భార్యను 59సార్లు పొడిచి చంపిన భర్త, జీవిత ఖైదు

By telugu team  |  First Published May 13, 2019, 12:27 PM IST

భార్యను అతి కిరాతకంగా 59సార్లు పొడిచి చంపిన ఓ భర్తకు న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. ఈ సంఘటన లండన్ లో చోటుచేసుకుంది. ఈ ఘటన గతేడా క్రిస్మస్ రోజున జరగగా.. న్యాయస్థానం తాజాగా అతనికి శిక్ష విధించింది.

భార్యను అతి కిరాతకంగా 59సార్లు పొడిచి చంపిన ఓ భర్తకు న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. ఈ సంఘటన లండన్ లో చోటుచేసుకుంది. ఈ ఘటన గతేడా క్రిస్మస్ రోజున జరగగా.. న్యాయస్థానం తాజాగా అతనికి శిక్ష విధించింది.

పూర్తి వివరాల్లోకి వెళితే... యూకేకి చెందిన ల్యూరెన్స్ బ్రాండ్(47) అనే వ్యక్తి భారత సంతతికి చెందిన ఏంజెలా మిట్టల్ ను వివాహం చేసుకున్నారు. వీరు యూకేలోనే స్థిరపడ్డారు. కాగా గతేడాది క్రిస్మస్ రోజున ల్యూరెన్స్ కిచెన్ లో కూరగాయలు కత్తిరించేందుకు ఉపయోగించేకత్తులతో భార్యపై దాడి చేశాడు

Latest Videos

undefined

ఆమె మెడ, ఎద భాగంపై 59సార్లు  కత్తితో పొడిచి హత్య చేశాడు. ఆమెను చంపుతుండగా.. కత్తి విరిగిపోవడంతో కిచెన్ లోకి వెళ్లి మరో కత్తి తెచ్చి.. దానితో కూడా ఆమెపై దాడి చేశాడు. దీంతో.. ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.

ఈ కేసులో నిందితుడిగా పోలీసులు ల్యూరెన్స్ ని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. కాగా...తాను చేసిన నేరాన్ని ఆయన అంగీకరించడంతో జీవిత ఖైదు విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. 

click me!