పోస్ట్‌పెయిడ్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఎలాంటి ఖర్చు లేకుండా జియో పోస్ట్‌పెయిడ్ ప్లస్‌లోకి మారవచ్చు..

By Sandra Ashok KumarFirst Published Oct 9, 2020, 5:07 PM IST
Highlights

ప్రస్తుత పోస్ట్‌పెయిడ్ వినియోగదారుల కోసం జియో “క్యారీ-ఫార్వర్డ్ యువర్ క్రెడిట్ లిమిట్”   ఫీచర్‌ను తీసుకువచ్చింది. ఇది వినియోగదారులు తమ ప్రస్తుత క్రెడిట్ పరిమితిని జియో పోస్ట్‌పెయిడ్ ప్లస్ సేవలో పొందటానికి అనుమతిస్తుంది. 

ఇతర టెలికాం ఆపరేటర్ల నుండి జియో పోస్ట్‌పెయిడ్ ప్లస్‌కు మారుతున్న ప్రస్తుత పోస్ట్‌పెయిడ్ వినియోగదారుల కోసం జియో “క్యారీ-ఫార్వర్డ్ యువర్ క్రెడిట్ లిమిట్”   ఫీచర్‌ను తీసుకువచ్చింది. ఇది వినియోగదారులు తమ ప్రస్తుత క్రెడిట్ పరిమితిని జియో పోస్ట్‌పెయిడ్ ప్లస్ సేవలో పొందటానికి అనుమతిస్తుంది.

జియో పోస్ట్‌పెయిడ్‌ప్లస్ ప్లాన్‌లలో చేరిన ఇతర ఆపరేటర్ల పోస్ట్‌పెయిడ్ కస్టమర్లకు పూర్తిగా సున్నా ఖర్చుతో, ఎటువంటి సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించకుండానే క్రెడిట్ లిమిట్ ని  మొట్టమొదటిసారిగా ‘క్యారీ ఫార్వర్డ్’ ప్రకటించింది.

ఇతర ఆపరేటర్ల వినియోగదారులందరికీ జియో పోస్ట్‌పెయిడ్‌ప్లస్‌లో చేరడానికి సులభతరం చేస్తూ జియో ఈ 'క్యారీ-ఫార్వర్డ్ యువర్ క్రెడిట్ లిమిట్' ఫీచర్‌ను ప్రారంభించింది, దీనితో ఇతర ఆపరేటర్ల పోస్ట్‌పెయిడ్ వినియోగదారులు తమ ప్రస్తుత క్రెడిట్ పరిమితిని తమ ప్రస్తుత ఆపరేటర్ నుండి జియోతో కొనసాగవచ్చు.

కొత్త జియో పోస్ట్‌పెయిడ్ ప్లస్ కనెక్షన్ పొందే వినియోగదారులకు సెక్యూరిటీ డిపాజిట్ అవసరం అని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) వెబ్‌సైట్ ద్వారా వెల్లడైన తరువాత ఈ కొత్త చర్య వచ్చింది.

ఒక్క రూపాయి లేదా సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించకుండా 3 దశల్లో జియో పోస్ట్‌పెయిడ్‌ప్లస్‌లోకి ఎలా మరాలంటే...

also read 

ఈ ఫీచర్ ఎలా ఉపయోగించాలి:

స్టెప్ 1: వాట్సాప్ నుండి 88-501-88-501 కు ‘హాయ్’ అని మెసేజ్ పంపండి (మీరు జియోకు మారలనుకుంటున్న మీ పోస్ట్‌పెయిడ్ నంబర్ నుండి)

స్టెప్ 2: మీ ప్రస్తుత ఆపరేటర్ల పోస్ట్‌పెయిడ్ బిల్లును అప్‌లోడ్ చేయండి

స్టెప్ 3: 24 గంటల తరువాత, మీరు ఏదైనా జియో స్టోర్‌లోకి వెళ్ళి సంప్రదించవచ్చు లేదా మీ జియోపోస్ట్‌పెయిడ్ ప్లస్ సిమ్‌ను హోం డెలివరీ కూడా పొందవచ్చు అది  కూడా ఒక్క రూపాయి / సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించకుండా మీ కోరుకున్న క్రెడిట్ లిమిట్ పొందవచ్చు. 

పోస్ట్‌పెయిడ్ సర్వీస్ విభాగాన్ని మార్చే ప్రయత్నంలో జియో ఇటీవలే జియో పోస్ట్‌పెయిడ్ ప్లస్‌ను ప్రారంభించింది, భారతదేశంలో పోస్ట్‌పెయిడ్ వినియోగదారులకు ఎన్నడూ లేని ప్రయోజనాలతో, కనెక్టివిటీ, ఎంటర్టైన్మెంట్ తో అత్యుత్తమ సేవలను అందించాలని  లక్ష్యంగా పెట్టుకుంది.

కేవలం రూ. 399 కే  650 పైగా లైవ్ టీవీ ఛానెల్స్, వీడియో కంటెంట్, 5 కోట్ల పాటలు, 300పైగా  వార్తాపత్రికలు ఇంకా మరెన్నో, జియో యాప్‌లతో పాటు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ + హాట్‌స్టార్ వంటి ప్రీమియం ఓ‌టి‌టి యాప్స్ జియో పోస్ట్‌పెయిడ్‌ప్లస్ ప్లాన్స్ అందిస్తున్నాయి.

అధిక-నాణ్యత కనెక్టివిటీతో పాటు, ఆన్ లిమిటెడ్ ప్రీమియం ఎంటర్టైన్మెంట్, అంతర్జాతీయ రోమింగ్, అత్యాధునిక ఫీచర్స్ అలాగే ముఖ్యంగా ఉత్తమ కస్టమర్ అనుభవాన్ని అందిస్తుంది.
 

click me!