గూగుల్ ప్లేలోని లింక్ కేవలం ప్రీ-రిజిస్ట్రేషన్ కోసం మాత్రమే అని గుర్తించుకోవాలి. మీరు రిజిస్టర్ చేసుకున్నా తర్వాత గేమ్ అందుబాటులోకి వచ్చినప్పుడు గూగుల్ ప్లే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలియజేస్తుంది. ఫావ్-జి అంటే ఫియర్లెస్ అండ్ యునైటెడ్: గార్డ్స్. ఇది దేశ సరిహద్దులలోని సైనికులపై దృష్టి సారించి, భారత సైనిక దళాలకు నివాళి అర్పించే గేమ్.
సెప్టెంబరులో ప్రకటించిన ‘మేడ్ ఇన్ ఇండియా’ గేమ్ ఫావ్-జి ఇప్పుడు గూగుల్ ప్లే స్టోర్‌లో ప్రీ-రిజిస్ట్రేషన్ కోసం అందుబాటులో ఉంచారు. పాపులర్ ఫస్ట్ పర్సన్ షూటర్ (ఎఫ్‌పిఎస్) గేమ్ పబ్-జి మొబైల్‌ను ప్రభుత్వం నిషేధించిన సమయంలో ఫావ్-జి గేమ్ మొదట అక్టోబర్ చివరిలో విడుదల కావాల్సి ఉంది.
అయితే అక్టోబర్ చివరిలో గేమ్ సృష్టికర్త అయిన ఎన్-కోర్ గేమ్స్ నవంబరులో విడుదల చేయనున్నట్లు ఒక ట్రైలర్‌ను విడుదల చేసింది.
undefined
గూగుల్ ప్లేలోని లింక్ కేవలం ప్రీ-రిజిస్ట్రేషన్ కోసం మాత్రమే అని గుర్తించుకోవాలి. మీరు రిజిస్టర్ చేసుకున్నా తర్వాత గేమ్ అందుబాటులోకి వచ్చినప్పుడు గూగుల్ ప్లే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలియజేస్తుంది. ఫావ్-జి అంటే ఫియర్లెస్ అండ్ యునైటెడ్: గార్డ్స్. ఇది దేశ సరిహద్దులలోని సైనికులపై దృష్టి సారించి, భారత సైనిక దళాలకు నివాళి అర్పించే గేమ్.
also read
నవంబరులో లాంచ్ చేసిన టీజర్ ప్రకారం ఫావ్-జి గేమ్ మొదటి ఎపిసోడ్ చైనాతో ‘గాల్వన్ వ్యాలీ’లో జరిగిన ఘర్షణల ఆధారంగా రూపొందించారు. భారత్, చైనీస్ బలగాల మధ్య జరిగిన ఘర్షణ, ఆ సమయంలో ఏం జరిగి ఉంటుందనే అంశాన్ని కళ్లకు కట్టినట్టు చూపించే ప్రయత్నం చేశారు. గేమ్ డిస్క్రిప్షన్ లో గాల్వన్ వ్యాలీ సంఘటన గురించి ప్రస్తావించలేదు.
గేమ్ డిస్క్రిప్షన్ లో వాస్తవ ప్రపంచ దృశ్యాలపై ఆధారపడి ఉందని కూడా తెలిపింది. సెప్టెంబరులో ఫిట్‌నెస్ బ్రాండ్ గోక్యూఐ సిఇఒగా ఉన్న ఎన్‌కోర్ గేమ్స్ సహ వ్యవస్థాపకుడు విశాల్ గొండాల్ మాట్లాడుతూ, ఫావ్-జి గేమ్ పబ్-జితో పోటీ పడటానికి ఉద్దేశించినది కాదు అని అన్నారు.
ఈ గేమ్ పై బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కూడా ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు. ఫావ్-జి గేమ్ ద్వారా సంపాదించిన మొత్తం ఆదాయంలో 20 శాతం భరత్‌కీవీర్ ట్రస్ట్ ఫండ్‌కు విరాళంగా ఇస్తామని ట్వీట్‌లో పేర్కొన్నారు. ఫావ్-జి అనే గేమ్ పేరును హీరో అక్షయ్ కుమార్ ఆలోచన అని విశాల్ గొండాల్ వెల్లడించారు.
కొద్దిరోజుల క్రితం పబ్-జి కార్పొరేషన్ కూడా పబ్-జి మొబైల్‌ను తిరిగి ఇండియాలోకి తీసుకురావడానికి సిద్దంగా ఉన్నట్లు ప్రకటించింది. భారత మార్కెట్‌పై ప్రత్యేక దృష్టి సారించి పబ్-జి ఇండియా గేమ్ యాప్‌ను భారత ప్రభుత్వం ఆమోదించిన తర్వాత మాత్రమే పబ్-జి మొబైల్ అందుబాటులోకి వస్తుంది.