అమెరికాలో మరణించిన హైదరాబాద్ టెక్కీ ఇతనే..

By Arun Kumar P  |  First Published Dec 3, 2020, 11:53 AM IST

అమెరికాలో సాష్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న హైదరాబాదీ మరణించాడు.


హైదరాబాద్: భార్యా పిల్లలు లాక్ డౌన్ కారణంగా ఇండియాలో చిక్కుకుపోవడంతో అమెరికాలో ఒంటరిగా వుంటున్న ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ హటాత్తుగా మరణించాడు. ఇంట్లో ఒంటరిగా వుండటంతో అతడి మరణ వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత నెల 27న అతడు చనిపోగా ఇవాళ(గురువారం) ఈ విషయం ఇండియాలోని కుటుంబసభ్యులకు తెలిసింది. 

వివరాల్లోకి వెళితే... హైదరాబాద్ లోని బోడుప్పల్ కు చెందిన పానుగంటి శ్రీధర్ ఆరేళ్లక్రితం అమెరికాకు వెళ్లాడు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తూ భార్య ఝూన్సీ, కొడుకు శ్రీజన్ తో కలిసి అక్కడే వుంటున్నారు. అయితే తన తమ్ముడి పెళ్లి వుండటంతో మార్చిలో ఝూన్సీ కొడుకుతో కలిసి పుట్టింటికి వచ్చింది. అదే సమయంలో కరోనా వ్యాప్తి, లాక్ డౌన్ కారణంగా వారు ఇక్కడే చిక్కుకున్నారు. దీంతో అప్పటినుండి శ్రీధర్ ఒంటరిగా వుంటున్నాడు. 

Latest Videos

ఈ క్రమంలో ఏమయ్యిందో ఏమో గానీ ఇటీవల శ్రీధర్ ఇంట్లోనే నిద్రిస్తూ మరణించాడు. గత నెల 27వ తేదీన అతడు మరణించగా ఈ విషయం ఇండియాలో వుంటున్న కుటుంబానికి తెలియలేదు. ఇవాళ(గురువారం) అతడి మరణవార్తపై సమాచారం అందింది. దీంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. 

పోస్టుమార్టం, కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు పూర్తయినా మృతదేహాన్ని ఇండియాకు పంపించకపోవడంపై కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి కేంద్ర విదేశాంగ శాఖతో మాట్లాడి మృతదేహం త్వరగా రప్పించాలని కోరుతున్నారు. మృతదేహాన్ని వీలైనంత తొందరగా ఇండియాకు తీసుకురావడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలని మృతుడి కుటుంబం కోరుతోంది. 

click me!