ప్రో కబడ్డి 2019: తెలుగు టైటాన్స్-పాట్నా పైరేట్స్ మ్యాచ్ టై

By Arun Kumar PFirst Published Sep 20, 2019, 8:55 PM IST
Highlights

పూణే వేదికన జరిగుతున్న ప్రో కబడ్డి లీగ్ సీజన్  7 లో మరోమ్యాచ్ టైగా ముగిసింది. తెలుగు టైటాన్స్-పాట్నా ఫైరేట్స్ మధ్య జరిగిన పోరులో ఇరు జట్లు సమఉజ్జీలుగా నిలిచాయి.  

ప్రో కబడ్డి సీజన్ 7 లో భాగంగా తెలుగు టైటాన్స్-పాట్నా పైరేట్స్ మధ్య జరిగిన మ్యాచ్ టైగా ముగిసింది. ఇరు జట్లు హోరాహోరీగా పోరాడి సమఉజ్జీలుగా నిలిచాయి. మ్యాచ్ ముగిసే సమయానికి ఇరు జట్లు సమానంగా 42-42 పాయింట్లు సాధించాయి. ఇలా ఫలితం తేలకుండానే మ్యాచ్ ముగిసింది. మ్యాచ్ టైగా  ముగియడంతో విన్నింగ్ పాయింట్లను ఇరుజట్లు సమానంగా పంచుకోనున్నాయి.  

పూణేలోని శ్రీ చత్రపతి స్టేడియం ఈ ఉత్కంఠ పోరుకు వేదికయ్యింది. ఫస్ట్ హాఫ్ లో తెలుగు టైటాన్స్ స్వల్ప ఆధిక్యాన్ని కనబర్చినా సెకండ్ ఆఫ్ లో  వెనుకబడి పోయింది. ముఖ్యంగా పాట్నా ఆటగాడు ప్రదీప్ నర్వాల్ అద్భుతంగా పుంజుకుని తమ జట్టును ఓటమినుండి తప్పించాడు. అతడు 17 పాయింట్లతో పాట్నాను ఓటమి నుండి తప్పించి మ్యాచ్ టైగా ముగిసేలా చేశాడు. 

మిగతా ఆటగాళ్లలో లీ జంగ్ 7, హదీ 5, వికాస్ 4, జయదీప్ 2 పాయింట్లతో రాణించాడు. ఇలా  పాట్నా రైడింగ్ లో 31, ట్యాకిల్స్ లో 7, ఆలౌట్ల ద్వారా 4, ఎక్స్‌ట్రాల రూపంలో 2 మొత్తంగా 42 పాయింట్లు సాధించింది. 

తెలుగు టైటాన్స్ ఆటగాళ్లలో స్టార్ రైడర్ సిద్దార్థ్ దేశాయ్ 12,  రజనీశ్ 10 పాయింట్లతో రాణించారు. మిగతావారిలో వికాస్ 4, రాకేశ్ 3, అబోజర్ 3, ఫహాద్ 2 పాయింట్లు అందించారు. దీంతో టైటాన్స్ జట్టు రైడింగ్ లో 28, ట్యాకిల్స్ లో 8, ఆలౌట్ల ద్వారా 4, ఎక్స్‌ట్రాల రూపంలో 3 మొత్తం 42  పాయింట్లతో పాట్నాతో సమానంగా నిలిచింది. దీంతో మ్యాచ్ టైగా ముగిసింది. 

click me!