గౌతమ్ గంభీర్ కోల్‌కతా నైట్ రైడర్స్‌లో చేరినట్లు ప్రకటించి లక్నో సూపర్ జెయింట్స్‌తో తన 2 సంవత్సరాల ప్రయాణానికి ముగింపు పలికాడు
భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ అధికారికంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఫ్రాంచైజీ లక్నో సూపర్ జెయింట్స్‌ను విడిచిపెట్టి తిరిగి కోల్‌కతా నైట్ రైడర్స్‌లో చేరాడు. ఆ జట్టులో గౌతమ్ గంభీర్ కెప్టెన్‌గా రెండు టైటిళ్లను గెలుచుకున్నాడు. కేకేఆర్ సీఈవో వెంకీ మైసూర్ గంభీర్ జట్టులో మెంటార్ పాత్రను పోషించబోతున్నాడని బుధవారం నాడు ప్రకటించారు. నైట్ రైడర్స్ సహ యజమాని షారుఖ్ ఖాన్ ఈ నిర్ణయాన్ని స్వాగతించాడు, ఫ్రాంచైజీకి గంభీర్ రాకను 'తమ కెప్టెన్ రిటర్న్'గా పేర్కొన్నాడు. గంభీర్ కూడా భావోద్వేగానికి గురయ్యాడు.
గంభీర్ రెండేళ్లపాటు LSG మెంటార్‌గా పనిచేశాడు. ఐపీఎల్ 2022 లో జట్టు ఫైనల్‌కు చేరుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. 2023 క్యాంపెయిన్ లో, ఎల్ఎస్ జీ లీగ్ స్టాండింగ్‌లలో మూడవ స్థానంలో నిలిచింది. కానీ, వరుసగా రెండోసారి ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయింది. "గంభీర్ కూడా ఒక భావోద్వేగ పోస్ట్‌తో సూపర్ జెయింట్స్‌కు వీడ్కోలు పలికాడు. ట్విట్టర్‌లో ఇలా పోస్ట్ చేశాడు. "లక్నో సూపర్ జెయింట్స్‌తో నా ప్రయాణం ముగిసింది. ఈ ప్రయాణం అంతా సంపూర్ణ ప్రేమతో, గ్రాటిట్యూడ్ తో నిండిపోయింది. ఈ ప్రయాణాన్ని చిరస్మరణీయం చేసిన ఆటగాళ్లు, కోచ్‌లు, సపోర్టు స్టాఫ్, ప్రతి ఒక్కరికీ అపారమైన కృతజ్ఞతలు. ఈ అద్భుతమైన ఫ్రాంచైజీని తయారుచేస్తున్న సమయంలో, నా ప్రయత్నాలన్నింటికీ విపరీతమైన మద్దతునిచ్చినందుకు డా. సంజీవ్ గోయెంకా స్ఫూర్తిదాయకమైన నాయకత్వానికి కృతజ్ఞతలు. జట్టు భవిష్యత్తులో అద్భుతాలు చేస్తుందని, ప్రతి ఎల్ఎస్ జీ అభిమానిని గర్వించేలా చేస్తుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్ ఎల్ఎస్ జీ బ్రిగేడ్!" అని చెప్పుకొచ్చారు.
undefined
మరో పోస్ట్‌లో, తాను మళ్లీ నైట్ రైడర్స్‌లో చేరినట్లు గంభీర్ వెల్లడించాడు. తిరిగి నైట్ రైడర్స్ కు వచ్చిన సందర్భంగా గంభీర్ మాట్లాడుతూ, "నేను ఎమోషనల్ వ్యక్తిని కాదు. చాలా విషయాలు నన్ను కదిలించవు. కానీ ఇది భిన్నంగా ఉంది. ఈ రోజు నా గొంతులో అడ్డుపడుతోంది. నా గుండెలో ఏదో మంట ఉంది. నేను మరోసారి ఆ పర్పుల్, గోల్డ్ జెర్సీలో కనిపించడం మీద ఆలోచిస్తున్నాను. నేను కెకేఆర్ కి తిరిగి రావడం కాదు.. సిటీ ఆఫ్ జాయ్ కి తిరిగి వస్తున్నారు. నా నెంబర్ 23. నాకు ఆకలిగా ఉంది. నేనిప్పుడు కేకేఆర్" అని చెప్పుకొచ్చాడు.
గంభీర్‌ని తిరిగి కేకేఆర్ కి స్వాగతిస్తూ, షారుఖ్.. "గౌతమ్ ఎప్పుడూ కుటుంబంలో భాగమే. మా కెప్టెన్ "మెంటర్" గా వేరే అవతార్‌లో ఇంటికి తిరిగి వస్తున్నాడు. చాలా మిస్ అయ్యాడు. ఇప్పుడు అందరం చందు సర్ కోసం ఎదురుచూస్తున్నాం. టీమ్ కేకేఆర్ తో మ్యాజిక్ క్రియేట్ చేయడంలో గౌతమ్ ఎప్పటికీ చెప్పలేని స్ఫూర్తిని, క్రీడాస్ఫూర్తిని నిలబెట్టారు" అన్నారు.
❤️❤️ LSG Brigade! pic.twitter.com/xfG3YBu6l4
— Gautam Gambhir (@GautamGambhir)I’m back. I’m hungry. I’m No.23. Ami KKR ❤️❤️ pic.twitter.com/KDRneHmzN4
— Gautam Gambhir (@GautamGambhir)