చైనాకు షాక్ మీద షాక్.. 2,500 యూట్యూబ్ చానల్స్ డిలీట్ చేసిన గూగుల్

By Sandra Ashok Kumar  |  First Published Aug 7, 2020, 4:46 PM IST

వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్‌ యూట్యూబ్ లో తప్పుడు సమాచారంతో  చైనాతో ముడిపడి ఉన్న 2,500 కి పైగా యూట్యూబ్ ఛానెల్‌లను తొలగించినట్లు గూగుల్ తెలిపింది.


సెర్చ్ ఇంజన్ గూగుల్ 2,500 చైనా-లింక్డ్ యూట్యూబ్ ఛానెల్‌లను తోలగించింది. వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్‌ యూట్యూబ్ లో తప్పుడు సమాచారంతో  చైనాతో ముడిపడి ఉన్న 2,500 కి పైగా యూట్యూబ్ ఛానెల్‌లను తొలగించినట్లు గూగుల్ తెలిపింది.

ఆల్ఫాబెట్ యాజమాన్యంలోని గూగుల్ సంస్థ "మా దర్యాప్తులో భాగంగా ఏప్రిల్ నుంచి జూన్ మధ్య కాలంలో తప్పుడు సమాచారంతో చైనాతో అనుసంధానమై కొనసాగుతున్న యూట్యూబ్ ఛానెల్స్  తొలగించాము" అని తెలిపింది.

Latest Videos

undefined

ఈ ఛానెల్స్ సాధారణంగా "స్పామీ, నాన్-పొలిటికల్ కంటెంట్" ను పోస్ట్ చేస్తున్నాయి, తప్పుడు సమాచారం కారణంగా వీటిని తొలగించినట్లు తెలిపింది.

also read 

గూగుల్  ఖచ్చితమైన ఛానెల్‌లను గుర్తించలేదు కానీ కొన్ని ఇతర వివరాలను అందించింది. తప్పుడు సమాచార ప్రచార వీడియోలను ట్విట్టర్ గుర్తించిన వాటిని సోషల్ మీడియా అనలిటిక్స్ సంస్థ గ్రాఫికా ఏప్రిల్‌లో గుర్తించింది.

యుఎస్‌లోని చైనా రాయబార కార్యాలయన్ని దీనిపై వివరణ కోరుగా వెంటనే స్పందించలేదు. బీజింగ్ గతంలో కూడా తప్పుడు సమాచారం పై వ్యాప్తి చేసిన ఆరోపణలను ఖండించింది. గతంలో ఇతర దేశాలతో సంబంధం ఉన్న నటులు సోషల్ మీడియాలో  లక్షలాది తప్పుడు సందేశాలు పంపారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

అయితే కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో గత నెలలో భారతదేశంలో 59 చైనా యాప్స్ నిషేధం, ఇప్పుడు యూట్యూబ్ లింక్స్ తొలగింపు చర్చనీయాంశంగా మారింది.

click me!