ప్రేయసి మోసం చేసిందంటూ కెనడాలో ఓ తెలుగు యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
కెనడా: మంచి భవిష్యత్ వుంటుందని విదేశాలకు వెళ్లిన ఓ యువకుడు అర్దాంతరంగా జీవితాన్ని ముగించాడు. ప్రేయసి మోసం చేసిందంటూ కెనడాలో ఓ తెలుగు యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. సెల్పీ వీడియో తీసుకుంటూ బలవన్మరణానికి పాల్పడ్డాడు యువకుడు.
వివరాల్లోకి వెళితే... ప్రణయ్ అనే తెలుగు యువకుడు ఉన్నత చదువుల కోసం కెనడాకు వెళ్లాడు. అయితే అక్కడ ఓ యువతితో అతడికి పరిచయం ఏర్పడి అదికాస్తా ప్రేమకు దారితీసింది. ఈ క్రమంలోనే వీరిద్దరూ కొంతకాలం సహజీవనం కూడా చేశారు.
అయితే ఆ అమ్మాయి తనతోనే కాకుండా మరో ఆరుగురు యువకులతో ప్రేమాయణం సాగించినట్లు ప్రణయ్ గుర్తించాడు. అంతేకాకుండా వేరే దేశానికి వెళ్లడానికి వీసా రావడంతో తనను వదిలేసి వెళ్లడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఇలా ప్రేయసి చేతిలో మోసపోయిన ప్రణయ్ దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు.
నైట్రోజన్ గ్యాస్ పీల్చి ప్రణయ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలా ఆత్మహత్య చేసుకుంటూ సెల్పీ వీడియోను చిత్రీకరించుకున్నాడు. బలవన్మరణానికి ముందు సూసైడ్ లెటర్ రాసిన అతడు బాధపడవద్దని తల్లిదండ్రులకు సూచించాడు. అంతేకాకుండా తన అవయవాలను దానం చేయాలని... మిగిలిన మృతదేహాన్న పరిశోధనల కోసం వాడేలా చూడాలంటూ తన చివరి కోరికను తెలిపాడు.