ఫెస్టివల్ సీజన్ లో స్మార్ట్‌ఫోన్ ధరలకు రెక్కలు..!

By Sandra Ashok KumarFirst Published Oct 3, 2020, 10:16 AM IST
Highlights

డిస్‌ప్లేల దిగుమతిపై ప్రభుత్వం 10 శాతం సుంకం విధించడంతో మొబైల్ ఫోన్ ధరలు 3 శాతం పెరిగే అవకాశం ఉందని ఇండియా సెల్యులార్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ అసోసియేషన్‌ (ఐసీఈఏ) శుక్రవారం తెలిపింది. 

ఈ దసరా, దీపావళి పండుగ సీజన్ లో స్మార్ట్ ఫోన్ కొనాలనుకునే వారికి షాకింగ్ న్యూస్. డిస్‌ప్లేల దిగుమతిపై ప్రభుత్వం 10 శాతం సుంకం విధించడంతో మొబైల్ ఫోన్ ధరలు 3 శాతం పెరిగే అవకాశం ఉందని ఇండియా సెల్యులార్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ అసోసియేషన్‌ (ఐసీఈఏ) శుక్రవారం తెలిపింది.

పరిశ్రమ ఏకాభిప్రాయంతో 2016లో ప్రకటించిన పిఎమ్‌పి కింద డిస్‌ప్లే అసెంబ్లీ, టచ్ ప్యానెల్‌పై దిగుమతి సుంకాలను అక్టోబర్ 1 నుండి వర్తింపజేయాలని ప్రతిపాదించారు. మొబైల్ ఫోన్ ధరలపై 1.5 నుంచి 3 శాతం మధ్య సుంకాల ప్రభావం ఉంటుందని పరిశ్రమల ఐసిఇఎ నేషనల్ చైర్మన్ పంకజ్ మొహింద్రూ ఒక ప్రకటనలో తెలిపారు.

ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసిఇఎ) సభ్యులలో ఆపిల్, హువావే, షియోమి, వివో, విన్స్ట్రాన్ ఉన్నాయి. పిఎమ్‌పి  లక్ష్యం దేశీయంగా భాగాల తయారీని సులభతరం చేయడం మరియు ఆ తరువాత దిగుమతులను నిరుత్సాహపరచడం.

also read 

"కోవిడ్-19, ఎన్‌జి‌టి ఆంక్షల కారణంగా డిస్ప్లే అసెంబ్లీ ఉత్పత్తిని తగినంతగా పరిశ్రమ పెంచలేకపోయింది. దేశీయంగా ఉత్పత్తి చేయడానికి తాము కట్టుబడి ఉన్నామని, అయితే ప్రస్తుతం దిగుమతులను తగ్గించుకోవడం మాత్రమే కాకుండా అంతర్జాతీయంగా మార్కెట్‌ వాటాను కూడా పెంచుకోవడంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని" పంకజ్‌ మోహింద్రూ అన్నారు.

వేదాంత గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్ ప్రమోట్ చేసిన వోల్కాన్ ఇన్వెస్ట్‌మెంట్స్ ట్విన్‌స్టార్‌ డిస్‌ప్లే టెక్నాలజీస్ పేరిట సుమారు 68,000 కోట్ల రూపాయల పెట్టుబడితో దేశంలో తొలి ఎల్‌సిడి తయారీ విభాగాన్ని 2016లో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది.

అయితే, ఈ ప్రతిపాదనకు ప్రభుత్వ అనుమతి రాలేదు. డిస్‌ప్లే ఎకోసిస్టమ్‌పై ఐసిఇఎ త్వరలో ఒక నివేదికను తీసుకురానుందని, ఇది కేవలం అసెంబ్లీపైనే కాకుండా పూర్తి డిస్‌ప్లే ఫ్యాబ్‌లపై దృష్టి సారిస్తుందని మోహింద్రూ చెప్పారు.
 

click me!