ప్రస్తుత జనరేషన్ లో ముఖ్యమైన, వ్యక్తిగత సమాచారాన్ని లేదా ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్స్ ఇలాంటివి డిజిటల్ రూపంలో స్టోర్ చేసుకోవడానికి ప్రజలు వారి స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగిస్తున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ బ్రాండ్, ఎలక్ట్రానిక్స్ సంస్థ ఒప్పో ఒక కొత్త స్మార్ట్ ఫోన్ ని తీసుకొచ్చింది.
గత కొన్ని సంవత్సరాలుగా స్మార్ట్‌ఫోన్‌లు కేవలం ఒక డివైజ్ మాత్రమే కాకుండా మరింత అభివృద్ధి చెందాయి. ప్రజల నిత్యవసరలో స్మార్ట్ ఫోన్ ఒకటిగా నిలిచింది. ఏ పని చేయాలనుకున్న స్మార్ట్ ఫోన్ అది మరింత సులభంగా చేయడానికి సహకరిస్తుంది. ప్రస్తుత జనరేషన్ లో ముఖ్యమైన, వ్యక్తిగత సమాచారాన్ని లేదా ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్స్ ఇలాంటివి డిజిటల్ రూపంలో స్టోర్ చేసుకోవడానికి ప్రజలు వారి స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగిస్తున్నారు.
దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ బ్రాండ్, ఎలక్ట్రానిక్స్ సంస్థ ఒప్పో ఒక కొత్త స్మార్ట్ ఫోన్ ని తీసుకొచ్చింది. కొత్త ఒప్పో ఏ12 స్మార్ట్ ఫోన్ రెండు వెరీఎంట్లలో మాత్రమే లభిస్తుంది.3జిబి ర్యామ్ + 32జిబి స్టోరేజ్, 4జిబి ర్యామ్+ 64జిబి స్టోరేజ్. చెప్పాలంటే ఇది పవర్ ప్యాక్డ్ ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ గా నిలవనుంది. మెమొరీ కార్డ్ ద్వారా ఫోన్ స్టోరేజ్ 256జిబి వరకు పెంచుకోవడానికి సపోర్ట్ చేస్తుంది.
undefined
మీరు ఊహించిన డిజైన్, అద్భుతమైన బ్యాటరీ బ్యాక్ అప్, ఆకర్షణీయమైన ఫ్రంట్, బ్యాక్ కెమెరా క్వాలిటి, ఫాస్ట్ పర్ఫమెన్స్, మెరుగైన డిజైన్ మిమ్మల్ని మరింతగా ఆకట్టుకుంటుంది. కొత్త ఒప్పో ఏ12లో మీకు అన్ని రకాల యాప్స్, ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్స్, గేమ్స్ కోసం సరిపడా స్టోరేజ్ మీకు అందిస్తుంది.
కొత్త ఒప్పో ఏ12 అనేది పవర్ ప్యాక్డ్ స్మార్ట్ డివైజ్, స్టెల్లార్ స్టోరేజ్ ఆప్షన్, శక్తివంతమైన పెద్ద బ్యాటరీ, ఏఐ పవర్ తో బ్యాక్ కెమెరా, అధునాతన సెక్యూరిటి ఫీచర్స్, వెనుకవైపు అద్భుతమైన 3డి డైమండ్ బ్లేజ్ డిజైన్ తో వస్తుంది.ఒప్పో ఏ12లో అధునాతన గ్రాఫిక్‌లతో మెరుగైన గేమింగ్, మల్టీ టాస్క్ పర్ఫర్మెంస్, ఆండ్రాయిడ్ ఓఎస్ 9 6.1.2, ఇంకా స్మార్ట్ ఫోన్ అసిస్టెంట్‌తో పాటు అద్భుతమైన విజువల్స్, హైపర్ బూస్ట్‌ను అందించే ప్రత్యేకతలు ఉన్నాయి.
అద్భుతమైన బ్యాటరీ బ్యాక్ అప్
ఒప్పో ఏ12లో పవర్ ఫుల్ 4230 mAh బ్యాటరీతో ప్యాక్ చేసి వస్తుంది, దీనివల్ల 8 గంటల పాటు వీడియో కంటెంట్ చూడవచ్చు. మీడియాటెక్ పి35 ఆక్టా-కోర్ ప్రాసెసర్ వల్ల లాగ్-ఫ్రీ గేమింగ్, వీడియో ప్లేబ్యాక్ అనుభవంతో పాటు లో పవర్ కన్సంప్షన్ ద్వారా మీకు ప్రతిసారి ఛార్జింగ్ పెట్టె అవసరం ఉండదు.
మీలోని ఫోటోగ్రాఫర్ కోసం
ఈ రోజుల్లో ప్రజలు ఫోన్ కొనేటప్పుడు మొదటిగా చూసేదీ బ్యాక్, ఫ్రంట్ కెమెరా క్వాలిటి, స్పష్టమైన ఫోటోలను హై రిజల్యూషన్‌తో తీసుకునేల ఉందా లేదా అని చూస్తారు. ఒప్పో ఏ12 ఏఐ డ్యూయల్ రియర్ కెమెరా ఫోటోలను తీయడంలో నిజమైన ఆనందాన్ని ఇస్తుంది. బ్యాక్ కెమెరా 13 ఎంపితో, 6x డిజిటల్ జూమ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ల్యాండ్‌స్కేప్ ఫోటోలతో పాటు యాక్షన్ ఫోటోలను క్లిక్ చేయడానికి ఇది సరైనది.
2ఎంపి డెప్త్ కెమెరా హార్డ్వేర్-బెసేడ్ పోర్ట్రెయిట్ బోకె ఎఫెక్ట్స్ తో అద్భుతమైన పోర్ట్రెయిట్ ఫోటోలకు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ హైలైట్ ఏంటంటే డాజల్ కలర్ మోడ్. లైటింగ్ సరిగా లేనపుడు కొన్ని స్పెషల్ మూమెంట్లను మీరు ఫోటోలు తీయలేకపోతున్నారా? అయితే కొత్త ఒప్పో ఏ12 తో మీరు అలాంటి వాటి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు.ఫోటోలకు డాజల్ కలర్ మోడ్ ద్వారా శక్తివంతమైన, సహజమైన రంగులను ఇస్తుంది.
పిక్సెల్-గ్రేడ్ కలర్ మ్యాపింగ్ అల్గోరిథం దీనికి సపోర్ట్ ఇస్తుంది. కాబట్టి తక్కువ కాంతిలో కూడా మీరు అద్భుతమైన ఫోటోలను చాలా స్పష్టంగా తీయగలుగుతారు. ఒప్పో ఏ12 ఏఐ కెమెరా ద్వారా పర్ఫెక్ట్ ఫోటోలను తీయవచ్చు. ఇందులోని లేటెస్ట్ ఏఐ అల్గోరిథంలు ఆటోమేటిక్ గా స్కిన్ క్వాలిటీ, వయస్సు, జెండర్, స్కిన్ కలర్ గుర్తించి తదనుగుణంగా అడ్జస్ట్ చేస్తుంది.
Add an abstract edge to your style! Introducing the , equipped with a Dual Rear Camera, 4GB RAM & 64GB ROM, 4230mAh Battery and many more features for you to explore. Sale starts from 10th June.
Know more: https://t.co/zoFISXoIO8 pic.twitter.com/h3KCqyZKjO
ఏఐ అడ్వాన్స్డ్ సెక్యూరిటి
ఒప్పో ఏ12లో డేటా సెక్యూరిటిని నిర్ధారించడానికి ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఏఐ ఫేషియల్ ఆన్ లాక్ ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్ స్మార్ట్‌ఫోన్ వెనుక ప్యానెల్ పై ఉంటుంది. ఇది ఫోన్‌ను అన్‌లాక్ చేయడానికి మరింత సౌకర్యంగా ఉంటుంది. ఒప్పో ఏ12 ఏఐ ఫేషియల్ అన్‌లాక్ ఫీచర్‌తో మొబైల్‌లో ఉన్నతమైన, మెరుగైన భద్రతను అందిస్తుంది.
డిజైన్
ఒప్పో ఏ12 స్మార్ట్ ఫోన్ వినియోగదారుల అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని తయారు చేసింది. దీని 6.22 ” వాటర్‌డ్రాప్ ఐ ప్రొటెక్షన్ స్క్రీన్ యూజర్ కంటి చూపును కాపాడుతుంది ఇంకా కంటిపై ఒత్తిడిని తగ్గిస్తుంది. 8.3ఎంఎం మందంతో పట్టుకోవడం సౌకర్యంగా ఉంటుంది. 3డి డైమండ్ బ్లేజ్ బ్యాక్ ప్యానెల్ అద్భుతమైన లూక్స్, ప్రీమియం అనుభూతిని ఇస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ కేవలం బ్లాక్, బ్లూ రెండు కలర్ లలో మాత్రమే లభిస్తుంది.
''
ధర, లభ్యత, ఆఫర్లు
ప్రస్తుత రోజుల్లో వినియోగదారుల డిమాండ్ అనుగుణంగా దీనిని తయారు చేశారు. ఇది ఆఫ్‌లైన్ స్టోర్లలో, ప్రముఖ ఆన్‌లైన్ ఇ-కామర్స్ వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంది. ఒప్పో ఏ12 3జిబి + 32జిబి ధర రూ. 9,990, 4 జీబీ + 64 జీబీ వేరియంట్ ధర రూ .11,490. 21 జూన్ 2020 లోపు దీనిని కొనుగోలు చేస్తే వారికి 6 నెలల అదనపు వారంటీతో అద్భుతమైన ఆఫర్‌లను పొందవచ్చు.
ఏదైనా ఆఫ్‌లైన్ స్టోర్ ద్వారా కొనుగోలు చేస్తే 6 నెలల అదనపు వారంటీతో పాటు మీరు బ్యాంక్ ఆఫ్ బరోడా డెబిట్ కార్డ్ ఈఎంఐతో 5% క్యాష్‌బ్యాక్‌ను కూడా పొందవచ్చు. ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ పై 5% క్యాష్‌బ్యాక్ కూడా మీరు పొందవచ్చు. క్రెడిట్, డెబిట్ కార్డ్ లావాదేవీలపై 6 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ అందిస్తుంది. బజాజ్ ఫిన్సర్వ్, ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్, హోమ్ క్రెడిట్, హెచ్‌డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్, ఐసిఐసిఐ బ్యాంక్ కూడా ఆకర్షణీయమైన ఇఎంఐ ఆప్షన్ అందిస్తున్నాయి.