ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ఇకపై వారానికి నాలుగు రోజులే‌ వర్కింగ్ డేస్

Ashok Kumar   | Asianet News
Published : Sep 07, 2020, 01:25 PM IST
ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ఇకపై వారానికి నాలుగు రోజులే‌ వర్కింగ్ డేస్

సారాంశం

అయితే తాజాగా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌తో ఇబ్బంది పడుతున్న ఉద్యోగుల కోసం అదనంగా ఒక రోజు సెలవు ఇవ్వాలని నిర్ణయించింది. కరోనా విజృంభణ, వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌  వల్ల ఎలాంటి ఒత్తిడి లేకుండా పని చేసేందుకు ఈ అవకాశం కల్పించినట్లు  సీఎన్‌బీసీ ఓ ప్రకటనలో తెలిపింది. అదనపు సెలవు ఉద్యోగులతో పాటు ఇంటర్న్‌లకు కూడా వర్తిస్తుందని కంపెనీ వెల్లడించింది.

టెక్‌ దిగ్గజం గూగుల్‌ ఉద్యోగుల కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంతో గత 5 నెలలుగా ఉద్యోగులకు వర్క్ ఫ్రోం హోం ప్రకటించిన విషయం తెలిసిందే.

అయితే తాజాగా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌తో ఇబ్బంది పడుతున్న ఉద్యోగుల కోసం అదనంగా ఒక రోజు సెలవు ఇవ్వాలని నిర్ణయించింది. కరోనా విజృంభణ, వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌  వల్ల ఎలాంటి ఒత్తిడి లేకుండా పని చేసేందుకు ఈ అవకాశం కల్పించినట్లు  సీఎన్‌బీసీ ఓ ప్రకటనలో తెలిపింది.

అదనపు సెలవు ఉద్యోగులతో పాటు ఇంటర్న్‌లకు కూడా వర్తిస్తుందని కంపెనీ వెల్లడించింది. ఒకవేళ ఎవరైనా అత్యవసర పరిస్థితుల్లో శుక్రవారం రోజున పనిచేయాల్సి వస్తే వారు మరొక రోజునా సెలవుగా తీసుకునే అవకాశం ఉందని కూడా  వెల్లడించింది.

also read పబ్: జి గేమ్ లవర్స్ కి గుడ్ న్యూస్.. త్వరలో ఇండియన్ యాప్ ఫవ్: జి వచ్చేస్తోంది.. ...

డే ఆఫ్‌ను కల్పించేందుకు మేనేజర్లు, వారి బృంద సభ్యులకు సపోర్ట్ గా నిలవాలని గూగుల్ సూచించింది. వచ్చే ఏడాది వరకు వర్క్‌ ఫ్రమ్‌ హోం వైపే మొగ్గు చూపుతున్న సమయంలో ఈ ఫోర్‌ డే వీక్‌ని కంపెనీ ప్రకటించింది.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో దాదాపుగా అన్ని ఐటీ కంపెనీలు ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఇచ్చింది. గత కొంతకాలం నుండి పనిభారం పెరుగుతుందని, విశ్రాంతి దొరకడం లేదని గూగుల్‌ ఉద్యోగుల నుంచి ఫిర్యాదుల వెల్లువెత్తాయి.

గతంలో వారానికి రెండు రోజులు అంటే ఆదివారం, శనివారం సెలవు ఉండేది. వారానికి ఐదు రోజులు మాత్రమే వర్కింగ్ డేస్. కానీ ఇప్పుడు ఫోర్‌ డే వీక్‌ ప్రకటనతో వారంలో నాలుగు రోజులు మాత్రమే ఉద్యోగులకు వర్కింగ్ డేస్. 

PREV
click me!

Recommended Stories

Best Camera Phones : 2025లో టాప్ 5 కెమెరా స్మార్ట్‌ఫోన్లు ఇవే
Starlink : ఎలన్ మస్క్ స్టార్‌లింక్ భారత్‌లో స్టార్ట్ : ప్లాన్‌లు, స్పీడ్, సైన్‌అప్.. ఫుల్ డిటెయిల్స్ ఇవే