ఐటెల్‌ నుంచి మరో ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్‌.. బడ్జెట్ ధరకే అందుబాటులోకి..

By S Ashok Kumar  |  First Published Jan 18, 2021, 5:56 PM IST

ఇది గత ఏడాది ఆగస్టులో లాంచ్ చేసిన ఇటెల్ విజన్ 1కి వారసురాలు. ఇటెల్ విజన్ 1 ప్రోలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, సెల్ఫీ షూటర్ అందించారు.


స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ ఐటెల్‌ ఆండ్రాయిడ్ 10 (గో ఎడిషన్)తో ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్‌గా ఐటెల్‌ విజన్ 1 ప్రోని భారతదేశంలో లాంచ్ చేసింది. ఇది గత ఏడాది ఆగస్టులో లాంచ్ చేసిన ఇటెల్ విజన్ 1కి వారసురాలు.

ఇటెల్ విజన్ 1 ప్రోలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, సెల్ఫీ షూటర్ అందించారు. ఫోన్ రెండు కలర్ ఆప్షన్స్, సింగిల్ ర్యామ్ అండ్ స్టోరేజ్ ఆప్షన్ తో వస్తుంది.  

Latest Videos

undefined

ఇటెల్ విజన్ 1 ప్రో ధర 
సింగిల్ వెరీఎంట్ 2జి‌బి ర్యామ్ + 32జి‌బి స్టోరేజ్ ఆప్షన్ ధర 6,599. అరోరా బ్లూ, ఓషన్ బ్లూ అనే రెండు కలర్ ఆప్షన్లలో వస్తుంది. ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా అందుబాటులో ఉంది. ఇటెల్ విజన్ 1 గత ఏడాది ఆగస్టులో 3 జిబి ర్యామ్‌ వెరీఎంట్ ని కూడా లాంచ్ చేసింది, దీని ధర రూ. 6,999.

also read 

ఇటెల్ విజన్ 1 ప్రోలో ఆండ్రాయిడ్ 10 (గో ఎడిషన్)ఓఎస్, 2.5 డి కర్వ్డ్ గ్లాస్, 90 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోతో 6.52-అంగుళాల హెచ్‌డి+ (720x1,600 పిక్సెల్స్) ఐపిఎస్ డిస్‌ప్లే, క్వాడ్-కోర్ SoC,  2జి‌బి ర్యామ్, 32జి‌బి ఇంటర్నల్ స్టోరేజ్  అందించారు.

 ఐటెల్ విజన్ 1 ప్రోలో 8-మెగాపిక్సెల్ ప్రాధమిక సెన్సార్ ద్వారా ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ ఉంది. మిగిలిన రెండు వి‌జి‌ఏ కెమెరా మాడ్యూల్‌లో ఒక ఫ్లాష్ ఉంటుంది. ముందు భాగంలో 5 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ ఇచ్చారు.

 కనెక్టివిటీ ఆప్షన్స్ లో వై-ఫై, డ్యూయల్ యాక్టివ్ 4జి వి‌ఓ‌ఎల్‌టి‌ఈ, ఎల్‌టి‌ఈ / వి‌ఓ వైఫై, బ్లూటూత్, జిపిఎస్, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, ఛార్జింగ్ కోసం మైక్రో-యుఎస్‌బి పోర్ట్ ఉన్నాయి. ఐటెల్ విజన్ 1 ప్రోకు ఏ‌ఐ పవర్ మాస్టర్ టెక్నాలజీతో 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ సపోర్ట్ ఉంది. ఫోన్ వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్ ఫోన్‌ను 0.2 సెకన్లలో అన్‌లాక్ చేయగలదని ఇటెల్ తెలిపింది.  
 

click me!