అమెరికాలో పడవ ప్రమాదం... మృతుల్లో భారతీయ జంట

By telugu teamFirst Published Sep 5, 2019, 11:33 AM IST
Highlights

నాగపూర్ కి చెందిన చిన్నపిల్లల వైద్యుడు సతీష్ డియ్ పూజారి.. కుమార్తె, అల్లుడు ఈ ప్రమాదంలో మృతిచెందారు. సతీష్ డియో పుజారి కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... ఆయన కుమార్తె సంజీరి డియో పుజారి.. డెంటల్ డాక్టర్ . కాగా ఆమెకు ఇటీవల కస్తూభా నిర్మల్ తో వివాహమైంది. అతను అమెరికాలోని ఓ ఫినాన్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. దీంతో వారు అమెరికాలో సెటిలయ్యారు.

దక్షిణ కాలిఫోర్నియా సమీపంలోని శాంటాక్రూజ్‌ దీవి తీర ప్రాంతంలో ఇటీవల ఓ పడవలో మంటలు చెలరేగి 34మంది మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. కాగా... ఈ ఘటనలో మొత్తం 34మంది మృతిచెందగా... అందులో ఓ భారతీయ జంట కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

నాగపూర్ కి చెందిన చిన్నపిల్లల వైద్యుడు సతీష్ డియ్ పూజారి.. కుమార్తె, అల్లుడు ఈ ప్రమాదంలో మృతిచెందారు. సతీష్ డియో పుజారి కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... ఆయన కుమార్తె సంజీరి డియో పుజారి.. డెంటల్ డాక్టర్ . కాగా ఆమెకు ఇటీవల కస్తూభా నిర్మల్ తో వివాహమైంది. అతను అమెరికాలోని ఓ ఫినాన్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. దీంతో వారు అమెరికాలో సెటిలయ్యారు.

ఇటీవల దంపతులు ఇచ్చారు కాలిఫోర్నియా పడవ ప్రయాణానికి వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదం జరిగి వారిద్దరూ చనిపోయినట్లు తెలుస్తోంది. అయితే... ఈ విషయంపై ఇప్పటి వరకు యూఎస్ అధికారులు మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. సతీష్ మరో కుమార్తె... వీరి గురించిన సమాచార కోసం అమెరికా అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు.

కాగా.. సోమవారం  ఒక్కసారిగా మంటలు పడవ అంతటికి వ్యాపించడంతో అందులో ఉన్న 34 మంది గల్లంతయ్యారు. అగ్నిప్రమాదం తర్వాత పడవ సముద్రంలో మునిగిపోయింది. ఐదుగురిని తీరరక్షక దళం కాపాడింది. ప్రమాదం జరిగిన వెంటనే తీర రక్షక దళం రంగంలోకి దిగింది. బోటు సిబ్బంది పైభాగంలో ఉండటంతో ఆ ఐదుగురిని రక్షించింది. ఇందులో ఒకరు స్వల్పంగా గాయపడ్డారు.  అయితే బోటు లోపల ఉన్న వారిలో 34 మంది గల్లంతయ్యారని చెబుతున్నారు.

ఇందులో ఎంతమంది చనిపోయారన్నది ఇంకా తెలియడం లేదు. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. పొగమంచు తీవ్రంగా ఉన్నప్పటికీ తీరరక్షక దళం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. అయితే మంటలు పూర్తిగా చుట్టుముట్టేయడంతో రెస్క్యూ సిబ్బంది పడవలోకి వెళ్లలేకపోయారు. దూరంనుంచే మరో బోటులో వెళ్లి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. శాంట క్రూజ్ ద్వీపానికి 18మీటర్ల దూరంలో పడవ ప్రమాదానికి గురైంది. మొత్తం ఎనిమిది మంది మృతి చెందినట్టు రెస్క్యూ సిబ్బంది గుర్తించారు.

click me!