లండన్ లో ఘనంగా తెలంగాణ ఆవతరణ దినోత్సవ వేడుకలు... ఎన్నారైల సంబరాలు

By Arun Kumar P  |  First Published Jun 3, 2019, 6:46 PM IST

స్వరాష్ట్రం. తెలంగాణ ప్రజల ఎన్నో ఏళ్ల కల. చివరకు 2014 జూన్ 2న సాకారమయ్యింది. దీంతో ప్రతి ఏడాది  తెలంగాణ ప్రజలు ఈ తేదీన ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్న విషయం తెలిసిందే. అలా రాష్ట్రం ఏర్పడి ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈసారి ఆ వేడుకలు మరింత వైభవంగా జరిగాయి.  ఇలా రాష్ట్రంలోనే కాదు వివిధ దేశాల్లో స్థిరపడ్డ తెలంగాణవాసులు కూడా జూన్ 2న సంబరాలు జరుపుకున్నారు. ఇలా ఎన్నారై టిఆర్ఎస్ యూకే సెల్ ఆద్వర్యంలో ఇంగ్లాండ్ రాజధాని లండన్ లో కూడా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముందుగా తెలంగాణ సిద్దాంత కర్త ప్రొపెసర్  జయశంకర్ ను గుర్తుచేసుకున్నారు. ఆయన తెలంగాణవాసుల్లో స్వరాష్ట్ర స్పూర్తిని ఎలా రగిల్చారో గుర్తుచేశారు. ఇలాంటి మహనీయున్ని గౌరవించుకుంటేనే తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సార్థకత లభిస్తుందని ఎన్నారై టిఆర్ఎస్ యూకే సెల్ సంయుక్త కార్యదర్శి సురేష్ గోపతి అన్నారు. ఆయన అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలు ముందుగా జయశంకర్ చిత్ర పటానికి పూలమాల వేయడంతోనే ప్రారంభించారు.

Latest Videos

undefined

అనంతరం తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన అమరవీరులని స్మరించుకుని రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఆ తర్వాత ప్రత్యేకంగా తయారుచేయించిన కేకును కట్ చేశారు.    

ఈ సందర్భంగా ఎన్నారై టిఆర్ఎస్‌సెల్ ఉపాధ్యక్షులు నవీన్ రెడ్డి మాట్లాడుతూ...లండన్ లో తెలంగాణా రాష్ట్ర ఆవతరణ దినోత్సవ సంబరాలు ఐదోసారి నిర్వహించడం సంతోషంగా వుందన్నారు. అమరవీరుల త్యాగఫలం, కెసిఆర్ సారథ్యం వల్లే స్వరాష్ట్రం సాధ్యమయ్యిందన్నారు. నూతన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కేసీఆర్ చేస్తున్న ఆభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు విజయపథంలో దూసుకెళ్తున్నాయని అన్నారు. అలా తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని కొనియాడారు.   

ఇక ప్రధాన కార్యదర్శి రత్నాకర్ కడుదుల మాట్లాడుతూ... తెలంగాణా రాష్ట్రాన్ని ప్రపంచ వేదికపై పరిచయం చేయడానికి మా వంతు బాధ్యతతో కృషి చేస్తున్నామన్నారు. తెలంగాణా ఉద్యమంలో ఎన్నారైల పాత్ర ఎనలేనిదని...ఇక్కడ జరిగిన ఉద్యమానికి చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంటుందన్నారు. 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్  రైతు బంధు, రైతు భీమా, పెన్షన్స్, కాళేశ్వరం ప్రాజెక్ట్, మిషన్ భగీరథ వంటి ఎన్నో జనరంజక కార్యక్రమాలు చేపట్టారని సంయుక్త కార్యదర్శి రమేష్ కొనియాడారు. ఆయన మాదిరిగానే బంగారు తెలంగాణా సాధనకై అందరు తమవంతు కృషి చేయాలనీ కోరారు.

ఈ వేడుకల్లో ఈస్ట్ లండన్ ఇంచార్జ్ ప్రశాంత్ కటికనేని, ముఖ్య సభ్యులు అబ్దుల్ జాఫర్, రామ్ కలకుంట్ల మరియు తెలంగాణ జాగృతి యూకే అధ్యక్షులు సుమన్ రావు బాలమూరి, తెలంగాణ జాగృతి యూరోప్ అధ్యక్షులు సంపత్ ధన్నమనేని, జాగృతి సభ్యులు కిషోర్ మునిగాల తదితరులు కూడా పాల్గొన్నారు. 

click me!