చైనాయాప్ టిక్‌టాక్ కీలక నిర్ణయం.. బ్యాన్ చేసిన యాప్స్ పై 79 ప్రశ్నలు..

By Sandra Ashok Kumar  |  First Published Jul 11, 2020, 11:12 AM IST

చైనా యాప్ టిక్‌టాక్ మాత్రు సంస్థ బైట్ డ్యాన్స్ కీలక నిర్ణయం తీసుకుంటున్నది. డ్రాగన్ ముద్ర నుంచి బయటపడేందుకు తన ప్రధాన కార్యాలయాన్ని బీజింగ్ నుంచి తప్పించేందుకు ప్రయత్నాలు సాగిస్తోంది. ఇక టిక్ టాక్ సహా నిషేధానికి గురైన 59 చైనా యాప్స్ యాజమాన్యాలకు కేంద్రం 79 ప్రశ్నలతో కూడిన నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసుకు సంత్రుప్తికర సమాధానం ఇవ్వడంపైనే మనదేశంలో వాటి భవితవ్యం ఆధార పడి ఉంటుంది. 
 


బీజింగ్: జాతీయ భద్రత నేపథ్యంలో భారత్ ప్రభుత్వ నిషేధానికి గురైన  చైనా యాప్ టిక్ టాక్ కొత్తకొత్త ఎత్తులు వేస్తున్నది. తనపై డ్రాగన్ ముద్ర పోగొట్టుకునేందుకు పడరాని పాట్లు పడుతోంది. మరోవైపు టిక్ టాక్ సంస్థ సహ నిషేధానికి గురైన చైనా యాప్స్‌కు కేంద్రం 79 ప్రశ్నలు సంధించింది. 

భారత్ నిషేధించడంతో కోట్ల మంది యూజర్లను కోల్పోయి, టిక్‌టాక్‌ సంస్థ తీవ్ర నష్టాలను చవి చూసింది. తాజాగా అమెరికా కూడా నిషేధించే యోచనలో ఉందన్న వార్తలతో అప్రమత్తమైంది. తమది చైనా యాప్ అయినా పక్షపాతంగా వ్యవహరించలేదని పేర్కొంది.

Latest Videos

ఇతర దేశ పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని చైనాకు చేరవేయలేదని ఇప్పటికే టిక్‌టాక్ ప్రకటించింది. ఆ ఆరోపణల నుంచి బయటపడటానికి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అమెరికా కూడా నిషేధిస్తే సంస్థ మనుగడకే ముప్పు వాటిల్లే అవకాశం ఉండటంతో కొత్త పల్లవిని అందుకుంది. తాజాగా టిక్‌టాక్ మాతృ సంస్థ బైట్‌డ్యాన్స్‌లో మార్పులుచేర్పులకు శ్రీకారం చుట్టింది.


బైట్ డ్యాన్స్ సంస్థతోనూ, చైనాతోనూ దూరం జరిగేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. అందులో భాగంగా బీజింగ్‌ నుంచి తమ ప్రధాన కార్యాలయాన్ని తరలించాలని టిక్ టాక్ భావిస్తోంది. అంతేకాదు, కొత్త కార్యనిర్వాహక బోర్డును ఏర్పాటు చేసే యోచనలో బైట్‌డ్యాన్స్ ఉన్నట్లు తెలిసింది. 

also read 

తద్వారా టిక్ టాక్ యాప్ మీద చైనా ముద్రను తొలగించుకోవాలన్నది బైట్‌డ్యాన్స్ వ్యూహంగా తెలుస్తోంది. టిక్‌టాక్, హెలో యాప్‌లు రెండింటికి బైట్‌డ్యాన్స్ మాతృ సంస్థ కావడం గమనార్హం. ఈ రెండు యాప్‌లు నడవాలంటే చైనాకు దూరం దూరంగా ఉండాల్సిందేనని బైట్‌డ్యాన్స్ భావిస్తోంది.

భద్రతా కారణాల రీత్యా నిషేధానికి గురైన 59 చైనా యాప్స్‌ యాజమాన్యాలు భారత ప్రభుత్వం 79 ప్రశ్నలతో కూడిన నోటీసును పంపింది. మూడు వారాల్లోగా ఆ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ మంత్రిత్వ శాఖ సూచించింది. జులై 22లోపు వీటికి బదులు ఇవ్వకుంటే పూర్తిస్థాయిలో నిషేధం విధిస్తామని నోటీసుల్లో పేర్కొంది.

ఆయా యాప్ కంపెనీల కార్పొరేట్‌ మూలాలు, మాతృ సంస్థ, ఫండింగ్‌, డేటా మేనేజ్‌మెంట్‌కు సంబంధించిన ప్రశ్నలు ఉన్నాయి. ఒకసారి ఆయా యాప్స్‌ సమాధానం ఇచ్చాక ప్రత్యేకంగా ఏర్పాటైన కమిటీ వాటిని పరిశీలిస్తుంది. అయితే, అంతకుముందే ఈ యాప్స్‌ గురించిన సమాచారాన్ని భారత్‌ సహా ఇతర దేశాలకు చెందిన నిఘా వర్గాలు కేంద్రానికి అందించాయి. 

ఈ యాప్స్ యాజమాన్యాల నుంచి వచ్చిన సమాధానాలను నిఘా వర్గాల వివరాలతో సరిపోలుస్తారు. ఒకవేళ ఆ సమాచారంలో తేడాలు ఉంటే సదరు యాప్స్‌పై చర్యలు ఉంటాయి. ఒకవేళ సమాధానాలు సంతృప్తికరంగా ఉంటే సమీప భవిష్యత్‌లో టిక్‌టాక్‌ సహా మిగిలిన యాప్స్‌ తమ సేవలు ప్రారంభించే అవకాశం ఉన్నట్లు నోటీసుల ద్వారా తెలుస్తోంది.

click me!