“సంథింగ్ బిగ్ ఈజ్ కమింగ్” : మోటరోలా కొత్త స్మార్ట్‌ఫోన్‌ ఫ్లిప్‌కార్ట్‌లో ద్వారా లాంచ్..

By Sandra Ashok Kumar  |  First Published Aug 21, 2020, 11:18 AM IST

రాబోయే స్మార్ట్ ఫోన్ ఆగస్టు 24న భారతదేశంలో విడుదల చేయనున్నట్లు వెల్లడించిన తరువాత ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ వెబ్ సైట్ లో కూడా మోటరోలా కొత్త స్మార్ట్ ఫోన్ గురించి తెలిపింది.
 


లెనోవా యజమాన్యం లోని ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ మోటోరోలా త్వరలో భారత మార్కెట్లో ఒక కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనుంది. దేశంలో కొత్త ఫోన్‌ను లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించింది, అయితే ఈ స్మార్ట్ ఫోన్ పేరును మాత్రం వెల్లడించలేదు.

రాబోయే స్మార్ట్ ఫోన్ ఆగస్టు 24న భారతదేశంలో విడుదల చేయనున్నట్లు వెల్లడించిన తరువాత ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ వెబ్ సైట్ లో కూడా మోటరోలా కొత్త స్మార్ట్ ఫోన్ గురించి తెలిపింది. ట్విటర్ లో లాంచ్ చేసిన టీజర్‌లో ఫోన్ గురించి పెద్దగా వివరాలు వెల్లడించనప్పటికీ, మోటరోలా భారతదేశంలో ఇ7ప్లస్‌ అని ఊహిస్తున్నారు.

Latest Videos

 రాబోయే ఫోన్ టీజర్‌ను ట్విట్టర్‌లో షేర్ చేస్తూ, మోటరోలా అధికారిక అక్కౌంట్ ద్వారా ట్వీట్ చేస్తూ, “అద్భుతమైన డిస్ ప్లే, అద్భుతమైన కెమెరా కోసం సిద్ధంగా ఉండండి! ఫ్లిప్‌కార్ట్‌లో త్వరలో దీనిని ప్రారంభించనున్నారు. ” అని ట్వీట్ చేసింది.

also read 

టీజర్‌లో ఈ స్మార్ట్ ఫోన్ వెనుక ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ ఉన్నట్టు తెలుస్తుంది. ఫోన్ పక్కన అమర్చిన వాల్యూమ్, పవర్ బటన్లను, కింద స్పీకర్ గ్రిల్‌ను కూడా చూడవచ్చు. యూ‌ఎస్‌బి-టైప్ సి ఛార్జింగ్ పోర్టును వీడియో టీజర్‌లో కూడా కనిస్పిస్తుంది.

స్మార్ట్ ఫోన్ వివరాల గురించి పెద్దగా తెలియకపోయినా, మోటరోలా తదుపరి స్మార్ట్‌ఫోన్ ప్రధానంగా కెమెరాపై దృష్టి పెట్టనుంది, అలాగే సంస్థ పేర్కొన్న విధంగా శక్తివంతమైన చిప్‌సెట్‌తో రావచ్చు.

ఫ్లిప్‌కార్ట్‌లోని టీజర్ రాబోయే స్మార్ట్ ఫోన్ స్క్రీన్ పరిమాణాన్ని కూడా సూచిస్తుంది. దీనికి “సంథింగ్ బిగ్ ఇస్ కమింగ్” అని టాగ్ కూడా చేసింది. మోటరోలా డివైజ్  పెద్ద డిస్ ప్లే, శక్తివంతమైన చిప్‌సెట్‌తో లాంచ్ చేస్తుందని అర్ధమవుతుంది-బహుశా క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ ఒకటి, ఫోటోస్ కోసం వెనుక  భాగంలో మల్టీ కెమెరా సెన్సార్లు ఉండొచ్చు.
 

click me!