పబ్-జి గేమర్స్ కి గుడ్ న్యూస్.. త్వరలో నిషేధం ఎత్తివేసే అవకాశం ?

By Sandra Ashok Kumar  |  First Published Sep 8, 2020, 1:37 PM IST

 అంతకు ముందు కూడా టిక్ టాక్ తో సహ మరో 58 చైనా యాప్స్ ని భారత ప్రభుత్వం నిషేదించిన సంగతి మీకు తెలిసిందే. ఇండియాలో టాప్ గేమ్స్ లో పబ్-జి ఒకటిగా ఉంది. అయితే పబ్-జిపై  నిషేధం విధించటంతో గేమింగ్ కమ్యూనిటీ నిరాశ చెందింది. 


గత వారం భారత ప్రభుత్వం ఇండియాలో 118 చైనా యాప్‌లను నిషేధించాలని ఒక ఆర్డర్ జారీ చేసింది. ఇందులో తక్కువ సమయంలో ఎంతో పాపులర్ అయిన బ్యాటిల్ గేమ్ పబ్-జి కూడా ఉంది. అంతకు ముందు కూడా టిక్ టాక్ తో సహ మరో 58 చైనా యాప్స్ ని భారత ప్రభుత్వం నిషేదించిన సంగతి మీకు తెలిసిందే.

ఇండియాలో టాప్ గేమ్స్ లో పబ్-జి ఒకటిగా ఉంది. అయితే పబ్-జిపై  నిషేధం విధించటంతో గేమింగ్ కమ్యూనిటీ నిరాశ చెందింది. బ్లూహోల్ ఆధ్వర్యంలోని ఒరిజినల్ ఇంటర్నల్ గేమింగ్ బ్రాండ్ అయిన పబ్-జి కార్పొరేషన్ తాజాగా ఒక అధికారిక ప్రకటన చేసింది.

Latest Videos

undefined

పబ్-జి  కార్పొరేషన్ ప్రకారం ఇండియాలో పబ్-జి నిషేధం పై ఉన్న అన్నీ సమస్యలను పరిశీలించిన తరువాత భారతదేశంలో టెన్సెంట్ గేమ్స్ పబ్-జి మొబైల్ గేమ్  నియంత్రించదని,  పబ్-జి కార్పొరేషన్ అన్ని పబ్లికేషన్ బాధ్యతలను తీసుకుంటుందని ధృవీకరించింది.

also read పబ్: జి గేమ్ లవర్స్ కి గుడ్ న్యూస్.. త్వరలో ఇండియన్ యాప్ ఫవ్: జి వచ్చేస్తోంది.. ...

దక్షిణ కొరియాకు చెందిన గేమింగ్ సంస్థ కొత్తగా బాధ్యతలను స్వీకరిస్తోందని, త్వరలో పబ్-జి  గేమ్ పై  ఇండియాలో నిషేధం ఎత్తివేసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. భారతదేశంలో 118 చైనీస్ యాప్స్ నిషేధించిన ఒక రోజు తర్వాత, టెన్సెంట్ గేమ్స్ మార్కెట్ విలువ 34 బిలియన్ డాలర్లను కోల్పోయినట్లు తెలిసింది.

పబ్-జి కార్పొరేషన్ ప్రకటనలో ఏముందంటే..

పబ్-జి గేమ్ ప్లేయర్ డేటా గోప్యత, భద్రతకు మొదటి ప్రాధాన్యతగా ప్రభుత్వం తీసుకున్న చర్యలను పబ్-జి కార్పొరేషన్ పూర్తిగా అర్థం చేసుకొని గౌరవిస్తుంది. భారతీయ చట్టాలు, నిబంధనలను పూర్తిగా పాటించడానికి భారత ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని పబ్-జి కార్పొరేషన్ భావిస్తోంది.

ఇటీవల జరిగిన పరిణామాల దృష్ట్యా పబ్-జి కార్పొరేషన్ భారతదేశంలో టెన్సెంట్ గేమ్స్ కి పబ్-జి మొబైల్ ఫ్రాంచైజీకి అధికారం ఇవ్వకూడని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

పబ్-జి కార్పొరేషన్ ఇండియాలో అన్ని బాధ్యతలను తీసుకుంటుందని, సాధ్యమైనంత ఉత్తమమైన గేమింగ్ అనుభవాలను అందించడానికి, ఎంచుకున్న ప్రదేశాలలో పబ్-జి మొబైల్‌తో సహా అన్నీ ప్లాట్‌ఫామ్‌లపై పబ్-జిని అభివృద్ధి చేయడంలో కంపెనీ చురుకుగా ఉందిని తెలిపింది.
 

click me!