టెలికాం సంస్థ‌ల‌కు సుప్రీంకోర్టు డెడ్‌లైన్‌.. మార్చిలోగా చెల్లించాలంటూ ఆదేశాలు జారీ..

By Sandra Ashok Kumar  |  First Published Sep 1, 2020, 2:45 PM IST

 వచ్చే ఏడాది మార్చి 31 లోగా టెలికాం కంపెనీలు 10 శాతం బకాయిలు చెల్లించాలని అత్యున్నత న్యాయస్థానం ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 20 సంవత్సరాల చెల్లింపును సుప్రీంకోర్టు తిరస్కరించింది. 


ప్రభుత్వానికి రావాల్సిన  అడ్జస్ట్ఎడ్  గ్రాస్ రెవెన్యూ (ఎజిఆర్) అని పిలవబడే భారీ బకాయిలను క్లియర్ చేయడానికి సుప్రీంకోర్టు మంగళవారం టెలికాం కంపెనీలకు 10 సంవత్సరాల గడువు ఇచ్చింది. సుమారు 1.6 ల‌క్ష‌ల కోట్ల బాకీలు టెలికాం సంస్థ‌లు చెల్లించాల్సి ఉన్న‌ది.

వచ్చే ఏడాది మార్చి 31 లోగా టెలికాం కంపెనీలు 10 శాతం బకాయిలు చెల్లించాలని అత్యున్నత న్యాయస్థానం ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 20 సంవత్సరాల చెల్లింపును సుప్రీంకోర్టు తిరస్కరించింది.

Latest Videos

ఎజిఆర్ బకాయిల చెల్లింపు కోసం 10 సంవత్సరాల  గ‌డువును ఫిక్స్ చేసింది. ఏప్రిల్ 1, 2021 నుండి ప్రారంభమవుతుందని, 2031 మార్చి 31 వరకు వాయిదాలలో చెల్లింపులు చేయాల్సి ఉంటుందని కోర్టు తెలిపింది. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 7లోగా టెలికాం కంపెనీలు బకాయిలను క్లియర్ చేయాల్సి ఉంటుంది.

also read 

ఒకవేళ బకాయిలు చెల్లించకపోతే జరిమానా, వడ్డీ, కోర్టు కోర్టు ధిక్క‌ర‌ణ కేసు కూడా న‌మోదు అవుతుందని ధర్మాసనం తెలిపింది. టెలికాం కంపెనీలు ఆదాయంలో కొంత శాతాన్ని లైసెన్స్ ఫీజుగా ప్రభుత్వానికి చెల్లిస్తాయి. టెలికం కంపెనీల మేనేజింగ్ డైరెక్టర్లు లేదా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లను నాలుగు వారాల్లోపు చెల్లింపులపై వ్యక్తిగత హామీలు ఇవ్వాలని సుప్రీంకోర్టు కోరింది.

టెలికమ్యూనికేషన్ విభాగం (డిఓటి) 20 సంవత్సరాలలోపు కేబినెట్ చెల్లింపు ప్రతిపాదనకు కట్టుబడి ఉంది. ఈ విషయంపై డిఓటి చేసిన తీర్పు అంతిమమని కోర్టు తెలిపింది. జూలై 20న ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం బకాయిల చెల్లింపు కోసం ఉత్తర్వులను రిజర్వు చేసింది.

పెరుగుతున్న నష్టాలతో ఇబ్బందులు పడుతున్న భారతి ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాకు ఈ తీర్పు ఉపశమనం కలిగించనుంది. వొడాఫోన్ ఐడియా చైర్మన్ కుమార్ మంగళం బిర్లా డిసెంబరులో కంపెనీ దివాలా దిశగా పయనిస్తున్నట్లు హెచ్చరించారు. భారతీ ఎయిర్‌టెల్, ఆర్‌కామ్ షేర్లు బిఎస్‌ఇలో ఒక్కొక్కటి 5 శాతం వరకు లాభపడగా, వోడాఫోన్ ఐడియా 15 శాతం పడిపోయింది.
 

click me!