ఖండాంతరాలు దాటిన తెలంగాణ బోనాలు...ఆస్ట్రేలియాలో ఘనంగా వేడుకలు

By Arun Kumar P  |  First Published Jul 16, 2019, 7:58 PM IST

ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలో ఆషాడ మాస బోనాల జాతర ఘనంగా జరిగింది.  తెలంగాణ ప్రజలంతా ఒక్కచోటికి చేర్చి ఈ వేడుకలను మెల్బోర్న్ తెలంగాణ న్యూస్ సంస్థ ఘనంగా నిర్వహించింది. 


తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక బోనాలు. ఆషాడం మాసం వచ్చిందంటే చాలు రాష్ట్రంలోని ప్రతి పల్లెలో గ్రామదేవతలకు బోనాలు సమర్పించుకోవడం తెలంగాణ సాంప్రదాయం. ఇక హైదరాబాద్ లో అయితే నెల రోజులు పాటు ప్రతి ఆదివారం ఏదో ఒకచోట(సికింద్రాబాద్, లాల్ దర్వాజ) ఈ బోనాల పండగ అంగరంగవైభవంగా జరుగుతుంది. ఇప్పుడు ఈ తెలంగాణ బోనాలు సంస్కృతి విదేశాలకు కూడా పాకింది. ఖండాంతరాలు దాటిన తెలంగాణ బోనాలు ఆస్ట్రేలియాలో మరింత వైభవంగా జరిగాయి. 

ఆస్ట్రేలియా లో స్థిరపడిన తెలంగాణ కుటుంబాలు తమ సంస్కృతికి  ప్రతీకగా నిలిచే బోనాల జాతరను ఘనంగా జరుపుకున్నారు.  మెల్‌బోర్న్ నగరంలోని దుర్గామాత ఆలయంలో ఈ  బోనాల సంబరాలు అంగరాన్నంటాయి. మెల్బోర్న్ తెలంగాణ న్యూస్ సంస్థ ఆధ్వర్యంలో ఈ సంబరాలు జరిగాయి. 

Latest Videos

undefined

ఆటా, పాటలతో సందడి

ఈ  సందర్భంగా తెలుగు సాంప్రధాయ దుస్తుల్లో ఆలయానికి విచ్చేసిన మహిళలు భక్తి శ్రద్దలతో అమ్మవారికి బోనాలు సమర్పించుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణకు చెందిన వారంతా ఒకే కుటుంబ సభ్యుల మాదిరిగా కలిసి మెలిసి ఆనందంగా గడిపారు. బోనాలతో పాటు అమ్మవారికి తొట్టెలలు సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు. 

ఈ సందర్భంగా నిర్వహకులు వివిధ రకాల కార్యక్రమాలను నిర్వహించారు. చిన్నారుల ఆటా, పాటలతో యువకుల నృత్యాలతో  దుర్గామాత ఆలయంలో ఎంతో సందడిగా ఈ వేడకలు జరిగాయి. ఇక ప్రత్యేకమైన బోనాల పాటలకు తెలంగాణ వారే కాకుండా ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా మైమరిచిపోయి నృత్యాలు చేయడం ఈ వేడుకకే హైలైట్ గా నిలిచింది.

 తెలంగాణ లో ఎంతో ఘనంగా నిర్వహించబడుతున్న ఈ వేడుకలను అదే స్థాయిలో  గత 5 సంవత్సరాలు గ నిర్వహిస్తున్న మెల్బోర్న్ తెలంగాణ న్యూస్ సంస్థ నిర్వాహకులు తెలంగాణ మధు తెలిపారు. అలాగే ఈ వేడుకల నిర్వహణలో సహకరించిన రాజు వేముల , ప్రజీత్ రెడ్డి కోతి , దీపక్  గద్దె లతో పాటు హాజరైన వివిధ సంఘాల నాయకులు, స్థానికంగా నివసిస్తున్న తెలంగాణ  ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.  

click me!