ కెమెరా సెటప్‌ను తాజా టీజర్ లో వెల్లడించింది. భారతీయ మార్కెట్లోకి వన్‌ప్లస్ నార్డ్‌ ప్రీ బుకింగ్స్‌ను  అమెజాన్‌ లో త్వరలోనే ప్రారంభించనుంది.

 

వన్‌ప్లస్‌ నార్డ్‌  ​ఫీచర్లుపై అంచనాలు
 6.4 అంగుళాల డిస్‌ప్లే
 ఆండ్రాయిడ్‌​ 10
క్వాల్కం స్నాప్‌ డ్రాగన్‌765జీ 5జీ  ప్రాసెసర్‌
10 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌
4000ఎంఏహెచ్‌ బ్యాటరీ

click me!