రిలయన్స్ జియోలో కొత్త కస్టమర్ల సునామీ..దేశంలో అతిపెద్ద టెలికాం సంస్థగా..

By Sandra Ashok Kumar  |  First Published Jun 30, 2020, 5:12 PM IST

తాజాగా  ఫిబ్రవరి నెలలో 62 లక్షలకు పైగా కొత్త వినియోగదారులను  రిలయన్స్ జియోలో చేరడంతో అతిపెద్ద టెలికాం కంపెనీగా అగ్రస్థానంలో నిలిచింది. అధిక  మార్కెట్‌ వాటా సొంతం చేసుకున్న  జియో  దేశంలో అతిపెద్ద టెలికాం సంస్థగా అవతరించింది. 


న్యూ ఢిల్లీ: భారత టెలికాం రిలయన్స్‌ జియో హ్యాట్రిక్ మీద హ్యాట్రిక్ కొడుతుంది. పెట్టుబడుల జోరుతో రిలయన్స్ ఇండస్ట్రీస్ దూసుకెళ్తుంది. తాజాగా  ఫిబ్రవరి నెలలో 62 లక్షలకు పైగా కొత్త వినియోగదారులను  రిలయన్స్ జియోలో చేరడంతో అతిపెద్ద టెలికాం కంపెనీగా అగ్రస్థానంలో నిలిచింది.

అధిక  మార్కెట్‌ వాటా సొంతం చేసుకున్న  జియో  దేశంలో అతిపెద్ద టెలికాం సంస్థగా అవతరించింది. భారతి ఎయిర్‌టెల్ లో 9 లక్షల కొత్త కస్టమర్లు చెరారు. రిలయన్స్ జియోలో 38.28 కోట్లకు పైగా, భారతీ ఎయిర్‌టెల్ 32.90 కోట్లకు పైగా కస్టమర్లను కలిగి ఉందని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) విడుదల చేసిన డేటాను చూపించింది.

Latest Videos

undefined

ప్రభుత్వ ఆధీనంలో ఉన్న బిఎస్‌ఎన్‌ఎల్ 4.39 కోట్లకు పైగా కొత్త కస్టమర్లతో  మొత్తం 11.99 కోట్లకు చేరుకుంది. మరోవైపు వోడాఫోన్ ఐడియా చందాదారుల సంఖ్య కోత కొనసాగించింది, ఎందుకంటే ఇది తాజాగా 34.67 లక్షల మంది కస్టమర్లను కోల్పోయింది. దీంతో మొత్తం కస్టమర్ల సంఖ్య 32.55 కోట్లకు చేరింది.

also read 

"మొత్తం వైర్‌లెస్ చందాదారులు (2జి, 3జి & 4జి) జనవరి -20 చివరిలో 1,156.44 మిలియన్ (115.64 కోట్లు) నుండి ఫిబ్రవరి -20 చివరి నాటికి 1,160.59 మిలియన్లకు (116.05 కోట్లు) పెరిగింది, నెలవారీ పెరుగుదల రేటు 0.36 శాతంగా నమోదైంది.”అని ట్రాయ్ ప్రకటనలో తెలిపింది.

అయితే, పట్టణ ప్రాంతాల్లో వైర్‌లెస్ కస్టమర్లు జనవరి చివరిలో 64.45 కోట్ల నుంచి ఫిబ్రవరి చివరినాటికి 64.32 కోట్లకు చేరింది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో వైర్‌లెస్ చందాదారుల సంఖ్య జనవరి చివరిలో 51.19 కోట్ల నుండి ఫిబ్రవరి చివరిలో 51.73 కోట్లకు పెరిగింది. పట్టణ, గ్రామీణ వైర్‌లెస్ చందాదారుల సంఖ్య నెలవారీ వృద్ధి రేటు వరుసగా 0.20 శాతం నుండి 1.06 శాతం పెరిగింది.
 

click me!