ల్యాప్‌టాప్‌ను ఛార్జ్ చేసే మొట్టమొదటి పవర్‌బ్యాంక్‌ ఇండియాలో లాంచ్.. ఒకేసారి 3 డివైజెస్ ఛార్జ్..

By S Ashok KumarFirst Published Dec 4, 2020, 7:34 PM IST
Highlights

ఇంతకు ముందు మార్కెట్లో పవర్‌బ్యాంక్ ద్వారా మొబైల్, హెడ్‌ఫోన్లు, స్పీకర్లు మాత్రమే చార్జింగ్ చేసుకునేందుకు వీలుండేది. తాజాగా ఈ‌వి‌ఎం కంపెనీ 20000 mAh కపాసిటీతో సి-పోర్ట్‌ పవర్‌బ్యాంక్ ను లాంచ్ చేసింది.

ఎలక్ట్రానిక్ బ్రాండ్ ఈవీఎం ల్యాప్‌టాప్ ను ఛార్జ్ చేసే తొలి పవర్‌బ్యాంక్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఇంతకు ముందు మార్కెట్లో పవర్‌బ్యాంక్ ద్వారా మొబైల్, హెడ్‌ఫోన్లు, స్పీకర్లు మాత్రమే చార్జింగ్ చేసుకునేందుకు వీలుండేది.

తాజాగా ఈ‌వి‌ఎం కంపెనీ 20000 mAh కపాసిటీతో సి-పోర్ట్‌ పవర్‌బ్యాంక్ ను లాంచ్ చేసింది. ఈ పవర్‌బ్యాంక్ కొత్త జనరేషన్ ల్యాప్‌టాప్‌లను ఛార్జ్ చేయగలదు, అయితే సమస్య ఏమిటంటే భారత మార్కెట్లో టైప్-సి పోర్ట్‌తో వస్తున్న ల్యాప్‌టాప్‌ల సంఖ్య ప్రస్తుతం చాలా తక్కువ.

ఈవీఎం బ్రాండ్ ప్రత్యేక పవర్ బ్యాంక్‌కు ఈవీఎం ఎన్‌లాప్‌ పవర్ అని పేరు పెట్టింది, దీని ధర రూ.9,999. ఈవీఎం ఎన్‌లాప్‌ పవర్ పవర్‌బ్యాంక్ ఒకేసారి యూ‌ఎస్‌బి టైప్-సి పోర్ట్ ఉన్న మూడు డివైజెస్ ఛార్జ్ చేయగలదు.

also read 

ఈ పవర్‌బ్యాంక్‌తో నాలుగు అడుగుల పొడవైన కేబుల్ కూడా వస్తుంది. ఈ పవర్‌బ్యాంక్ బాడీ అల్ట్రా బ్లాక్ ప్రీమియం మెటల్‌తో క్లాస్సి లుక్‌తో ఉంటుంది. మీరు దీనిని ప్రత్యేకమైన వారి కోసం బహుమతిగా కూడా ఇవ్వవచ్చు. 

ఈవీఎం ఎన్‌లాప్‌ పవర్ కి మూడేళ్ల వారంటీ లభిస్తుంది. ఈ పవర్‌బ్యాంక్ సహాయంతో మ్యాప్‌బుక్, మాక్‌బుక్ ఎయిర్, మాక్‌బుక్ ప్రో, ఐప్యాడ్, ఐప్యాడ్ ప్రో, ఎంఎస్ సర్ఫేస్ ప్రో, డెల్ ఎక్స్‌పిఎస్ 13, హెచ్‌పి స్పెక్టర్ ఎక్స్360, లెనోవా ఐడియాప్యాడ్, ఎల్‌జి గ్రామ్, ఆసుస్ జెన్‌బుక్ 13 వంటి టైప్-సి పోర్ట్‌గల ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లను ఛార్జింగ్ చేస్తుంది.

 ఈవీఎం ఎన్‌లాప్‌ పవర్ పవర్‌బ్యాంక్‌  లాంచ్ సందర్భంగా ఈ‌వి‌ఎం ఇండియా సేల్స్ హెడ్ యజ్ఞేష్ పాండ్యా మాట్లాడుతూ,  ఈవీఎం ఎన్‌లాప్‌ పవర్ పవర్‌బ్యాంక్‌ ఇండియన్ మార్కెట్లోకి తీసుకొస్తున్నానందుకు  మేము చాలా సంతోషిస్తున్నాము. ఇది భారత మార్కెట్లో కొత్త ధోరణిని ప్రారంభించే ఉత్పత్తి. ఈ పవర్ బ్యాంక్ స్వయం సమృద్ధి భారత ప్రచారం కింద అభివృద్ధి చేయబడింది. 

click me!