స్నాప్ చాట్ ఉద్యోగులకు "వర్క్ ఫ్రం హొమ్"...

By Sandra Ashok KumarFirst Published Mar 14, 2020, 5:55 PM IST
Highlights

గూగుల్, ట్విట్టర్, అమెజాన్ సహా అనేక ఇతర కంపెనీలు కొరోనా వైరస్ వ్యాపిస్తున్న కొన్ని ప్రాంతాలలో తమ ఉద్యోగులను ఇంటి నుండి పని చేయమని ప్రోత్సహిస్తున్నాయి.
 

స్నాప్ చాట్ సీఈఓ ఇవాన్ స్పీగెల్ తమ కంపెనీ ఉద్యోగులందరినీ ఇంటి నుండి పని చేయలని కోరింది. ఆలాగే సంస్థ పార్ట్నర్ సమ్మీట్ సమావేశాన్ని కూడా వాయిదా వేసింది.

also read ఎల్‌జి నుండి 8కె వాల్ పేపర్ మోడల్ టీవీలు...

స్నాప్‌చాట్ డెవలపర్లు, ప్రకటనదారులు, క్రియేటర్స్ కోసం ఏప్రిల్ 2న జరగాల్సిన ఈవెంట్ వాయిదా వేయనుంది. అయితే కరోనావైరస్ భయాల మధ్య ప్రస్తుతం ఈ ఈవెంట్ ను ఆన్‌లైన్  ప్రెజెంటేషన్ ద్వారా నిర్వహించాలని చూస్తుంది.

స్నాప్ చాట్ కార్యాలయాలు తెరిచి ఉంటాయి కానీ బిజినెస్ కొనసాగింపు సంబంధించి కార్యాలయంలో ఉండాల్సిన వారిని నిర్ణయించాల్సి ఉంది. అయితే చాలా మంది మా ఉద్యోగులు ఇంట్లో నుంచే పని చేయనున్నారు.

also read ఏడు గంటల బ్యాటరీ లైఫ్ తో సెన్‌హైజర్ కొత్త వైర్‌లెస్ ఇయర్ ఫోన్స్

గూగుల్, ట్విట్టర్, అమెజాన్ సహా అనేక ఇతర కంపెనీలు కొరోనావైరస్ వ్యాపిస్తున్న ప్రాంతాలలో ఉన్న తమ ఉద్యోగులను ఇంటి నుండి పని చేయతనికి ప్రోత్సహిస్తున్నాయి.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) బుధవారం కోవిడ్ -19 వ్యాప్తిని మహమ్మారిగా ప్రకటించింది. ఈ వైరస్ ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. దాదాపు 118,000 మందికి పైగా సోకింది దీని వల్ల సుమారు 4,000 మందికి పైగా మరణించారు.

click me!