ఫౌ-జి గేమ్ ను నవంబర్ తరువాత విడుదల చేయనున్నట్లు కంపెనీ గతంలో ధృవీకరించినప్పటికీ, అధికారిక లాంచ్ తేదీని స్పష్టం చేయలేదు. గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్లలో డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఫౌ-జి అందుబాటులో ఉంటుందని ఎన్-కోర్ సంస్థ పేర్కొంది.
న్యూ ఢీల్లీ: లక్షలాది మంది ఇండియన్ మొబైల్ గేమర్లు పబ్-జి మొబైల్ ఇండియా గేమ్ లాంచ్ కోసం ఎదురుచూస్తున్నరు. అయితే దేశీయ గేమింగ్ సంస్థ ఎన్-కోర్ కూడా త్వరలో పబ్-జికి పోటీగా ఫౌ-జి గేమ్‌ను ప్రారంభించడానికి సన్నద్ధమవుతోంది.
ఫౌ-జి గేమ్ ను నవంబర్ తరువాత విడుదల చేయనున్నట్లు కంపెనీ గతంలో ధృవీకరించినప్పటికీ, అధికారిక లాంచ్ తేదీని స్పష్టం చేయలేదు. గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్లలో డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఫౌ-జి అందుబాటులో ఉంటుందని ఎన్-కోర్ సంస్థ పేర్కొంది.
undefined
గతంలో టాప్ గేమింగ్ టైటిల్స్‌పై పనిచేసిన 25 మందికి పైగా ప్రోగ్రామర్లు, ఆర్టిస్టులు, పరీక్షకులు, డిజైనర్ల బృందం ప్రస్తుతం ఫౌ-జి గేమ్‌ను అభివృద్ధి చేస్తోందని భారతీయ గేమింగ్ సంస్థ ఎన్-కోర్ గతంలో తెలిపింది.
మల్టీ-ప్లేయర్ గేమ్ ఫియర్ లెస్ అండ్ యునైటెడ్ గార్డ్స్ పేరుతో వస్తున్న ఫౌ-జి గేమ్ పబ్-జి మొబైల్‌కు ప్రత్యామ్నాయంగా భారతీయ ప్రజలకు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది, అయితే కొన్ని రోజుల క్రితం 117 యాప్స్ తో పాటు పబ్-జి గేమ్ ని భారత ప్రభుత్వం నిషేదించిన సంగతి తెలిసిందే.
also read
మల్టీప్లేయర్ యాక్షన్ గేమ్ పబ్-జిని భారత ప్రభుత్వం సెప్టెంబర్ 2న నిషేధించింది. భారత ప్రభుత్వం ఆదేశాల మేరకు భారతదేశంలోని గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్ రెండింటి నుంచి తొలగించింది.
పబ్-జి కార్ప్ ఒక భారతీయ అనుబంధ సంస్థతో కొత్త గేమ్ సృష్టించి భారత మార్కెట్లోకి తిరిగి ప్రవేశిస్తున్నట్లు అధికారికంగా ధృవీకరించినప్పటికీ, అధికారిక తేదీని మాత్రం పేర్కొనలేదు.
పబ్-జి మొబైల్ ఇండియా కొత్త వెర్షన్‌లో టైర్ 1 టీమ్ లకు కనీస వేతనం 40వేల నుంచి రూ .2 లక్షల వరకు రూ.6 కోట్ల ప్రైజ్ ఉంటుందని మీడియా నివేదికలు తెలిపాయి.
ఈ నెలలో కొత్త పబ్-జి గేమ్ ప్రారంభించవచ్చని ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లపై చాలా పుకార్లు వచ్చాయి. అయితే, కొత్త పబ్-జి గేమ్ ప్రారంభించే తేదీపై ఇంకా అధికారిక నిర్ధారణ లేదని తెలుస్తోంది.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే పబ్-జి మొబైల్ ఇండియా ఏపికే వెర్షన్ సంస్థ అధికారిక వెబ్‌సైట్‌లో శుక్రవారం కొన్ని గంటలు పాటు అందుబాటులో ఉంచారు. ఏపికే వెర్షన్ డౌన్‌లోడ్ చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నాప్పటికి కొంతమంది ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం గత శుక్రవారం ఏపికే వెర్షన్ కూడా విడుదల చేసింది.