భారత సంతతి పోలీస్‌పై అమెరికాలో కాల్పులు...క్రిస్మస్ పండగ రోజే

By Arun Kumar P  |  First Published Dec 27, 2018, 5:30 PM IST

భారత సంతతికి చెందిన పోలీస్ అధికారి క్రిస్మస్ పండగ రోజే హత్యకు గురైన విషాద సంఘటన అమెరికాలో చోటుచుసుకుంది. క్రిస్మస్ పండగ సందర్భంగా ప్రత్యేక విధులు నిర్వర్తిస్తున్న పోలీస్ అధికారిపై గుర్తు తెలియని దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. ఇందులో తీవ్రంగా గాయపడిన అధికారి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. 

ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. భారత సంతతికి చెందిన కర్పోరల్‌ రొనిల్‌ సింగ్‌ (33), అనామికా దంపతులు తమ ఐదు నెలల కూతురితో కలిసి అమెరికాలోని కాలిఫోర్నియాలో నివాసముంటున్నారు. రోనిల్ సింగ్ కాలిపోర్నియా సిటీ పోలీస్‌  విభాగంలో పనిచేసేవాడు. 

Latest Videos

undefined

క్రిస్మస్ పండగ సందర్భంగా కాలిపోర్నియాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా పోలీసులకు ప్రత్యేకంగా రక్షణ చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా రోనిల్ సింగ్ కు ఓ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద విధులు కేటాయించారు. అయితే అర్థరాత్రి సమయంలో గుర్తు తెలియన దుండగులు రోనిల్ పై కాల్పులకు తెగబడ్డాడు.కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన రోనిల్ సంఘటనా స్థలంలోనే మృతిచెందాడు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్థానికులు, ప్రత్యక్ష సాక్షులు వెల్లడించిన నిందితుల ఆనవాళ్లతో ఊహాచిత్రం విడుదల చేశారు. నిందితున్ని అతి త్వరలో అదుపులోకి తీసుకుని కఠినంగా శిక్షిస్తామని అమెరికా పోలీస్ అధికారులు తెలిపారు. 

click me!