కొత్త ఐఫోన్లను రిలీజ్‌ చేయట్లేదు: యాపిల్‌ చీఫ్

By Sandra Ashok KumarFirst Published Jul 31, 2020, 1:53 PM IST
Highlights

కాన్ఫరెన్స్ కాల్ సందర్భంగా ఆపిల్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ లూకా మాస్త్రీ కొత్త ఐఫోన్‌ల విడుదల కొన్ని వారాల పాటు ఆలస్యం అవుతుందని ధృవీకరించారు. మీకు తెలిసినట్లుగా గత సంవత్సరం మేము సెప్టెంబర్ చివరిలో కొత్త ఐఫోన్‌ల సేల్స్ ప్రారంభించాము.

ఆపిల్ ఐఫోన్‌ ప్రత్యేకతనే వేరు. ప్రతియేటా సెప్టెంబర్ నెలలో కొత్త మోడల్ ఐఫోన్‌ లాంచ్ చేస్తూ వస్తుంది. ఎప్పటిలాగే కొత్త ఐఫోన్ సిరీస్‌ను కొనుగోలు చేయాలనుకునే వారికి షాకింగ్ న్యూస్ అదేంటంటే ఐఫోన్ 12 లాంచ్ మరికొన్ని వారాలు ఆలస్యం అవుతుందని ఆపిల్ ధృవీకరించింది.

టెక్ దిగ్గజం ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఐఫోన్ 12 సిరీస్‌ను విడుదల చేయనున్నట్లు గతంలో  పుకార్లు వచ్చాయి. కాన్ఫరెన్స్ కాల్ సందర్భంగా ఆపిల్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ లూకా మాస్త్రీ కొత్త ఐఫోన్‌ల విడుదల కొన్ని వారాల పాటు ఆలస్యం అవుతుందని ధృవీకరించారు.

మీకు తెలిసినట్లుగా గత సంవత్సరం మేము సెప్టెంబర్ చివరిలో కొత్త ఐఫోన్‌ల సేల్స్ ప్రారంభించాము. ఈ సంవత్సరం కూడా ఎప్పటిలాగే కొత్త ఐఫోన్‌ లాంచ్ ఉంటుందని కాకపోతే కొన్ని వారాల తరువాత అందుబాటులోకి తెస్తాము అని అన్నారు.

also read 

ఆపిల్ తన కొత్త ఐఫోన్‌లను, ఇతర ఆపిల్ డివైజెస్ లను సెప్టెంబర్‌లో ప్రతియేట విడుదల చేస్తుంది. క్యూ3 2020 ఫలితాలను యాపిల్‌ విడుదల చేసిన సమయంలో దీనిపై స్పష్టతనిచ్చింది. కంపెనీ త్రైమాసిక ఆదాయం 59.7 బిలియన్‌ డాలర్లుగా ప్రకటించింది.  ఏడాది క్రితం ఇదే త్రైమాసికంతో పోలిస్తే 11శాతం పెరిగింది.  

అయితే ఆపిల్ దాని స్వంత ధోరణిని అనుసరించడం ఇదేం మొదటిసారి కాదు. ఐఫోన్ 8 సిరీస్ సెప్టెంబర్‌లో విడుదలైన కొద్ది నెలల తర్వాత 2017 నవంబర్‌లో ఐఫోన్ ఎక్స్ కూడా వచ్చింది. ఆపిల్ ఐఫోన్ 8 సిరీస్ ప్రారంభించినప్పుడు ఐఫోన్ ఎక్స్ తో వస్తున్నట్లు ఆపిల్ వెల్లడించినప్పటికీ, అది ఆ సంవత్సరం నవంబర్ వరకు స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయలేదు. అదేవిధంగా, ఐఫోన్ ఎక్స్‌ఆర్, ఐఫోన్ ఎక్స్‌ఎస్ మాక్స్ సెప్టెంబర్ 2018 లో ఆవిష్కరించిన ఒక నెల తరువాత ఐఫోన్ ఎక్స్‌ఆర్ కూడా ఆవిష్కరించింది.
 

click me!