టాస్క్ మేట్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాపారాల నుండి పోస్ట్ చేసిన పలు రకాల పనులకు అక్సెస్ అందిస్తుంది. అంటే ఒక రెస్టారెంట్ ఫోటో పై క్లిక్ చేయడం, వ్యక్తిగత ప్రాధాన్యతల గురించి సర్వే ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం లేదా ఇంగ్లీష్ నుండి ఇతర భాషలకు పదాలను అనువదించడం వంటివి వీటిలో ఉన్నాయి.
స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ఇపుడు ఇంట్లో కూర్చొని చిన్న చిన్న పనులు చేయడం ద్వారా డబ్బు సంపాదించవచ్చు. అవును మీరు విన్నది నిజమే, ఇందుకోసం టెక్నాలజి దిగ్గజం గూగుల్ టాస్క్స్ మేట్ అనే యాప్ ని భారతదేశంలో పరీక్షిస్తుంది.
టాస్క్ మేట్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాపారాల నుండి పోస్ట్ చేసిన పలు రకాల పనులకు అక్సెస్ అందిస్తుంది. అంటే ఒక రెస్టారెంట్ ఫోటో పై క్లిక్ చేయడం, వ్యక్తిగత ప్రాధాన్యతల గురించి సర్వే ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం లేదా ఇంగ్లీష్ నుండి ఇతర భాషలకు పదాలను అనువదించడం వంటివి వీటిలో ఉన్నాయి.
undefined
ప్రస్తుతం టాస్క్ మేట్ యాప్ బీటా వెర్షన్ లో ఉంది, అయితే రిఫెరల్ కోడ్ సిస్టమ్ ద్వారా సెలెక్టెడ్ యూసర్లకు మాత్రమే పరిమితం చేసింది.
వినియోగదారులు పూర్తి చేసిన పనులకు లోకల్ కరెన్సీ ద్వారా పేమెంట్ అందిస్తారు. గూగుల్ టాస్క్స్ మేట్ గూగుల్ ప్లేలో డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉన్నప్పటికీ, మీకు రిఫెరల్ కోడ్ ఉంటే తప్ప దాన్ని ఉపయోగించలేరు, అది కూడా ఇన్విటేషన్ ద్వారా మాత్రమే లభిస్తుంది.
గూగుల్ ప్లేలో టాస్క్స్ మేట్ యాప్ డిస్క్రిప్షన్ లో వ్రాసినట్లుగా టాస్క్ మేట్‌ను ఉపయోగించటానికి తప్పనిసరిగా మూడు దశలు ఉన్నాయి. 1. మీ సమీపంలోని పనులను కనుగొనడం 2.సంపాదించడానికి ముందు ఒక పనిని పూర్తి చేయడం 3. మీ ఆదాయాలను క్యాష్ చేసుకోండి.
ఈ పనులు సిట్టింగ్ లేదా ఫీల్డ్ టాస్క్‌లుగా వర్గీకరించబడతాయి, అయితే గూగుల్ నేరుగా కూడా ఒక టాస్క్ చేయమని అడగవచ్చు. టాస్క్స్ మేట్ యాప్ లో మీరు పూర్తి చేసిన పనులు, సరిగ్గా చేసిన పనులు, మీ లెవెల్, రివ్యూ లో ఉన్న పనుల పూర్తి వివరాలను చూడవచ్చు.
మీరు ఏదైనా టాస్క్ కోసం ఎక్కడికైనా వెళ్లవలసి వస్తే, అక్కడికి చేరుకోవడానికి ఎంత సమయం పడుతుందో కూడా చూపిస్తుంది. స్క్రీన్‌షాట్‌లలో ప్రస్తుతానికి డాలర్ల రూపంలో మాత్రమే టాస్క్ ధరను చూపించినట్లు అనిపించినప్పటికీ, ఒక పని ఎంత విలువైనదో కూడా మీరు చూడవచ్చు.
షాపింగ్ ఫ్రంట్‌ల ఫోటోలు తీయడం వంటి పనులు మ్యాపింగ్ సేవలను మెరుగుపరచడానికి, ఆన్‌లైన్‌లో వ్యాపారాన్ని తీసుకురావడానికి గూగుల్ కి సహాయపడతాయని నివేదించింది. మీకు ఒక పని పట్ల ఆసక్తి లేకపోతే లేదా చేయలేకపోతే, మీరు స్కిప్ అనే ఆప్షన్ ఎంచుకోవచ్చు.
పేమెంట్ ప్రయోజనాల కోసం మీరు థర్డ్ పార్టీ ప్రాసెసర్‌తో ఖాతాను లింక్ చేయాలి. టాస్క్‌ల ద్వారా సంపాదించిన డబ్బును క్యాష్ చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, మీరు టాస్క్ మేట్ యాప్ లో పేమెంట్ భాగస్వామితో మీ ఇ-వాలెట్ లేదా ఖాతా వివరాలను ఎంటర్ చేసుకోవచ్చు, మీ ప్రొఫైల్ పేజీని ఓపెన్ చేసి, క్యాష్ అవుట్ పై క్లిక్ చేయండి.
దీని తరువాత యాప్ డిస్క్రిప్షన్ ప్రకారం మీరు మీ లోకల్ కరెన్సీలో డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు. కాకపోతే గూగుల్ టాస్క్స్ మేట్ వినియోగదారులకు పూర్తిగా ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో స్పష్టంగా లేదు.