టిక్‌టాక్‌ను విక్రయిస్తారా లేదా మూసేస్తారా మీరే తేల్చుకొండి: డొనాల్డ్ ట్రంప్

By Sandra Ashok KumarFirst Published Sep 12, 2020, 11:21 AM IST
Highlights

గత నెలలో ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులో ట్రంప్ సెప్టెంబర్ 15లోగా చైనా యాప్ టిక్‌టాక్ కార్యకలాపాలను అమెరికాలోని ఏదైనా సంస్థకు విక్రయించాలని  లేదంటే నిషేధం విధించాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది.
 

వాషింగ్టన్: చైనా వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్ అమెరికా కార్యకలాపాలను ఇచ్చిన గడువులోగా ఏదైనా ఒక అమెరికన్ కంపెనీకి విక్రయించాలని లేదా నిషేధం తప్పదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం ఫైనల్ అల్టి మేటం జారీ చేశారు. 

గత నెలలో ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులో ట్రంప్ సెప్టెంబర్ 15లోగా చైనా యాప్ టిక్‌టాక్ కార్యకలాపాలను అమెరికాలోని ఏదైనా సంస్థకు విక్రయించాలని  లేదంటే నిషేధం విధించాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది.

 బీజింగ్ కేంద్రంగా పనిచేస్తున్న టిక్‌టాక్‌  యాజమాన్య సంస్థ బైట్‌డాన్స్‌తో మైక్రోసాఫ్ట్ అమెరికా కార్యకలాపాలను కొనేందుకు చర్చలు జరుపుతున్న విషయం మీకు తెలిసిందే.  

also read 

ఇప్పటికే ఒకసారి గడువు పెంచిన ట్రంప్  సెప్టెంబర్ 15 తరువాత టిక్ టాక్ విక్రయంపై గడువు పొడిగింపు ఉండదు అని ట్రంప్ గురువారం విలేకరులతో అన్నారు. టిక్‌టాక్‌ను ఒక అమెరికన్ కంపెనికి విక్రయిస్తారా, లేదా మూసివేస్తారా తేల్చుకోవాలని  ట్రంప్ గురువారం  ప్రకటించారు. 

భద్రతా కారణాల దృష్ట్యా టిక్‌టాక్ తో సహ 100కి పైగా ఇతర చైనా మొబైల్ యాప్ లను మొదటి ఇండియా నిషేధించింది. అమెరికా ఉన్నతాధికారులు ఈ చర్యను ప్రశంసించారు. 

click me!