స్టూడెంట్స్, టీచర్స్ కోసం వన్‌ప్లస్ ఇన్స్టంట్ డిస్కౌంట్ ఆఫర్.. అదనంగా 5% డిస్కౌంట్ కూడా..

By Sandra Ashok KumarFirst Published Nov 18, 2020, 12:17 PM IST
Highlights

ఈ కార్యక్రమంలో భారతదేశం అంతటా ఉన్న 760 విశ్వవిద్యాలయాలు, 38,498 కళాశాలలు ఉన్నాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులకు వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ లేదా వన్‌ప్లస్ టీవీని కొనుగోలు పై రూ. 1,000 ఇన్స్టంట్ డిస్కౌంట్ తగ్గిస్తుంది. 

వన్‌ప్లస్ సంస్థ భారతదేశంలో కొత్త ఎడ్యుకేషన్ బెనిఫిట్స్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది, ఇందులో విద్యార్థులు, ఉపాధ్యాయులకు ప్రత్యేకమైన ప్రోత్సాహకాలు, తగ్గింపులు అందించనుంది. ఈ కార్యక్రమంలో భారతదేశం అంతటా ఉన్న 760 విశ్వవిద్యాలయాలు, 38,498 కళాశాలలు ఉన్నాయి.

విద్యార్థులు, ఉపాధ్యాయులకు వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ లేదా వన్‌ప్లస్ టీవీని కొనుగోలు పై రూ. 1,000 ఇన్స్టంట్ డిస్కౌంట్ తగ్గిస్తుంది. కాలేజీ లేదా యూనివర్సిటీలకు వెళ్ళేవారికి ఏదైనా వన్‌ప్లస్ అసెసోరిఎస్ పై ఐదు శాతం తగ్గింపును కూడా కంపెనీ అందిస్తోంది.

వన్‌ప్లస్ ఎడ్యుకేషన్ బెనిఫిట్స్ ప్రోగ్రామ్‌లో ఆఫర్‌లను పొందడానికి అర్హతగల విద్యార్థులు లేదా ఉపాధ్యాయులు ఏదైనా యూనివర్సిటీ లేదా కాలేజీలో విద్యను అభ్యసిస్తున్నట్టు ధృవీకరణ చేయాల్సి ఉంటుంది.

also read 

ధృవీకరణ ప్రక్రియను సులభతరం చేయడానికి స్టూడెంట్ బీన్స్‌తో వన్‌ప్లస్ భాగస్వామ్యం చేసుకున్నట్లు ఫోరమ్‌లలో తెలిపింది. స్టూడెంట్ బీన్స్ నిర్వహించిన ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత, వారి వన్‌ప్లస్ ఖాతాకు కొత్త కూపన్ వోచర్ లభిస్తుంది.

ప్రస్తుతం నమోదు చేసుకున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు మాత్రమే ఈ తగ్గింపుకు అర్హులు. ఈ బెనెఫిట్స్ సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఉపయోగించుకోవచ్చు, ఆడియో డివైజెస్, ఇతర వాటితో సహా అన్ని ఉపకరణాలపై ఐదు శాతం తగ్గింపు కూడా ఇవ్వబడుతుంది.  

ఒక సంవత్సరం తర్వాత ఈ వోచర్ ఎక్స్‌పైర్ అవుతుంది. ఒకసారి ఎక్స్‌పైర్ అయ్యాక కొత్త వోచర్ కోసం మళ్లీ ధ్రువీకరించుకోవాలి.

వన్‌ప్లస్ ఇటీవల భారతదేశంలో వన్‌ప్లస్ 8టి స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది, దీని ధర రూ.42,999. ఈ ఫోన్ రెండు స్టోరేజ్ కాన్ఫిగరేషన్లలో లభిస్తుంది. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ఆప్షన్ ధర రూ. 42,999 కాగా, 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 45,999. దినీ 4,500mAh బ్యాటరీ కేవలం 39 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ అవుతుందని సంస్థ పేర్కొంది.  

click me!