ఆస్ట్రేలియాలో ఫ్లిండర్స్ రేంజ్‌లో 21 ఏళ్ల భారతీయ నర్సింగ్ విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. ఆమెను కేబుల్‌తో బంధించి.. సజీవంగా పాతిపెట్టి అత్యంత దారుణంగా హత్య చేశారు.
ఆస్ట్రేలియాలో ఫ్లిండర్స్ రేంజ్‌లో 21 ఏళ్ల భారతీయ నర్సింగ్ విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. ఆమెను కేబుల్‌తో బంధించి.. సజీవంగా పాతిపెట్టి అత్యంత దారుణంగా హత్య చేశారు. అయితే ఈ దారుణానికి పాల్పడింది ఆమె మాజీ ప్రియుడేనని నిర్దారణ అయింది. వివరాలు.. జాస్మిన్ కౌర్ నర్సింగ్ విద్యార్థిని. జాస్మిన్‌ను నార్త్ ప్లింప్టన్‌లోని ఆమె వర్క్ ప్లేస్ నుంచి మార్చి 5వ తేదీన కిడ్నాప్ చేసిన మాజీ ప్రియుడు తారిక్‌జోత్ సింగ్.. ఫ్లిండర్స్ రేంజ్‌కి తీసుకెళ్లారు. అక్కడ ఆమెను హత్య చేశాడు. కేబుల్స్‌తో బంధించి సజీవంగా పూడ్చిపెట్టాడు.
ఈ నేరం బయటకు రాకుండా తారిక్‌జోత్ జాగ్రత్తపడ్డాడు. అయినప్పటికీ.. కౌర్‌ను కిడ్నాప్ చేసి చంపినట్లు సింగ్‌పై ఆరోపణలు వచ్చాయి. చివరకు ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన జాస్మిన్ హత్యకు సంబంధించిన నేరాన్ని తారిక్‌జోత్ అంగీకరించాడు. దీంతో పోలీసులు పాతిపెట్టిన చోటు నుంచి జాస్మిన్ మృతదేహాన్ని వెలికితీశారు. అయితే జాస్మిన్‌ను ప్రేమించిన తారిక్‌జోత్ ఆమెను పెళ్లి చేసుకోవాలని భావించినట్టుగా తెలిసింది.
undefined
అయితే తాజాగా సౌత్ ఆస్ట్రేలియన్ సుప్రీంకోర్టులో శిక్షా సమర్పణల సందర్భంగా తారిక్‌జోత్ నేరానికి సంబంధించిన భయంకరమైన వివరాలు వెలుగులోకి వచ్చాయి. తారిక్‌జోత్.. జాస్మిన్‌ను కిడ్నాప్ చేసి టేప్, కేబుల్ టైలతో బంధించి, కళ్లకు గంతలు గట్టి స్పృహతో సజీవంగా పాతిపెట్టిన తర్వాత ఆమె ‘‘అసాధారణ స్థాయి క్రూరత్వాన్ని’’ అనుభవించిందని పేర్కొనబడింది.
ప్రతీకార చర్యగా జరిగిన హత్యగా చెప్పబడింది. హత్యకు కొన్ని గంటల ముందు, తారిక్‌జోత్ హార్డ్‌వేర్ స్టోర్ నుంచి చేతి తొడుగులు, కేబుల్ టైలు, పార కొనుగోలు చేస్తున్న దృశ్యాలు అక్కడి సీసీటీవీల్లో నమోదయ్యాయి. వారి బంధం విచ్చిన్నం కావడం వల్లే అతడు హత్యకు ప్లాన్ చేసినట్లు కోర్టు పేర్కొంది. ఇక, జాస్మిన్ 2021 మార్చి 6న మరణించినట్లు పోస్ట్‌మార్టం నివేదిక చూపించింది. ఇక, శిక్షా సమర్పణలను వినడానికి జాస్మిన్ తల్లితో సహా ఆమె కుటుంబం కోర్టుకు వచ్చారు.
ఇక, తారిక్‌జోత్ తప్పనిసరి జీవిత ఖైదును ఎదుర్కొవాల్సి వస్తోంది. కోర్టు వచ్చే నెలలో పెరోల్ లేని వ్యవధిని విధించింది. అయితే అతని న్యాయవాది మరింత దయగల శిక్ష విధించాలని కోరుతున్నారు. ఇదిలా ఉంటే, జస్మిన్ కౌర్ తల్లి రష్‌పాల్ మాట్లాడుతూ.. సింగ్ తన కుమార్తెను తారిక్‌జోత్ వేధించాడని.. వందసార్లు నిరాకరించిన వెంటపడటం మానుకోలేదని అన్నారు. తన కుమార్తె ఆమె చివరి క్షణాల్లో ఎంత బాధ భరించిందనే దాని గురించి తలుచుకుంటే వేదన కలుగుతుందని జాస్మిన్ కుటుంబ సభ్యులు గతంలో చెప్పారు.జాస్మిన్ ఎక్కడైతే పూడ్చిపెట్టబడిందో.. అక్కడే సమాధి నిర్మించిన ఆమె కుటుంబం నివాళులు అర్పిస్తోంది.