గూగుల్ డిస్కవర్ ఫీడ్‌లో డెడికేటెడ్ వెబ్ స్టోరీస్ ని ప్రకటించింది. ఈ ఫీచర్ని మొదట యుఎస్, బ్రెజిల్, భారతదేశాలలో ప్రారంభిస్తోంది. భవిష్యత్తులో మరిన్ని దేశాలకు విస్తరించనుంది. గూగుల్ కొత్త ఫీచర్ ఉపయోగించి స్టోరీస్ సృష్టించి పోస్ట్ చేయవచ్చు.
సెర్చ్ ఇంజన్ గూగుల్ ఒక కొత్త ఫీచర్ ప్రవేశపెట్టింది. గూగుల్ డిస్కవర్ ఫీడ్‌లో డెడికేటెడ్ వెబ్ స్టోరీస్ ని ప్రకటించింది. ఈ ఫీచర్ని మొదట యుఎస్, బ్రెజిల్, భారతదేశాలలో ప్రారంభిస్తోంది. భవిష్యత్తులో మరిన్ని దేశాలకు విస్తరించనుంది. గూగుల్ కొత్త ఫీచర్ ఉపయోగించి స్టోరీస్ సృష్టించి పోస్ట్ చేయవచ్చు.
ఈ పోస్ట్‌లతో కూడా డబ్బు సంపాదించవచ్చు. ఈ రోజులలో చాలా యాప్స్ లో మీరు చూసే “స్టోరీస్” లాగే ఈ వెబ్ స్టోరీస్ కనిపిస్తాయి, కానీ ఒక యాప్ ద్వారా కాకుండా, మీ బ్రౌజర్ ద్వారా వెబ్‌లో చూడవచ్చు. stories.google ను సందర్శించడం ద్వారా వెబ్ స్టోరీస్ ప్రారంభించవచ్చు.
undefined
గూగుల్ 2018లో వెబ్ స్టోరీలను ప్రారంభించింది, ఇన్‌స్టాగ్రామ్ లేదా స్నాప్‌చాట్ స్టోరీస్ లాగానే ఈ ఫీచర్ తీసుకువచ్చింది.అప్పటి నుండి గూగుల్ తన వెబ్ స్టోరీస్ ప్రోగ్రామ్‌ను అంతర్జాతీయంగా విస్తరించింది. ఈ కొత్త ఫీచర్ ఇతర యాప్ స్టోరీస్ లాగా కాకుండా వెబ్‌లో మాత్రమే అందుబాటులో ఉంది.
స్టేటస్ పేరుతో వాట్సాప్ ఈ ఫీచర్‌ను ప్రారంభించగా అదే పేరుతో ఫేస్‌బుక్ కూడా దీనిని అందుబాటులోకి తెచ్చింది. తరువాత 'స్టోరీస్' పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చింది. మరో పేరుతో యూట్యూబ్‌లో కూడా ఇటువంటి ఫీచరే ఎప్పటి నుంచో ఉంది.
also read
ఇప్పుడు గూగుల్ కూడా 'వెబ్ స్టోరీస్' పేరుతో ఈ ఫీచర్‌ను ప్రారంభించింది. మిగతా యాప్స్‌లో మాదిరిగానే గూగుల్ వెబ్ స్టోరీస్ కూడా ప్రత్యేక సెక్షన్‌లో కనిపిస్తాయి. 'గూగుల్ డిస్కవర్' మెనూ క్లిక్ చేస్తే ఫుల్ స్క్రీన్‌లో ప్లే అవుతాయి. స్వైప్ చేస్తే నెక్స్ట్ స్టోరీ కనిపిస్తుంది.
ఆయా వెబ్‌సైట్లకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు, యూఆర్‌ఎల్ లింక్స్‌ను ఈ వెబ్ స్టోరీస్ సెక్షన్‌లో యాడ్ చేసుకోవచ్చు. వీటిని ఎప్పటికప్పుడు ఎడిట్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది. ప్రారంభ దశలో ఉన్న ఈ వెబ్ స్టోరీస్ సెక్షన్‌ను ప్రస్తుతానికి 2000 వెబ్‌సైట్లే వినియోగించుకుంటున్నాయని గూగుల్ ప్రకటించింది.
ఈ స్టోరీస్ గూగుల్ సెర్చ్, గూగుల్ ఇమేజెస్ ద్వారా లభిస్తాయి. గూగుల్ డిస్కవర్, గూగుల్ సెర్చ్ ద్వారా వాటిని అందుబాటులోకి తెస్తామని గూగుల్ ప్రకటించింది.