హ్యాపీ దీపావళి వాట్సాప్ స్టిక్కర్లను మీ సొంతంగా క్రియేట్ చేయవచ్చు.. ఎలా అంటే ?

By Sandra Ashok Kumar  |  First Published Nov 13, 2020, 12:52 PM IST

 ఈ రోజు మీరు 'హ్యాపీ దీపావళి' వాట్సాప్ స్టిక్కర్లను ఎలా సృష్టించవచ్చో,  మీరు స్టిక్కర్ ప్యాక్‌లను ఎలా తయారు చేయలో అలాగే వాటిని మీ ప్రియమైనవారికి ఎలా పంపించాలో కూడా ఇక్కడ చూద్దాం...


దీపావళి, ధంతేరాస్ పండుగ వచ్చేసింది. ఏ పండుగ అయినా మనమందరం ఫేస్ బుక్ లేదా ఇన్స్టంట్ మెసేజింగ్  యాప్ వాట్సాప్ నుండి పండుగ  స్టిక్కర్లను పంపుతు శుభాకాంక్షలు తెలియజేస్తుంటాము.

ఈ రోజు మీరు 'హ్యాపీ దీపావళి' వాట్సాప్ స్టిక్కర్లను ఎలా సృష్టించవచ్చో,  మీరు స్టిక్కర్ ప్యాక్‌లను ఎలా తయారు చేయలో అలాగే వాటిని మీ ప్రియమైనవారికి ఎలా పంపించాలో కూడా ఇక్కడ చూద్దాం...

Latest Videos

undefined

మీరు మీ సొంత క్రియేటివిటీ తో స్టిక్కర్ ప్యాక్‌లను ఎలా తయారు చేయవచ్చో లేదా థర్డ్ పార్టీ యాప్స్ సహాయంతో మీకు ప్రియమైన వారికి స్టిక్కర్లను ఎలా పంపించాలో కూడా తెలుసుకుందాం.

దీపావళి / ధంతేరాస్ స్టిక్కర్లు ఎలా క్రియేట్ చేయాలి

also read 

1) మొదట మీ ఫోన్‌లో స్టిక్కర్ మేకర్‌ యాప్ డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయండి.
2) సెర్చ్ చేసిన తర్వాత మీ స్మార్ట్‌ఫోన్‌లో దీపావళి ఫోటోలను డౌన్‌లోడ్ చేసుకోండి.
3) తరువాత యాప్ ఓపెన్ చేసి, క్రియేట్  న్యూ స్టిక్కర్ ప్యాక్ ఆప్షన్ పై  నొక్కండి.
4) దీని తరువాత మీరు కస్టమ్ స్టిక్కర్ ప్యాక్‌కు ఏ పేరు పెడుతున్నారో ఇవ్వండి.
5) మీరు యాడ్ స్టిక్కర్ అనే బటన్ పై క్లిక్ చేయాలి.
6) దీని తరువాత, ఫోన్ గ్యాలరీ నుండి డౌన్‌లోడ్ చేసిన ఫోటోలను సెలెక్ట్ చేసుకొని వాటిని కస్టమైజ్ చేయడం ప్రారంభించండి.
7) కస్టమైజ్ చేసిన తరువాత, ప్రింట్ స్టిక్కర్ ప్యాక్‌పై నొక్కండి.

పైన పేర్కొన్న దశలతో పాటు, మీరు దీపావళి స్టిక్కర్ ప్యాక్‌ని ఉపయోగించి ధంతేరాస్ 2020 స్టిక్కర్ ప్యాక్‌ని కూడా తయారు చేయవచ్చు. మీరు చేయాల్సిందల్లా హ్యాపీ దీపావళి ఫోటోస్ బదులు హ్యాపీ ధంతేరాస్ ఫోటోలను సెర్చ్ చేసి యాడ్ చేయడం మాత్రమే.

ఈ కస్టమ్ స్టిక్కర్ ప్యాక్ మీ వాట్సాప్ స్టిక్కర్ లైబ్రరీలో కనిపిస్తుంది. మీరు వాటిని మీ స్నేహితులు లేదా బంధువులకు హ్యాపీ దీపావళి స్టిక్కర్లను సెండ్ చేయవచ్చు.  స్టిక్కర్స్ కాకుండా, దీపావళి శుభాకాంక్షలు చెప్పడానికి మీరు మీ స్నేహితులకు లేదా మీ ప్రత్యేక వ్యక్తులకు జీఫీలను కూడా పంపవచ్చు.

వాట్సాప్ దీపావళి స్టిక్కర్లను ఎలా పంపాలి

మొదట వాట్సాప్ యాప్ ఓపెన్ చేసి తరువాత స్టిక్కర్ లైబ్రరీకి వెళ్లి గెట్ మోర్ స్టిక్కర్స్ పై క్లిక్ చేయండి. మీరు ఈ ఆప్షన్ నొక్కిన వెంటనే, మీ ఫోన్‌లోని ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ ఓపెన్ అవుతుంది.

మరొక మార్గం ఏమిటంటే, మీరు నేరుగా గూగుల్ ప్లే స్టోర్‌కు వెళ్లి స్టిక్కర్ ప్యాక్ కోసం సెర్చ్ చేయవచ్చు లేదా మీకు నచ్చిన థర్డ్ పార్టీ యాప్ డౌన్‌లోడ్ చేసి కూడా స్టిక్కర్లను ఉపయోగించుకోవచ్చు.

click me!