Arun Kumar P   | Asianet News
Published : Feb 13, 2022, 10:13 AM ISTUpdated : Feb 13, 2022, 09:05 PM IST

IPL Auction 2022: ముగిసిన ఐపీఎల్ మెగా వేలం...

సారాంశం

బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్ భారత ఆటగాళ్ళపైనే కాదు అంతర్జాతీయ క్రికెటర్లపైనా  కాసుల వర్షం కురిపిస్తోంది. తాజాగా బెంగళూరులో జరుగుతున్న మెగా వేలంలో మొదటిరోజు 97మంది ఆటగాళ్లకకోసం జరిగిన వేలంలో 10 జట్లు పాల్గొని కేవలం 74మంది క్రికెటర్లనే కొనుగోలు చేసారు. మిగిలిపోయిన 23మంది ప్లేయర్స్ తో పాటు మిగతా ఆటగాళ్ల కోసం ఇవాళ(ఆదివారం) రెండో  రోజు వేలంపాట జరగనుంది. 

IPL Auction 2022:  ముగిసిన ఐపీఎల్ మెగా వేలం...

09:16 PM (IST) Feb 13

రూ.551.7 కోట్లు, 204 ప్లేయర్లు...

ఐపీఎల్ 2022 మెగా వేలంలో 10 ఫ్రాంఛైజీలు కలిపి రూ.551.7 కోట్లకు ఖర్చు చేశాయి. మొత్తంగా 204 ప్లేయర్లు అమ్ముడుపోగా, అందులో 67 మంది విదేశీ ప్లేయర్లు...  

09:04 PM (IST) Feb 13

ముగిసిన ఐపీఎల్ వేలం...

ఐపీఎల్ 2022 మెగా వేలం ముగిసింది...

09:02 PM (IST) Feb 13

ఆర్‌సీబీలోకి విల్లే...

డేవిడ్ విల్లేని రూ.2 కోట్లకు కొనుగోలు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. 

09:01 PM (IST) Feb 13

ముంబైలోకి ఆలెన్..

ఫ్యాబియన్ ఆలెన్‌ను రూ.75 లక్షలకు కొనుగోలు చేసింది ముంబై ఇండియన్స్...

08:58 PM (IST) Feb 13

ఆర్‌సీబీలోకి సిద్ధార్థ్ కౌల్..

సిద్ధార్థ్ కౌల్‌ని రూ.75 లక్షలకు కొనుగోలు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

08:57 PM (IST) Feb 13

ఆఖర్లో ఆర్ఆర్ జోరు...

రస్సీ వాన్ దేర్ దుస్సేన్‌ను రూ. కోటికి రాజస్థాన్ రాయల్స్ సొంతం చేసుకుంది...

08:56 PM (IST) Feb 13

ఆర్‌ఆర్‌లోకి నీశమ్...

జేమ్స్ నీశమ్‌ను రూ.1.5 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది...

08:55 PM (IST) Feb 13

రాయల్స్‌లోకి కౌంటర్ నైల్..

నాథన్ కౌంటర్‌నైల్‌ని రాజస్థాన్ రాయల్స్ రూ.2 కోట్లకు కొనుగోలు చేసింది.

08:55 PM (IST) Feb 13

కేకేఆర్‌లోకి ఉమేశ్ యాదవ్...

ఉమేశ్ యాదవ్‌ని రూ.2 కోట్లకు కోల్‌కత్తా నైట్‌రైడర్స్ సొంతం చేసుకుంది.

08:34 PM (IST) Feb 13

ఆఖర్లో ఎంట్రీ ఇచ్చిన హ్యూజ్ ఎడ్మర్ట్..

ఐపీఎల్ మెగా వేలాన్ని ప్రారంభించి, ఆకస్మాత్తుగా స్పృహ తప్పిపడిపోయిన ఆక్షనర్ హ్యూజ్ ఎడ్మర్స్, ఆఖర్లో ఎంట్రీ ఇచ్చి చివరి సెట్ ప్లేయర్ల వేలాన్ని నిర్వహించాడు.. ఆఖరి ఘట్టానికి మెగా వేలం చేరుకోవడంతో వేలాన్ని నిర్వహించిన చారు శర్మ, ఎడ్మర్డ్స్‌ని ఆహ్వానించాడు. ...

08:22 PM (IST) Feb 13

మళ్లీ ముంబైలోకి అర్జున్ టెండూల్కర్...


సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్‌ని రూ.30 లక్షలకు కొనుగోలు చేసింది ముంబై ఇండియన్స్...
 

07:54 PM (IST) Feb 13

సన్‌రైజర్స్‌లోకి ఫిలిప్స్...

గ్లెన్ ఫిలిప్స్‌ను రూ.1.5 కోట్లకు కొనుగోలు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

07:51 PM (IST) Feb 13

ఆర్‌ఆర్‌లోకి కరణ్ నాయర్..

కరణ్ నాయర్‌ని రూ.1.40 కోట్లకు దక్కించుకుంది రాజస్థాన్ రాయల్స్... 

07:50 PM (IST) Feb 13

లక్నోలోకి లూయిస్...

ఎవిన్ లూయిస్‌ను రూ.2 కోట్లకు దక్కించుకుంది లక్నో సూపర్ జెయింట్. 

07:50 PM (IST) Feb 13

కేకేఆర్‌లోకి అలెక్స్ హేల్స్...

కర్ణ్ శర్మను ఆర్‌సీబీ రూ.50 లక్షలకు కొనుగోలు చేసింది. కుల్దీప్ సేన్‌ని రూ.20 లక్షలకు రాజస్థాన్ రాయల్స్ దక్కించుకుంది...అలెక్స్ హేల్స్‌ను రూ.1.5 కోట్లకు కేకేఆర్ కొనుగోలు చేసింది. 

07:48 PM (IST) Feb 13

ఢిల్లీకి ఎంగిడి...

లుంగి ఎంగిడి రూ.50 లక్షలకు కొనుగోలు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

07:47 PM (IST) Feb 13

సీఎస్‌కేలోకి జోర్డాన్...

క్రిస్ జోర్డాన్‌ని సీఎస్‌కే జట్టు రూ. 3.6 కోట్లకు కొనుగోలు చేసింది...

07:36 PM (IST) Feb 13

సన్‌రైజర్స్‌లోకి విష్ణు వినోద్..

విష్ణు వినోద్‌ని రూ.50 లక్షలకు కొనుగోలు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్... 

07:35 PM (IST) Feb 13

చెన్నైలోకి జగదీశన్...

ఎన్ జగదీశన్‌ను రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది చెన్నై సూపర్ కింగ్స్... 

07:33 PM (IST) Feb 13

సీఎస్‌కేలోకి హరి నిశాంత్...

హరి నిశాంత్‌ను రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది చెన్నై సూపర్ కింగ్స్...

07:32 PM (IST) Feb 13

టైటాన్స్‌లో మాథ్యూ వేడ్...

ఆస్ట్రేలియా వికెట్ కీపర్ మాథ్యూ వేడ్‌ని రూ. 2.4 కోట్లకు కొనుగోలు చేసింది గుజరాత్ టైటాన్స్... 

07:30 PM (IST) Feb 13

టైటాన్స్‌లోకి సాహా...

భారత సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాని గుజరాత్ టైటాన్స్ జట్టు రూ.1.9 కోట్లకు కొనుగోలు చేసుకుంది. 

07:28 PM (IST) Feb 13

కేకేఆర్‌లోకి సామ్ బిల్లింగ్స్..

సామ్ బిల్లింగ్స్‌ను కోల్‌కత్తా నైట్‌రైడర్స్ జట్టు రూ.2 కోట్లకు సొంతం చేసుకుంది... 

07:26 PM (IST) Feb 13

టైటాన్స్‌లోకి డేవిడ్ మిల్లర్...

డేవిడ్ మిల్లర్‌ను రూ. 3 కోట్లకు కొనుగోలు చేసింది గుజరాత్ టైటాన్స్...

05:59 PM (IST) Feb 13

సన్‌రైజర్స్‌లోకి సామ్రాట్...

ఆర్ సామ్రాట్‌ను రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్... 

05:57 PM (IST) Feb 13

కేకేఆర్‌లోకి కరుణరత్నే...

చమిక కరుణరత్నేను రూ.50 లక్షలకు కొనుగోలు చేసింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్. 

05:50 PM (IST) Feb 13

ముంబైలోకి మెడెరిత్..

రిలే మెడెరిత్‌ను కోటి రూపాయలకు ముంబై ఇండియన్స్ జట్టు కొనుగోలు చేసింది. 

05:46 PM (IST) Feb 13

టైటాన్స్‌లోకి జోసఫ్...

విండీస్ బౌలర్ అల్జెరీ జోసఫ్‌ను రూ. 2.4 కోట్లకు కొనుగోలు చేసింది గుజరాత్ టైటాన్స్ జట్టు.. 

05:19 PM (IST) Feb 13

సీఎస్‌కేలోకి విష్ణు సోలంకి...

విష్ణు సోలంకిని రూ. 1.2 కోట్లకు కొనుగోలు చేసింది చెన్నై సూపర్ కింగ్స్... 
 

05:09 PM (IST) Feb 13

అరోరాకి భారీ ధర...

వైభవ్ అరోరాని రూ.2 కోట్లకు కొనుగోలు చేసింది పంజాబ్ కింగ్స్ జట్టు...

04:57 PM (IST) Feb 13

ఢిల్లీలోకి ప్రవీణ్ దుబే...

ప్రవీణ్ దుబేని రూ.50 లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. 

04:55 PM (IST) Feb 13

టిమ్ డేవిడ్‌కి జాక్ పాట్...

అన్‌క్యాప్డ్ ప్లేయర్ టిమ్ డేవిడ్ రూ.8.25 కోట్లకు కొనుగోలు చేసింది ముంబై ఇండియన్స్ జట్టు...

04:46 PM (IST) Feb 13

సీఎస్‌కేలోకి సేనాపతి...

సుభ్రాన్షు సేనాపతిని రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది చెన్నై సూపర్ కింగ్స్... 

04:42 PM (IST) Feb 13

సీఎస్‌కేలోకి మిల్నే...

ఆడమ్ మిల్నేని రూ. 1.9 కోట్లకు దక్కించుకుంది చెన్నై సూపర్ కింగ్స్...

04:40 PM (IST) Feb 13

ముంబైలోకి తైమాల్ మిల్స్‌...

తైమాల్ మిల్స్‌ను రూ. 1.5 కోట్లకి ముంబై ఇండియన్స్ జట్టు దక్కించుకుంది. 

04:37 PM (IST) Feb 13

రాయల్స్‌కి మెకాయ్..

ఒబిద్ మెకాయ్‌ని రూ.75 లక్షలకు కొనుగోలు చేసింది రాజస్థాన్ రాయల్స్...

04:34 PM (IST) Feb 13

ఆర్‌సీబీలోకి బెహ్రాన్‌డార్ఫ్..

జాసన్ బెహ్రన్‌డార్ఫ్‌ను రూ.75 లక్షలకు కొనుగోలు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు... 

04:31 PM (IST) Feb 13

సన్‌రైజర్స్‌లోకి రొమారియో...

రొమారియో షెపర్డ్‌ను రూ.7.75 కోట్లకు కొనుగోలు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

04:23 PM (IST) Feb 13

సీఎస్‌కేలోకి సాంట్నర్...

మిచెల్ సాంట్నర్‌ను రూ.1.9 కోట్లకు కొనుగోలు చేసింది చెన్నై సూపర్ కింగ్స్... 

04:20 PM (IST) Feb 13

ముంబైలోకి శామ్స్...

 డేనియల్ శామ్స్‌ని రూ.2.6 కోట్లకు కొనుగోలు చేసింది ముంబై ఇండియన్స్...