చరిత్ర సృష్టించిన సాత్విక్‌సాయిరాజ్ రాంకీరెడ్డి- చిరాగ్ శెట్టి... స్విస్ ఓపెన్ 2023 టైటిల్ కైవసం...

By Chinthakindhi Ramu  |  First Published Mar 26, 2023, 4:43 PM IST

స్విస్ ఓపెన్ 2023 సూపర్ సిరీస్ టైటిల్ విజేతగా నిలిచిన సాత్విక్ సాయిరాజ్ రాంకీరెడ్డి - చిరాగ్ శెట్టి జోడి.. 68 ఏళ్ల స్విస్ ఓపెన్ చరిత్రలో భారత్‌కి మొట్టమొదటి డబుల్స్ టైటిల్.. 


భారత షెట్లర్లు సాత్విక్ సాయిరాజ్ రాంకీ రెడ్డి- చిరాగ్ శెట్టి జోడి చరిత్ర సృష్టించింది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ స్విస్ ఓపెన్ 2023 సూపర్ సిరీస్ ఫైనల్‌కి చేరిన సాత్విక్ సాయిరాజ్ రాంకీరెడ్డి - చిరాగ్ శెట్టి జోడి ఫైనల్‌లో చైనీస్ జోడి రెన్ జియాంగ్ యు- టాన్ క్వియాంగ్‌లను 21-19, 24-22 తేడాతో వరుస సెట్లలో చిత్తు చేసి, టైటిల్ కైవసం చేసుకుంది...

Ren/Tan 🇨🇳 rival Rankireddy/Shetty 🇮🇳 to claim the title. pic.twitter.com/PC3fDevefE

— BWF (@bwfmedia)

68 ఏళ్ల స్విస్ ఓపెన్ చరిత్రలో భారత్ గెలిచిన మొట్టమొదటి డబుల్స్ టైటిల్ ఇదే. సెమీ ఫైనల్ మ్యాచ్‌లో మూడో సీడ్ మలేసియా జోడి ఆంగ్ యూ సీన్- టియో ఈతో జరిగిన మ్యాచ్‌లో మూడు సెట్ల పాటు పోరాడి 19-21, 21-17, 17-21 తేడాతో అద్భుత విజయం అందుకున్న సాత్విక్ సాయిరాజ్ రాంకీ రెడ్డి- చిరాగ్ శెట్టి... ఫైనల్‌లో మాత్రం పూర్తి ఆధిపత్యం కనబరిచాడు. భారత షెట్లర్ల జోరుకి చైనా జోడి దగ్గర సమాధానం లేకపోయింది...

Latest Videos

undefined

1955లో ప్రారంభమైన స్విస్ ఓపెన్ సూపర్ 300 సిరీస్‌లో భారత జట్టు ఇప్పటిదాకా డబుల్స్‌లో టైటిల్ గెలవలేదు. భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ 2011, 2012 సీజన్లలో ఉమెన్స్ సింగిల్స్‌లో విజేతగా నిలిచి... స్విస్ ఓపెన్ గెలిచిన మొట్టమొదటి భారత బ్యాడ్మింటన్ ప్లేయర్‌గా నిలిచింది..


ఆ తర్వాత 2015లో కిడాంబి శ్రీకాంత్, 2016లో ప్రణయ్.. పురుషుల సింగిల్స్ విభాగంలో స్విస్ ఓపెన్ టైటిల్స్ గెలిచారు..

2018లో సమీర్ వర్మ కూడా స్విస్ ఓపెన్  పురుషుల సింగిల్స్ విభాగంలో  స్విస్ ఓపెన్ గెలవగా, 2022 సీజన్‌లో పీవీ సింధు, మొట్టమొదటిసారిగా స్విస్ ఓపెన్ టైటిల్‌ని తన ఖాతాలో వేసుకుంది. ఎట్టకేలకు డబుల్స్‌లో టైటిల్ నిరీక్షణకు తెరదించాడు సాత్విక్ సాయిరాజ్ రాంకీరెడ్డి- చిరాగ్ శెట్టి...

స్విస్ ఓపెన్ సూపర్ 300 టోర్నీ చరిత్రలో 3 పురుషుల సింగిల్స్, 3 మహిళల సింగిల్స్‌తో పాటు ఓ పురుషుల డబుల్స్ టైటిల్‌ని గెలిచిన భారత్, అత్యధిక పతకాలు గెలిచిన జట్ల జాబితాలో 11వ స్థానానికి ఎగబాకింది.. 

2023 స్విస్ ఓపెన్‌లో పురుషుల సింగిల్స్ విభాగంలో టీమిండియా నుంచి బరిలో దిగిన ప్రణయ్ రెండో రౌండ్‌లో నిష్కమించగా లక్ష్యసేన్ తొలి రౌండ్‌లోనే ఓడి ఇంటిదారి పట్టాడు... కిరణ్ జార్జ్ తొలి రౌండ్‌లోనే ఓడగా కిడాంబి శ్రీకాంత్ రెండో రౌండ్‌లో ఓడాడు. మిథున్ మంజునాథ్ రెండో రౌండ్ నుంచి నిష్కమించాడు..

మహిళల సింగిల్స్‌లో నాలుగో సీడ్‌గా బరిలో దిగిన పీవీ సింధు, రెండో రౌండ్‌లోనే ఓడింది. మాల్విక బన్సూద్ తొలి రౌండ్ కూడా దాటలేకపోయింది. ఈ సీజన్‌లో క్వార్టర్ ఫైనల్ దాకా వచ్చిన ఏకైక భారత జోడి సాత్విక్ సాయిరాజ్‌ రాంకీ రెడ్డి- చిరాగ్ శెట్టియే. క్వార్టర్ ఫైనల్, సెమీ ఫైనల్, ఫైనల్‌లో ఘన విజయాలు అందుకుని చరిత్ర సృష్టించారు చిరాగ్- సాయిరాజ్.. 

click me!