నాలుగు కెమెరాలతో హానర్ 10 ఎక్స్ లైట్‌ స్మార్ట్ ఫోన్ లాంచ్.. ఇండియాలో ధర ఎంతంటే ?

By Sandra Ashok KumarFirst Published Nov 12, 2020, 12:23 PM IST
Highlights

ఈ ఏడాది ఏప్రిల్‌లో లాంచ్ చేసిన హానర్ 9 ఎక్స్ లైట్  కు అప్‌గ్రేడ్ వెర్షన్ గా వస్తుంది. హానర్ 10 ఎక్స్ లైట్‌ పంచ్‌హోల్ డిస్ ప్లే, నాలుగు కెమెరాలను  అందించారు.

హువావే సబ్ బ్రాండ్ హానర్ సరికొత్త స్మార్ట్‌ఫోన్ హానర్ 10 ఎక్స్ లైట్‌ను విడుదల చేసింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో లాంచ్ చేసిన హానర్ 9 ఎక్స్ లైట్  కు అప్‌గ్రేడ్ వెర్షన్ గా వస్తుంది. హానర్ 10 ఎక్స్ లైట్‌ పంచ్‌హోల్ డిస్ ప్లే, నాలుగు కెమెరాలను  అందించారు.

ఇండియాలో హానర్  10ఎక్స్  లైట్ ధర సుమారు రూ.20వేల ఉండొచ్చని అంచనా. ఫోన్ ఎమరాల్డ్ గ్రీన్, ఐస్లాండిక్ ఫ్రాస్ట్, మిడ్ నైట్ బ్లాక్ వేరియంట్లలో లభిస్తుంది. ఈ ఫోన్ ప్రస్తుతం రష్యా, ఫ్రాన్స్, జర్మనీ మార్కెట్లలో అందుబాటులో ఉంది. భారతదేశంలో ఈ ఫోన్ లాంచ్ గురించి ఎటువంటి సమాచారం లేదు. 

హానర్ 10 ఎక్స్ లైట్ స్పెసిఫికేషన్లు

హానర్ 10 ఎక్స్ లైట్ ఆండ్రాయిడ్ 10 బేస్డ్ హానర్ మ్యాజిక్ యుఐ 3.1తో పనిచేస్తుంది. గూగుల్ ప్లే స్టోర్ లేదా గూగుల్ యాప్స్ ఫోన్‌లో అందుబాటులో ఉండవు. అంతే కాకుండా, ఈ ఫోన్‌ 6.67-అంగుళాల ఐపిఎస్ ఎల్‌సిడి డిస్‌ప్లేతో వస్తుంది, 1080x2400 పిక్సెల్‌ల రిజల్యూషన్, కిరిన్ 710ఎ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఇందులో అందించారు, మెమరీ కార్డ్ సహాయంతో స్టోరేజ్ మరింత విస్తరించుకోవచ్చు.

also read 

హానర్ 10 ఎక్స్ లైట్ కెమెరా

కెమెరాకు సంబంధించినంతవరకు, హానర్ 10 ఎక్స్ లైట్‌లో నాలుగు బ్యాక్ కెమెరాలు ఉంటాయి, ఇందులో ప్రధాన కెమెరా 48 మెగాపిక్సెల్‌లు,  రెండవ కెమెరా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, మూడవ కెమెరా 2 మెగాపిక్సెల్ మాక్రో, నాల్గవ కెమెరా 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, సెల్ఫీ కోసం 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 

హానర్ 10 ఎక్స్ లైట్ బ్యాటరీ

హానర్ 10 ఎక్స్ లైట్ బ్యాటరీ 22.5W ఫాస్ట్ ఛార్జింగ్‌  సపోర్ట్ తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని దీనికి అమర్చారు. ఫోన్‌లో బ్లూటూత్ 5.1, 2.4 గిగాహెర్ట్జ్ వై-ఫై, ఎల్‌టిఇ, టైప్-సి పోర్ట్, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ ఉంటాయి.

  

click me!