ఆస్ట్రేలియన్ ఓపెన్ 2023 టోర్నీ క్వార్టర్ ఫైనల్‌లో సానియా మీర్జా- రోహన్ బోపన్న జోడికి వాకోవర్.. మిక్స్‌డ్ డబుల్స్ సెమీస్‌కి భారత జోడి..
భారత స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా, ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ 2023 టోర్నీతో ప్రొఫెషనల్ టెన్నిస్ కెరీర్‌కి ముగింపు పలుకుతున్నట్టు తెలిపింది. తన ఆఖరి టోర్నీలో సానియా మీర్జాకి లక్ బాగా కలిసి వస్తోంది...
ఆస్ట్రేలియన్ ఓపెన్ వుమెన్స్ డబుల్స్‌లో రెండో రౌండ్ నుంచే నిష్కమించిన సానియా మీర్జా, మిక్స్‌డ్ డబుల్స్‌లో మాత్రం సెమీ ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. రోహాన్ బొపన్నతో కలిసి ఆస్ట్రేలియన్ ఓపెన్ 2023 టోర్నీ మిక్స్‌డ్ డబుల్స్‌లో బరిలో దిగిన సానియా మీర్జా తొలి రౌండ్‌లో ఆస్ట్రేలియా జోడి ఫెర్లూస్, సెవెల్లీతో జరిగిన మ్యాచ్‌లో 5-7, 3-6 తేడాతో విజయం అందుకుంది..
undefined
రెండో రౌండ్‌లో జపాన్ జోడి బెహార్, నినోమియాతో జరిగిన మ్యాచ్‌లో 6-4, 7-6, 11-9 తేడాతో విజయం అందుకుని క్వార్టర్ ఫైనల్‌కి అర్హత సాధించింది సానియా మీర్జా - రోహాన్ బోపన్న జోడి. ఈ విజయంతో క్వార్టర్ ఫైనల్‌కి దూసుకెళ్లింది భారత మిక్స్‌డ్ డబుల్స్ పెయిర్...
Mirza/Bopanna receive a walkover and are into the SF of the Australian Open Mixed Doubles pic.twitter.com/W7s5CR2QbR
— Indian Tennis Daily (ITD) (@IndTennisDaily)నేటి మధ్యాహ్నం క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో స్పెయిన్ జోడి వేగ హెర్నండేజ్, ఓస్తాపెంకోతో తలబడాల్సి ఉంది సానియా మీర్జా- రోహాన్ బోపన్న జోడి. అయితే గాయంతో బాధపడుతున్న హెర్నండేజ్, క్వార్టర్ ఫైనల్ నుంచి తప్పుకున్నారు. దీంతో సానియా మీర్జా- రోహాన్ బోపన్న జోడికి వాకోవర్ లభించి, సెమీ ఫైనల్‌కి దూసుకెళ్లింది...
సెమీ ఫైనల్‌లో ఒక్క విజయం అందుకుంటే, ఫెర్‌వెల్ టోర్నీని పతకంతో ముగించే అద్భుత అవకాశం దక్కించుకుంటుంది భారత టెన్నిస్ లెజెండ్ సానియా మీర్జా..