రియల్‌మీ యూత్‌ డేస్‌ సేల్‌..స్మార్ట్ ఫోన్స్, గ్యాడ్జెట్స్ పై ఆఫర్లే ఆఫర్లు..

Ashok Kumar   | Asianet News
Published : Aug 21, 2020, 04:47 PM IST
రియల్‌మీ యూత్‌ డేస్‌ సేల్‌..స్మార్ట్ ఫోన్స్, గ్యాడ్జెట్స్ పై ఆఫర్లే ఆఫర్లు..

సారాంశం

స్మార్ట్‌ఫోన్‌లు, ఇయర్‌ఫోన్లు, వెరబుల్ వాటిపై 60 శాతం వరకు డిస్కౌంట్ ఉంటుందని కంపెనీ తెలిపింది. ఈ సెల్ ప్రతిరోజూ మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లాష్ డీల్స్ అందిస్తుంది. రియల్‌మీ 6, రియల్‌మీ ఎక్స్ 2 ప్రో, అనేక ఇతర డివైజెస్ పై డిస్కౌంట్ ఉంటుంది.

స్మార్ట్ ఫోన్ తయార్ సంస్థ రియల్‌మీ యూత్ డేస్ సెల్ వచ్చే వారం ఆగస్టు 24 నుంచి ప్రారంభించనునట్లు ప్రకటించింది. ఈ సెల్ ఐదు రోజుల పాటు ఉంటుంది, ఆగస్టు 28తో ముగుస్తుంది. స్మార్ట్‌ఫోన్‌లు, ఇయర్‌ఫోన్లు, వెరబుల్ వాటిపై 60 శాతం వరకు డిస్కౌంట్ ఉంటుందని కంపెనీ తెలిపింది.

ఈ సెల్ ప్రతిరోజూ మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లాష్ డీల్స్ అందిస్తుంది. రియల్‌మీ 6, రియల్‌మీ ఎక్స్ 2 ప్రో, అనేక ఇతర డివైజెస్ పై డిస్కౌంట్ ఉంటుంది. రియల్‌మీ బ్యాండ్‌ డిస్కౌంట్ ధరతో రూ. 1,169కె విక్రయించనుంది. రియల్‌మీ యూత్ డేస్ సెల్ కోసం సోమవారం నుంచి కంపెనీ ప్రత్యేక లైవ్ చేసింది.

సెల్ సమయంలో ఉండే అన్ని డీల్స్ పై సైట్ ప్రివ్యూను అందిస్తుంది. రియల్‌మీ 6, రియల్‌మీ ఎక్స్‌ 2 ప్రో, రియల్‌మీ ఎక్స్‌, రియల్‌మీ ఎక్స్‌ 50 ప్రో స్మార్ట్‌ఫోన్‌లపై ధరల తగ్గింపు ఉంటుందని పేర్కొంది. ధర తగ్గింపుపై ఖచ్చితమైన వివరాలను ఇంకా తెలపలేదు.

also read మైక్రోసాఫ్ట్ ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌ కు ఇక గుడ్ బై.. ? ...

వెరబుల్ వాటి విషయానికి వస్తే రియల్‌మీ వాచ్, రియల్‌మీ బ్యాండ్ పై రియల్‌మీ యూత్ డేస్‌లో ధరల తగ్గింపును చూడవచ్చు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానున్న ఫ్లాష్ సెల్ సమయంలో రియల్‌మీ బ్యాండ్  ధర రూ. 1,169 అందిస్తుంది, దీని అసలు ధర రూ. 1,499.

మ్యూజిక్ విభాగంలో రియల్‌మీ బడ్స్ ఎయిర్ నియో, రియల్‌మీ బడ్స్ క్యూ, రియల్‌మీ బడ్స్ వైర్‌లెస్, రియల్‌మీ బడ్స్ ఎయిర్ ధరలపై తగ్గింపు లభిస్తుంది. జూన్ 2020లో రియల్‌మీ బడ్స్ క్యూను భారతదేశంలో లాంచ్ చేసింది.

ఈ ఇయర్‌బడ్ల ధర రూ. 1,999 దీనిని 10 ఎంఎం డైనమిక్ డ్రైవర్లతో అమర్చారు అంతేకాదు 4.5 గంటల బ్యాటరీ లైఫ్ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. రియల్‌మీ టోటె బాగ్, రియల్‌మీ బ్యాక్‌ప్యాక్‌లతో పాటు 30W పవర్ బ్యాంక్‌ను డిస్కౌంట్ డీల్స్ లో భాగంగా ఉంచింది.

అన్ని డీల్స్ ఖచ్చితమైన ధర తగ్గింపులతో పాటు త్వరలో రియల్‌మీ యూత్ డేస్ సెల్ ప్రత్యేక పేజీలో ప్రత్యక్ష ప్రసారం అవుతాయి.
 

PREV
click me!

Recommended Stories

Best Camera Phones : 2025లో టాప్ 5 కెమెరా స్మార్ట్‌ఫోన్లు ఇవే
Starlink : ఎలన్ మస్క్ స్టార్‌లింక్ భారత్‌లో స్టార్ట్ : ప్లాన్‌లు, స్పీడ్, సైన్‌అప్.. ఫుల్ డిటెయిల్స్ ఇవే