టాక్ ఆధ్వర్యంలో లండన్‌లో ఘనంగా బోనాల జాతర

By Siva Kodati  |  First Published Jul 11, 2019, 5:00 PM IST

తెలంగాణ అసోసియేషన్ ఫర్ యునైటెడ్ కింగ్‌డమ్ ఆధ్వర్యంలో లండన్‌లో బోనాల జాతరను ఘనంగా నిర్వహించారు. 


తెలంగాణ అసోసియేషన్ ఫర్ యునైటెడ్ కింగ్‌డమ్ ఆధ్వర్యంలో లండన్‌లో బోనాల జాతరను ఘనంగా నిర్వహించారు. సొంత వూళ్లో జరుపుకున్న విధంగానే సాంప్రదాయ బద్ధంగా పూజలు నిర్వహించి, నగర వీధుల్లో తొట్టెల ఊరేగింపు, పోతురాజు ఆటలు తెలంగాణ ప్రజలతో పాటు స్థానికులను సైతం ముగ్ధులను చేసింది.

ఈ కార్యక్రమానికి యూకేలో స్థిరపడిన 800కి పైగా తెలంగాణ వాసులతో పాటు స్థానిక ఎంపీలు వీరేంద్ర శర్మ, సీమ మల్హోత్రా, రూత్ కాడ్బరీ, ఇండియన్ హైకమిషన్ ప్రతినిధి ప్రేమ్ జిత్ మరియు హౌన్సలా డిప్యూటీ మేయర్ రాగ్విందర్ సిద్ధూ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

Latest Videos

undefined

ఈ సందర్భంగా భారత సంతతి ఎంపీ వీరేంద్ర శర్మ మాట్లాడుతూ.. యూకేలో నివసిస్తున్న తెలంగాణ ఎన్నారైలంతా సమాజ సేవలో ఎంతో క్రీయాశీలకంగా పాల్గొంటారని.. వీరి స్ఫూర్తి చాలా గొప్పదని తెలిపారు. విదేశాల్లో ఉన్నప్పటికీ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలని ప్రపంచానికి చాటి చెబుతున్న తీరు చాలా గొప్పగా ఉందన్నారు.

లండన్ వీధుల్లో బోనాల తొట్టెల ఊరెగింపు చూసి చాలా గర్వపడుతున్నానని.. టాక్ సంస్థ చేస్తున్న కార్యక్రమాలు ఎందరికో స్ఫూర్తినిస్తున్నాయని ఆయన ప్రశంసించారు. స్ధానికంగా ఎటువంటి సహాయం కావాలన్నా తనను సంప్రదించవచ్చునని వీరేంద్ర శర్మ తెలిపారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ గారి నాయకత్వాన్ని తాము గమనిస్తున్నామని... ఆయన రూపొందిస్తున్న ప్రతి పథకం వినూత్నంగా ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఉన్నాయని ఎంపీ ప్రశంసించారు.

సీమా మల్హోత్రా మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాల వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. అమ్మవారికి బోనం సమర్పించడానికి పెద్ద ఎత్తున మహిళలు బోనం నెత్తిన పెట్టుకుని లండన్ వీధుల్లో రావడం చూస్తుంటే..ఒక మహిళగా ఎంతో గర్వంగా అనిపిస్తోందన్నారు.

ఇండియన్ హైకమిషన్ ప్రతినిధి ప్రేమ్‌జిత్ మాట్లాడుతూ..  బోనాలు వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని,  తెలంగాణా సంస్కృతి ని ప్రపంచానికి చాటిచెప్తున్న  తీరుని ప్రశంసించారు.

టాక్ సంస్థ ఇటు జాతీయ పండుగలు రాష్ట్ర పండుగలు ఎంతో ఘనంగా నిర్వహిస్తు భారత జాతి గౌరవాన్ని విదేశీ గడ్డ పై ముందుకు తీసుకెళ్తున్న తీరు ఎందరికో స్ఫూర్తినిస్తుందని, భారత హై కమీషన్ అన్ని సందర్భాల్లో టాక్ సంస్థకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు.

మరో ఎంపీ రూత్ క్యాడ్బరీ మాట్లాడుతూ.. తి సంవత్సరం ఎదో కారణాల వాళ్ళ రాలేక పోయాను కానీ ఈ సారి వచ్చిన తరువాత ఈ వేడుకల్లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని, ఇంత గొప్ప సాంస్కృతిక వేడుకల్లో ఇంతకు ముందు పాల్గొనలేక పోయినందుకు బాధపడ్తున్నాని తెలిపారు.

కుటుంబ సమేతంగా అంతా కలిసి ఇలా వేడుకలు చేసికొని రాబోయే తరాలకి తెలియజెప్పడం ఎంతో స్ఫూర్తినిస్తుందని, ముఖ్యంగా మహిళలంతా ముందుండి ఈ వేడుకల్ని నిర్వహించడం సాటి మహిళగా గర్వంగా ఉందని తెలిపారు.

సంస్థ అద్యక్షురాలు  పవిత్ర రెడ్డి కంది  మాట్లాడుతూ  టాక్ సంస్థ ద్వారా జరుపుతున్న  బోనాల వేడుకలకు విచ్చేసిన అతిథులకు, స్థానిక ప్రవాసులకు కృతఙ్ఞతలు తెలిపారు.  

టాక్ మరియు ఎన్నారై టి. ఆర్. యస్  వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ.. ఒక నాడు పండుగలంటే కేవలం సంక్రాంతి - ఉగాది మాత్రమేనని, ప్రవాస తెలంగాణ సంఘాలు ఏర్పడ్డాక బోనాలు - బతుకమ్మ వేడుకల్ని ప్రపంచవ్యాప్తంగా ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారని తెలిపారు.

వేడుకల్లో భాగంగా ప్రముఖ నృత్య కళాకారిణి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ గ్రహీత,  రాగసుధా వింజమూరి చేసిన మహా శక్తి నృత్యం  వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన ఎంపీలు వీరేంద్ర శర్మ, సీమ మల్హోత్రా , రూత్ కాడ్బరి , ఇండియన్ హైకమిషన్  ప్రతినిథి ప్రేమ్ జీత్  మరియు  హౌన్సలౌ డిప్యూటీ మేయర్ రాగ్విందర్ సిద్దు లను సత్కరించి జ్ఞాపికను అందచేశారు.

click me!