భారీ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పోకో ఏం సిరీస్ కొత్త స్మార్ట్ ఫోన్

By Sandra Ashok KumarFirst Published Nov 19, 2020, 6:35 PM IST
Highlights

పోకో ఎం2, పోకో ఎం2ప్రో తర్వాత ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ పోకో ఎమ్ సిరీస్‌లో మూడవ మోడల్. పోకో ఎం3 స్మార్ట్ ఫోన్ గురించి వివరాలను ఇంకా అధికారికంగా వెల్లడించనప్పటికీ, కొన్ని ముఖ్యమైన ఫీచర్స్ ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్నాయి.

చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ పోకో నవంబర్ 24న పోకో ఎం3 లాంచ్ కానున్నట్లు ట్విట్టర్‌ ద్వారా ప్రకటించింది. పోకో ఎం2, పోకో ఎం2ప్రో తర్వాత ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ పోకో ఎమ్ సిరీస్‌లో మూడవ మోడల్. పోకో ఎం3 స్మార్ట్ ఫోన్ గురించి వివరాలను ఇంకా అధికారికంగా వెల్లడించనప్పటికీ, కొన్ని ముఖ్యమైన ఫీచర్స్ ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్నాయి.

ఈ కొత్త పోకో ఫోన్ మోడల్ M2010J19CG నంబర్ తో వస్తుందని భావిస్తున్నారు. పోకో ఎం3 స్మార్ట్ ఫోన్ రాబోయే రెడ్‌మి నోట్ 10 ఫోన్ రీబ్రాండెడ్ వెర్షన్ గా రావచ్చు.

పోకో గ్లోబల్ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్ట్ చేసిన ట్వీట్ ప్రకారం, పోకో ఎం3 నవంబర్ 24 సాయంత్రం 5:30 గంటలకు వర్చువల్ ఈవెంట్ ద్వారా లాంచ్ కానుంది. పోకో ఎం3 గురించి వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడికాలేదు.

also read  

అయితే పోకో మార్కెటింగ్ మేనేజర్, గ్లోబల్ ప్రతినిధి అంగస్ కై హో ఎన్‌జి గత నెలలో కొత్త పోకో ఫోన్ 2020 చివరి కంటే ముందే వస్తుందని టీజ్ చేశారు. 

పోకో ఎం3 ఫీచర్లు
పోకో ఎం3 గురించి పూర్తి వివరాలు లేనప్పటికి యూట్యూబ్‌లో పోస్ట్ చేసిన వీడియో ద్వారా దీని ప్రత్యేకతలను వెల్లడించారు. 6.53-అంగుళాల పూర్తి-హెచ్‌డి + డిస్‌ప్లేతో పాటు డాట్ డ్రాప్ డిజైన్‌తో వస్తుందని తెలిపారు.

పోకో ఎం3లో ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 662 SoC, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ హైలైట్ చేస్తూ పుకార్లు వినిపిస్తున్నాయి. పోకో ఎం3 డ్యూయల్ స్పీకర్లతో 6000 mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తున్నట్లు సమాచారం.

I don’t know about you, but I truly miss the feeling of waiting for a new POCO to be revealed. 🙌
Introducing POCO M3, Our MOST ???? yet! 😏 Is pic.twitter.com/pQKQoGbFSe

— POCO (@POCOGlobal)
click me!