చైనాకి డాటా లీక్ చేయలేదు.. టిక్‌టాక్ నిషేధం సి‌ఈ‌ఓ స్పందన..

By Sandra Ashok KumarFirst Published Jul 1, 2020, 1:45 PM IST
Highlights

 చైనాపై భారీ ఆర్థిక దెబ్బ తీసేందుకు భారత ప్రభుత్వం టిక్‌టాక్ తో సహ మరో 58 యాప్‌లను నిషేధించింది. కేంద్రం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో టిక్‌టాక్ మంగళవారం స్పందించింది. దీనిపై చైనా వీడియో షేరింగ్ యాప్‌ టిక్‌టాక్ సిఇఒ భారతదేశంలోని ఉద్యోగులకు లేఖ రాశారు.  చైనా, భారతదేశ మధ్య జరిగిన ఘర్షణలలో 20 మంది భారతీయ సైనికులు తమ ప్రాణాలను అర్పించారు.

న్యూ ఢీల్లీ: లడఖ్‌లోని గాల్వన్ వ్యాలీలో జూన్ 15 న జరిగిన చైనా, భారతదేశ మధ్య ఘర్షణల నేపథ్యంలో చైనాపై భారీ ఆర్థిక దెబ్బ తీసేందుకు భారత ప్రభుత్వం టిక్‌టాక్ తో సహ మరో 58 యాప్‌లను నిషేధించింది. కేంద్రం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో టిక్‌టాక్ మంగళవారం స్పందించింది.

దీనిపై చైనా వీడియో షేరింగ్ యాప్‌ టిక్‌టాక్ సిఇఒ భారతదేశంలోని ఉద్యోగులకు లేఖ రాశారు.  చైనా, భారతదేశ మధ్య జరిగిన ఘర్షణలలో 20 మంది భారతీయ సైనికులు తమ ప్రాణాలను అర్పించారు. తన వినియోగదారుల డేటాను చైనా సహా ఏ విదేశీ ప్రభుత్వానికి ఇవ్వలేదని, భవిష్యత్తులో కూడా అలా చేయబోమని వివరణ ఇచ్చింది.  

భారత చట్టాల ప్రకారం, డేటా ప్రైవసీ, సెక్యూరిటీ నిబంధనలన్నీ పాటిస్తున్నామంటూ టిక్‌టాక్ ఇండియా  హెడ్ నిఖిల్ గాంధీ ఒక ప్రకటన విడుదల చేశారు. "టిక్‌టాక్‌లో, ఇంటర్నెట్‌ను ప్రజాస్వామ్యం చేయాలనే మా నిబద్ధతతో మా ప్రయత్నాలు మార్గనిర్దేశం చేస్తున్నాయి. చాలావరకు, మేము ఈ ప్రయత్నంలో విజయం సాధించామని మేము నమ్ముతున్నాము.

ఈ అంశంపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి తమకు ఆహ్వానం అందిందని చెప్పారు. దీనిపై మరింత స్పష్టత ఇచ్చేందుకు, చర్చించడంతోపాటు, సందేహాలను నివృత్తి చేస్తామన్నారు. వినియోగదారు గోప్యతకు, సమగ్రతకే అధిక ప్రాముఖ్యత అన్నారు. ప్రభుత్వ నిషేధాన్ని "తాత్కాలిక ఉత్తర్వు" గా అభివర్ణించించిన గాంధీ 14 భారతీయ భాషలలో లక్షలాదిమందికి ఇంటర్నెట్ ను అందుబాటులోకి తీసుకొచ్చామని, వినియోగదారులు, కళాకారులు, స్టోరీ టెల్లర్స్,  విద్యావేత్తలు  సహా ఎంతోమందికి  జీవనోపాధిని అందిస్తున్నామని వెల్లడించారు.

also read 

టిక్ టాక్ యాప్ భారతీయ చట్టం ప్రకారం  డేటా గోప్యత, భద్రతా అవసరాలకు అనుగుణంగా కొనసాగుతోంది. వినియోగదారుల గోప్యత, సమగ్రతకు అత్యధిక ప్రాముఖ్యతనిస్తుంది "అని టిక్ టాక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్, వీడియో షేరింగ్ యాప్ బైట్ డాన్స్ చీఫ్ ఆపరేషన్స్ ఆఫీసర్ కెవిన్ మేయర్ చెప్పారు. "భారతదేశంలోని మా ఉద్యోగులకు ఒక మెసేజ్" అనే పోస్ట్‌లో కెవిన్ మేయర్ మాట్లాడుతూ, "2018 నుండి, భారతదేశంలో 200 మిలియన్ల మంది వినియోగదారుల తమ ఆనందాన్ని, టాలెంట్ ని వ్యక్తపర్చడానికి, వారి అనుభవాన్ని పంచుకోవడానికి  మేము చాలా కృషి చేసాము.

భారతదేశంలో తమ ఉద్యోగుల ఉద్యోగ భద్రతపై ఆందోళనల చెందవద్దని మా ఉద్యోగులే మా అతిపెద్ద బలం, వారి శ్రేయస్సు మా ప్రధమ ప్రాధాన్యత. వారు గర్వించదగిన అవకాశాలను పునరుద్ధరించడానికి మా శక్తితో కృషి చేస్తామని, 2,000 మందికి పైగా ఉద్యోగులకు మేము హామీ ఇస్తున్నాం"అని  టిక్‌టాక్ సీఈఓ చెప్పారు.

టిక్ టాక్ ఎంతో మందికి సేలేబ్రిటీలుగా మారడానికి అవకాశాన్ని కల్పించింది. ఎంతో మండికి ఉపాధి కల్పిస్తూ, వారి టాలెంటును ప్రపంచనికి తెలిసేలా చేసింది. ఈ రోజు, టిక్ టాక్ దేశంలోని మారుమూల నగరాలు, పట్టణాలు, గ్రామాలలోని వినియోగదారులకు కూడా ఇది ప్రధానమైనది"అని కెవిన్ మేయర్ చెప్పారు.

టిక్‌టాక్ కాకుండా, ప్రభుత్వం నిరోధించిన చైనీస్ లింక్‌లతో ఉన్న ఇతర 58 యాప్ లలో వీచాట్, యుసి బ్రౌజర్ కూడా ఉన్నాయి. యాప్ లు వినియోగదారుల నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని, వినియోగదారుల గోప్యతకు భంగం కలిగించేలా స్పైవేర్ లేదా మాల్వేర్‌గా ఉపయోగిస్తూన్నాయని ఇంటెలిజెన్స్ ఏజెన్సీల ఇన్‌పుట్‌లు సూచించాయని సోర్సెస్ తెలిపింది.

చైనాకు భారత్ తగిన బుద్ది చెప్పిందని  ప్రధాని నరేంద్ర మోడీ చెప్పిన  తర్వాత  ఈ చర్య జరిగింది. చైనా వస్తువులను బహిష్కరించాలని దేశవ్యాప్తంగా పిలుపునిచ్చారు. ఇది భారతదేశం బలోపేతం కావడానికి సహాయపడుతుంది" అని ఆయన అన్నారు.

click me!