గూగుల్ ప్లేస్టోర్ నుండి 29యాప్స్ తొలగింపు.. వెంటనే మీరు వాటిని అన్‌ఇన్‌స్టాల్ చేయండి

By Sandra Ashok KumarFirst Published Jul 29, 2020, 3:33 PM IST
Highlights

వైట్ ఓ‌పి‌ఎస్ సతోరి  ఇంటెలిజెన్స్ బృందం వారి “చార్ట్రూస్బ్లూర్” పరిశోధనలో భాగంగా ఈ 29 యాప్స్ ని కనుగొంది. దర్యాప్తు సమయంలో  బ్లర్ అనే పదం చాలా హానికరమైనదిగా బ్యాన్ చేసిన యాప్స్ లో ఫోటో ఎడిటింగ్ యాప్స్ చాలా ఉన్నాయి అని తెలిపింది.

యాడ్ వేర్ తో‌(యూజర్‌ ఆన్‌లైన్‌లో ఉన్నప్పుడు ఆటోమెటిక్‌గా డౌన్‌లోడ్ చేసే సాఫ్ట్‌వేర్) నిండిన 29 యాప్ లను ప్లే స్టోర్ నుండి గూగుల్ తొలగించింది. ఈ ఆండ్రోయిడ్ యాప్స్ ప్లే స్టోర్‌లో 3.5 మిలియన్లకు పైగా డౌన్‌లోడ్‌లను కలిగి ఉంది.

వైట్ ఓ‌పి‌ఎస్ సతోరి  ఇంటెలిజెన్స్ బృందం వారి “చార్ట్రూస్బ్లూర్” పరిశోధనలో భాగంగా ఈ 29 యాప్స్ ని కనుగొంది. దర్యాప్తు సమయంలో  బ్లర్ అనే పదం చాలా హానికరమైనదిగా బ్యాన్ చేసిన యాప్స్ లో ఫోటో ఎడిటింగ్ యాప్స్ చాలా ఉన్నాయి అని తెలిపింది.

గూగుల్ బ్యాన్ చేసిన యాప్స్ లో దేనినైనా వినియోగదారులు ఇన్‌స్టాల్ చేసిన తర్వాత లాంచ్ ఐకాన్ వెంటనే అదృశ్యమవుతుంది. తరువాత వినియోగదారులకు వారి ఫోన్‌ల నుండి హానికరమైన యాప్స్ డిలెట్ చేయడం కష్టతరం అవుతుంది.

also read 

యాడ్‌వేర్ ఉన్న యాప్స్ లో ఒకటైన స్క్వేర్ ఫోటో బ్లర్ యాప్ ని సాటోరి బృందం పరీక్షించింది. ప్లే స్టోర్ సెక్యూరిటి చెక్ లను పాస్ చేయగలిగె “బోలు షెల్” ఉన్నట్లు కనుగొన్నారు. ఈ యాప్ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసిన తర్వాత లాంచ్ సింబల్ అదృశ్యమైంది ఇంకా ప్లే స్టోర్‌లో “ఓపెన్” అనే ఆప్షన్ కూడా లేదు.

ఈ యాప్ ద్వారా కనిపించే ప్రకటనలు కొన్ని సెకన్ల వ్యవధిలోనే జరిగాయి. ఈ ఆండ్రాయిడ్ యాప్స్‌లో వినియోగంలో లేని యాడ్స్‌  ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. ఈ యాప్స్ చర్యలలో కొన్ని ఫోన్‌ను అన్‌లాక్ చేయడం, యాప్ అన్‌ఇన్‌స్టాల్ చేయడం, ఫోన్‌ను ఛార్జ్ చేయడం లేదా మొబైల్ డేటా నుండి వై-ఫైకి మార్చడం వంటివి ఉన్నాయి.

యాప్ ఇంస్టాల్ చేశాక యాడ్స్ పాప్ అప్ అవుతాయి దీంతో ఫోన్ స్క్రీన్‌ మొత్తంను ఆక్రమిస్తాయి. ఈ హానికరమైన యాడ్‌వేర్‌ ఉన్న 29 ఆండ్రాయిడ్ యాప్స్ గుర్తించింది. కానీ ఇలాంటివి ఇంకా చాలా ఉండవచ్చు అని చెప్పింది.  ఇందుకోసం సతోరి బృందం కొన్ని సూచనలు, సలహాలు కూడా ఇస్తోంది. జోకర్ మాల్వేర్ ఉన్న కలిగిన  11 యాప్స్ ని ప్లే స్టోర్ నుండి గూగుల్  తొలగించించిన విషయం తెలిసిందే.  
 

click me!