జియోఫైబర్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. 12 పైగా భాషలతో మీకు నచ్చిన కంటెంట్‌..

By Sandra Ashok Kumar  |  First Published Aug 24, 2020, 3:30 PM IST

జియో సెట్-టాప్-బాక్స్‌లో జియో న్యూస్ ఏకీకరణతో జియో ఫైబర్ వినియోగదారులు ఇప్పుడు వివిధ ప్రముఖ ఆన్‌లైన్ వార్తాపత్రికలు, మ్యాగజైన్‌లు, వీడియోలు, ఫోటోలు మరియు ట్రెండింగ్ న్యూస్ టాపిక్‌ మొత్తం లైబ్రరీకి అక్సెస్ పొందవచ్చు.


డిజిటల్ న్యూస్ యాప్, వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ న్యూస్ అయిన జియోన్యూస్ ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్, వీడియోలు, మ్యాగజైన్స్, వార్తాపత్రికలు & ఫోటో గ్యాలరీలను జియో ఫైబర్ వినియోగదారులకు జియో సెట్ టాప్ బాక్స్ ద్వారా అందుబాటులో తేచ్చింది.

జియో సెట్-టాప్-బాక్స్‌లో జియో న్యూస్ ఏకీకరణతో జియో ఫైబర్ వినియోగదారులు ఇప్పుడు వివిధ ప్రముఖ ఆన్‌లైన్ వార్తాపత్రికలు, మ్యాగజైన్‌లు, వీడియోలు, ఫోటోలు మరియు ట్రెండింగ్ న్యూస్ టాపిక్‌ మొత్తం లైబ్రరీకి అక్సెస్ పొందవచ్చు.

Latest Videos

undefined


 జియో న్యూస్ యాప్ అదనంగా జియో సెట్-టాప్-బాక్స్ (STB) ద్వారా జియో ఫైబర్ కంటెంట్ సమర్పణను మరింత మెరుగుపరుస్తుంది, ఇది ఇప్పటికే  జియో ఫైబర్ చందాదారులకు వినోదం, ఆరోగ్యం, సంగీతం, క్రీడలు, విద్య, వార్తలు అనేక ఓ‌టి‌టి యాప్స్ యాక్సెస్ చేయడానికి అనుమతిస్తుంది.

జియో సినిమా, జియో సావన్, జియో టి‌వి+ వంటి జియో స్వంత యాప్స్ అక్సెస్ కాకుండా స్మార్ట్ న్యూస్ అగ్రిగేటర్ జియో న్యూస్ యాప్ ఇప్పుడు మరింత వినియోగదారుల అనుభవాన్ని అందిస్తుంది.

also read 

జియో న్యూస్ అంటే ఏమిటి
తాజా వార్తలను, న్యూస్ కంటెంట్ లేదా ట్రెండింగ్ వీడియోలు, ఫోటోలతో యూసర్లను అప్ డేట్ చేస్తుంది.
 
కంటెంట్
బ్రేకింగ్ న్యూస్  అలెర్ట్స్ తో ప్రముఖ న్యూస్ సోర్సెస్  350 పైగా ఇ-పేపర్లు, 800పైగా మ్యాగజైన్స్, మిలియన్ల కొద్ది ట్రెండింగ్ వీడియోలు, ఫోటోలతో, జియోన్యూస్ విస్తృత కలెక్షన్ అందిస్తుంది. ఈ యాప్ లో లభ్యమయ్యే 12 పైగా  భాషలతో వారికి ఇష్టమైన న్యూస్ సోర్సెస్ ఎంచుకోవడం ద్వారా వినియోగదారులు అనుభవాన్ని పొందవచ్చు.

వినియోగదారు అనుభవం
బెస్ట్ రీడింగ్ అనుభవాన్ని అందించటానికి  జియో న్యూస్ వినియోగదారులకు జూమ్  ఇన్/జూమ్ అవుట్ చేయడానికి, ఫుల్ పేజీ వ్యూ, ఫుల్ స్క్రీన్ వ్యూ మధ్య మారడానికి అనుమతిస్తుంది.

జియో న్యూస్ మీకు ఇష్టమైన పేపర్‌ ఎడిషన్‌ను ‘యువర్ పేపర్స్’ విభాగంలో అందించడం, “కంటిన్యూ రీడింగ్” లో మీరు చదివిన న్యూస్ బుక్‌మార్క్‌ చేసుకోవడంతో పాటు పర్సనలైజ్డ్ అనుభవాన్ని అందిస్తుంది.

వాయిస్ సెర్చ్ సౌలభ్యంతో మీకు ఇష్టమైన కంటెంట్‌ను కనుగొనడానికి లేదా ట్రెండింగ్ టాపిక్‌ల నుండి ఎంచుకోవడానికి సులభంగా ఉపయోగించగల సేర్చ్ ఫీచర్ కూడా అందుబాటులో ఉంది.

click me!