జర్మనీలోని ఆరు అమెజాన్ సైట్లలో పనిచేస్తున్న ఉద్యోగులు కార్మికుల భద్రత, హక్కులపై నిరసనగా నేడు సమ్మె దిగారు. 'గుడ్ అండ్ హేల్తి వర్క్' అనే నినాదంతో ఈ సమ్మే కనీసం 48 గంటలుపాటు కొనసాగుతుందని ఉద్యోగ సంఘం ప్రతినిధి ఓర్హాన్ అక్మాన్ తెలిపారు.
బెర్లిన్ : ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ లో ఉద్యోగులు సమ్మెకు దిగారు. జర్మనీలోని ఆరు అమెజాన్ సైట్లలో పనిచేస్తున్న ఉద్యోగులు కార్మికుల భద్రత, హక్కులపై నిరసనగా నేడు సమ్మె దిగారు. 'గుడ్ అండ్ హేల్తి వర్క్' అనే నినాదంతో ఈ సమ్మే కనీసం 48 గంటలుపాటు కొనసాగుతుందని ఉద్యోగ సంఘం ప్రతినిధి ఓర్హాన్ అక్మాన్ తెలిపారు.
కార్మికులకు కోవిడ్ -19 కు పాజిటివ్ వచ్చిన తరువాత ఉద్యోగులకు అండగా నిలుస్తూ వారికి ఆర్థిక సహాయం అందించాల్సిన సంస్థ కనీసం పట్టించుకోవడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జర్మనీలోని వివిధ కేంద్రాల్లో పనిచేస్తున్న 30 నుండి 40 మంది సహోద్యోగులకు సోకినట్లు మాకు సమాచారం ఉంది" అని వెర్డి ప్రతినిధి ఓర్హాన్ అక్మాన్ చెప్పారు.
undefined
2013 నుండి తరచూ సమ్మెలు చేస్తున్న లాజిస్టిక్స్ కార్మికులకు వేతనం పెంచాలంటు జర్మనీలోని యూనియన్లతో తరుచూ సమ్మెలకు దిగుతున్నారు. ఈ సమ్మె ప్రభావం లీప్‌జిగ్, బాడ్ హెర్స్‌ఫెల్డ్, రైన్‌బెర్గ్, వెర్న్, కోబ్లెంజ్‌లలోని అమెజాన్ సైట్‌లపై పడనున్నట్లు వెర్డి చెప్పారు.
also read
అమెజాన్ తన కార్మికుల భద్రత కంటే సొంత ప్రయోజనలు, లాభాలకే ప్రాధ్యానం ఇస్తుందని ఉద్యోగులు వాపోయారు. అమెజాన్ ఒక ప్రకటనలో ఈ ఆరోపణలను ఖండించింది. జూన్ నాటికి తన ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమ ఉద్యోగులు కోవిడ్ -19 ఇన్ఫెక్షన్ల నుండి రక్షించే చర్యలపై 4 బిలియన్ డాలర్లు(సుమారు రూ. 30,227 కోట్లు) పెట్టుబడి పెట్టిందని చెప్పారు.
యునైటెడ్ స్టేట్స్ తరువాత అతిపెద్ద మార్కెట్ అయిన జర్మనీలో అమెజాన్ ఫిబ్రవరి నుండి 470 మిలియన్ సానిటైజర్స్ బాటిల్స్, 21 మిలియన్ గ్లవుజులు, సహా 39 మిలయన్ల ఇతర భద్రతా పరికరాలను అందించామని జర్మనీలోని అమెజాన్ ప్రతినిధి అన్నారు.