దేశంలోనే అత్యధికంగా యూజర్స్ కలిగిన షార్ట్ వీడియో యాప్ `జోష్`.. తన జర్నీలో మరో మైలు రాయికి చేరుకుంది. తాజాగా అది స్టార్ స్పోర్ట్స్ తో కలిసి పనిచేయబోతుంది.
ఇండియాలో అత్యధిక యూజర్ కలిగిన షార్ట్ వీడియో యాప్ `జోష్` మరో సంచలనానికి తెరలేపింది. తన జర్నీలో మరో ముందడుగు వేసింది. సోషల్ మీడియాలో కంటెంట్ క్రియేషన్ కి సంబంధించిన మార్కెట్‌లో తన ఆధిపత్యాన్ని పదిలపరచుకుంది. ఈ యాప్ కంటెంట్ లు వినియోగదారులకు, కంటెంట్ డెవలపర్‌లకు గొప్ప ఆనందాన్ని అందిస్తుంది. అందులో భాగంగా ఇప్పుడు స్టార్ స్పోర్ట్స్ తో భాగమయ్యింది.
జోష్ త్వరలో ప్రో కబడ్డీ లీగ్(పీఎకేఎల్) సీజన్ 10న ప్రారంభించబోతుంది. అయితే దీనికి సంబంధించి అది ఏకంగా స్టార్ స్పోర్ట్స్ తో కలిసి పనిచేయబోతుండం విశేషం. ఇలాంటి మహత్తరమైన ఈవెంట్‌లో జోష్ క్రియేటర్లు గరిష్ట స్థాయికి చేరుకోవడం ఈ ఈవెంట్ కే హైలైట్‌గా నిలిచింది. జోష్ ఇన్ ఫ్లూయెన్సర్లకు కబడ్డీ క్యాంపుల్లో ప్రవేశం లభించింది. వారు కొంత మంది టీమ్ మెంబర్స్ తో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం కూడా లభించింది.
దీనికి సంబంధించి జోష్ సృష్టికర్తలు ఈ చర్యను ప్రతక్ష్యంగా, దగ్గరగా చూసి తమ ఆనందాన్ని, అనుభవాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఈ లీగ్ గురించి వారు చెబుతూ. ప్రో కబడ్డీ ఆటగాళ్లతో ఇంత సన్నిహితంగా ఉండటాన్ని మేం ఎప్పుడూ ఊహించలేదు. ఇదొక అద్భుతమైన మూమెంట్‌గా అనిపిస్తుంది. టీమ్ ట్రైనింగ్‌ని ప్రాక్టీస్ మ్యాట్‌లపై కవర్ చేసే అవకాశం కూడా వచ్చింది. గేమ్ వెనకాల ఆటగాళ్ల కష్టాలను, హార్డ్ వర్క్ ని ఈ సందర్బంగా మేము ప్రత్యక్షంగా చూడగలిగాం. జోష్ యాప్ సృష్టికర్తలుగా దీనికి మేం సహకరించడానికి గల అవకాశాల కోసం ఎదురుచూస్తున్నాం. ఈ సందర్భంగా తమతో కలిసిన స్టార్ స్పోర్ట్స్ కి ప్రత్యేక ధన్యవాదాలు అని జోష్ నిర్వహకులు తెలిపారు.
హైదరాబాద్‌కి చెందిన తెలుగు టైటాన్స్ టీమ్, ఢిల్లీకి చెందిన దేబాంగ్ ఢిల్లీ టీమ్‌తో రెండు జట్లతో సహకారం జరిగింది. ప్రో కబడ్డీ లీగ్ ల్యాండ్ మార్క్ సీజన్ 10 డిసెంబర్ 2 నుంచి ప్రారంభం కానుంది. ప్రతి రోజు సాయంత్రం ఎనిమిది గంటల నుంచి ఇది ప్రసారం కానుంది. ఇందులో హై వోల్టేజ్ యాక్షన్ క్రీడలను నిర్వరామంగా తిలకించవచ్చు. చూసి ఎంజాయ్ చేయవచ్చు. ఇక నాన్ స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్‌కి కొదవలేదని చెప్పొచ్చు అని నిర్వహకులు తెలిపారు.