లండన్ లో ఓ భారతీయ యువతి మీద భారతీయ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమె పరిస్థితి విషమంగా ఉంది. నిందితుడిని అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
హైదారాబాద్ : లండన్ లో indian woman మీద కత్తితో attack జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేరళకు చెందిన సోనాబిజు (22) అనే యువతి నెల రోజుల క్రితమే london వెళ్లింది. ఈస్ట్ లండన్ యూనివర్సిటీలో మాస్టర్ డిగ్రీ చేసేందుకు లండన్ వెళ్లిన యువతి.. ఈస్ట్ హోమ్ లోని హైదరాబాదీ రెస్టారెంట్ లో వెయిటర్ గా పార్ట్ టైం జాబ్ చేస్తోంది. ఈ క్రమంలోనే యువతిమీద ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. దాడి చేసిన వ్యక్తి శ్రీరామ్ అంబర్లాగా గుర్తించారు.
అతను హైదరాబాద్ కు చెందిన వ్యక్తిగా మెట్రో పాలిటన్ పోలీసులు తెలిపారు. అయితే దాడికి గల కారణాలు తెలియాల్సి ఉంది. నిందితుడిని థేమ్స్ మెజిస్టేట్ కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. ఏప్రిల్ 25 వరకు నిందితుడికి కోర్టు కస్టడీ విధించింది.
ఇదిలా ఉండగా, మార్చి 21న లండన్ లో ఇలాంటి ఘటనే జరిగింది. లండన్‌లోని Indian-Originకి చెందిన బ్రిటిష్ విద్యార్థిని murderకు గురయ్యింది. వసతి గృహంలో ఉన్నstudentపై ఓ వ్యక్తి attackచేసి హత్య చేశాడు. ఈ కేసులో అనుమానితుడిగా స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు Tunisian Nationalని అరెస్టు చేసింది. ఈ ఘటన శనివారం చోటు చేసుకుంది. లండన్‌లోని క్లర్కెన్‌వెల్ ప్రాంతంలోని ఆర్బర్ హౌస్ విద్యార్థి ఫ్లాట్‌లో 19 ఏళ్ల బ్రిటీష్ జాతీయురాలు సబితా తన్వానీ మెడపై తీవ్ర గాయాలతో కనిపించింది.
మెట్రోపాలిటన్ పోలీసులు 22 ఏళ్ల వ్యక్తి మహేర్ మారూఫ్ కోసం urgent appealని జారీ చేశారు, అతనికి హతురాలు తన్వానీతో రిలేషన్ షిప్ లో ఉన్నాడని చెప్పారు. హతురాలి మృతదేహం కనిపెట్టిన మరుసటి రోజు ఆదివారంనాడు హత్యజరిగిన క్లర్కెన్‌వెల్‌లోని అదే ప్రాంతంలో వాంటెడ్ నిందితుడిని అధికారులు అరెస్టు చేశారు. "Maaroufeని కనుగొనడానికి మేము చేసిన అప్పీల్ ను ప్రచారం చేసి.. అతడిని కనిపెట్టడానికి సాయపడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను" అని ఈ కేసు విచారణకు నాయకత్వం వహిస్తున్న మెట్ పోలీస్ స్పెషలిస్ట్ క్రైమ్ విభాగానికి చెందిన డిటెక్టివ్ చీఫ్ ఇన్‌స్పెక్టర్ లిండా బ్రాడ్లీ అన్నారు.
“ఈ వివరాలు సబిత కుటుంబానికి అందించాం. వారికి మా అధికారుల మద్దతును కొనసాగుతుంది. వారికి మా ప్రగాఢ సానుభూతి. సబిత హత్య విషయాన్ని వారు బాధాతప్త హృదయాలతో అంగీకరించారు. వారు ప్రస్తుతం చాలా విషాదంలో ఉన్నంతున వారి గోప్యతను గౌరవించాలని ప్రతి ఒక్కరినీ కోరుతున్నాం ” అని ఆమె చెప్పింది. అంతకు ముందే కేసు ఇంకా పెండింగులో ఉన్నా.. తన్వానీ కుటుంబానికి ప్రత్యేక పోస్ట్‌మార్టం పరీక్షను నిర్ణీత సమయంలో ఏర్పాటు చేయనున్నట్లు మెట్ పోలీసులు తెలిపారు. "మరూఫ్ సబితాతో రిలేషన్ లో ఉన్నాడు. అతను విద్యార్థి కాదు. అతనికి సరైన అడ్రస్ లేదు. ట్యునీషియా జాతీయుడు”అని డిటెక్టివ్ బ్రాడ్లీ ఈ కేసులో పబ్లిక్ అప్పీల్‌లో భాగంగా తెలిపారు. ఇక "యూనివర్సిటీగా, మా విద్యార్థులు, సిబ్బందికి మద్దతు ఇవ్వడానికి మేం చేయగలిగినదంతా చేస్తాం, వారి విచారణలో పోలీసులకు పూర్తిగా మద్దతునిస్తాం" అని విశ్వవిద్యాలయ ప్రతినిధి ఒకరు తెలిపారు.