జూమ్, జియోమీట్ యాప్స్ కి పోటీగా ఎయిర్‌టెల్ కొత్త యాప్..

By Sandra Ashok Kumar  |  First Published Jul 6, 2020, 6:34 PM IST

కరోనా వైరస్ మహమ్మారి, లాక్ డౌన్  కారణంగా వీడియో కాలింగ్ కు భారీ డిమాండ్ ఏర్పడింది. జూమ్, గూగుల్ హ్యాంగ్ అవుట్స్, మైక్రోసాఫ్ట్ టీమ్స్, జియోమీట్ వంటి ఇతర వీడియో కాలింగ్ /కాన్ఫరెన్సింగ్ యాప్ లకు ఇది పోటీ పడుతుందని భావిస్తున్నారు. 


టెలికాం దిగ్గజం భారతి ఎయిర్‌టెల్ త్వరలో వ్యాపారాల కోసం వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్‌ను లాంచ్ చేయనుంది. కరోనా వైరస్ మహమ్మారి, లాక్ డౌన్  కారణంగా వీడియో కాలింగ్ కు భారీ డిమాండ్ ఏర్పడింది.

జూమ్, గూగుల్ హ్యాంగ్ అవుట్స్, మైక్రోసాఫ్ట్ టీమ్స్, జియోమీట్ వంటి ఇతర వీడియో కాలింగ్ /కాన్ఫరెన్సింగ్ యాప్ లకు ఇది పోటీ పడుతుందని భావిస్తున్నారు. ఇటీవల మరో టెలికాం ఆపరేటర్ రిలయన్స్‌ జియో తన వీడియో కాలింగ్ ప్లాట్‌ఫామ్‌ను జియో మీట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.

Latest Videos

undefined

also read 

ప్రధానంగా సరికొత్త ఏఈఎస్‌ 256 ఎన్‌క్రిప్షన్‌, వివిధ  దశల్లో సెక్యూరిటీ రక్షణకు ప్రాధాన్యత ఇవ్వనుందని తెలుస్తోంది. అయితే ఈ అంచనాలపై ఎయిర్‌టెల్ అధికారికంగా స్పందించాల్సి ఉంది. ఎయిర్‌టెల్ వీడియో-కాన్ఫరెన్సింగ్ సేవలను మొదట్లో కొన్ని కంపెనీలకు మాత్రమే అందించనుంది.

డిమాండ్‌ అంచనా బట్టి దీనిని సాధారణ వినియోగదారుల కోసం ప్రారంభించవచ్చని ఒక నివేదిక పేర్కొంది. సైబర్ భద్రతాపై పెరుగుతున్న ఆందోళనల మధ్య డేటా స్థానికీకరణ, భద్రతకు ఎయిర్‌టెల్ ప్రాధాన్యత ఇస్తుందని నివేదిక తెలిపింది. వీడియో-కాన్ఫరెన్సింగ్ సర్వీస్  మొబైల్, డెస్క్‌టాప్‌ వెర్షన్ లలో అందుబాటులో ఉంటుంది.

click me!