కిరాణా సరుకుల కోసం అమెజాన్ కొత్త సేవలు.. ఎలా ఆర్డర్ చేయాలంటే..?

By Sandra Ashok Kumar  |  First Published Jul 1, 2020, 11:49 AM IST

ఈ-కామర్స్ దిగ్గజం ‘అమెజాన్ ప్యాంట్రీ’ సేవలు దేశంలోని 300కి పైగా నగరాల్లో అందుబాటులోకి వచ్చాయి. 2016లో హైదరాబాద్ నగరంలో తొలుత ప్రయోగాత్మకంగా ప్రారంభమైన ఈ సేవలు క్రమంగా దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నది. 
 


న్యూఢిల్లీ: గ్లోబల్ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్యాంట్రీ ఇప్పుడు దేశంలోని 300కి పైగా నగరాల్లో అందుబాటులోకి వచ్చింది. అలహాబాద్, అమ్రేలీ, బరేలీ, బేతుల్, భోపాల్, భండారా, చురు, దియోగఢ్, గోండా, జమ్ము, ఝాన్సీ, కతువా, కోజికోడ్, మాల్డా, మొరాదాబాద్, నైనిటాల్, పఠాన్‌కోట్, రాజ్‌కోట్, సిమ్లా, ఉదయ్‌పూర్, వారణాసి తదితర నగరాల ప్రజలకు ఇప్పుడు అమెజాన్ ప్యాంట్రీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. 

ఇప్పుడు నగర ప్రజలు అమెజాన్‌లో కిరాణా సరుకులను ఆర్డర్ చేసుకోవచ్చు. అలాగే, దేశంలోని 10 వేల పిన్‌కోడ్‌ల పరిధిలో అమెజాన్ ప్యాంట్రీ అందుబాటులోకి వచ్చింది. ఇందులో చిన్న పట్టణాలైన రాజస్థాన్‌లోని భరత్‌పూర్, చత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్, మధ్యప్రదేశ్‌లోని శివపురి, హర్యానాలోని ఫతేహాబాద్, ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌‌లలోని ప్రజలకు కూడా అందుబాటులోకి వచ్చింది. 

Latest Videos

undefined

2016లోనే భారత్‌లో అమెజాన్‌ ప్యాంట్రీ సేవలను ప్రారంభించింది. తొలుత పైలట్ ప్రాజెక్టుగా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఆ తర్వాత క్రమంగా ఈ సేవలను దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. ఇందులో మొత్తం 200 బ్రాండ్ల నుంచి 3000 ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి.  

also read చైనా యాప్స్ బ్యాన్ : టిక్‪టాక్‌కు 1332 కోట్ల నష్టం! ...

అమెజాన్ ఉద్యోగుల‌కు బోన‌స్ 
ఈ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ తన ఉద్యోగులకు‌ శుభవార్త చెప్పింది. కరోనా వైరస్‌ సంక్షోభంలోనూ పని చేస్తున్న‌ ఉద్యోగులకు ఏకకాల బోనస్‌ అందజేస్తామని తెలిపిది. ఇందుకు 500 మిలియన్‌ డాలర్లు (రూ.3,775 కోట్లు) ఖర్చుచేస్తామని వెల్లడించింది. జూన్‌ వరకు పనిచేసిన ఉద్యోగులు, భాగస్వాములు ఒక్కొక్కరు సంస్థ‌లో త‌మ హోదాను బ‌ట్టి 150 డాలర్ల (రూ11,300) నుంచి 3000 డాలర్ల (రూ.2.26 లక్షలు) వ‌ర‌కు  ఏకకాల బోనస్‌గా అందుకుంటారని‌ తెలిపింది. 

ప్రపంచంలోనే అతిపెద్ద ఈ కామర్స్ కంపెనీ అయిన అమెజాన్ ఏటా 10 బిలియన్‌ వస్తువులను వినియోగదారుల‌కు చేర‌వేస్తున్నది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ ప్రబలడంతో అమెజాన్‌ బిజెనెస్‌పై ప్ర‌భావం ప‌డింది. ఆర్డ‌ర్లు బాగా త‌గ్గిపోవ‌డంతో అనుకున్న మేర‌కు లాభాలు పొందలేక పోయింది. అయినాస‌రే, కష్ట‌కాలంలో సంస్థ కోసం ప‌నిచేసిన త‌న ఉద్యోగుల‌కు బోన‌స్ ఇచ్చేందుకు సిద్ధ‌మైంది.         

click me!