అమెరికాలో రోడ్డుప్రమాదం: చిత్తూరు యువకుడు దుర్మరణం

Siva Kodati |  
Published : Aug 05, 2019, 09:00 AM IST
అమెరికాలో రోడ్డుప్రమాదం: చిత్తూరు యువకుడు దుర్మరణం

సారాంశం

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు విద్యార్ధి దుర్మరణం పాలయ్యాడు. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా ఐరాల మండలం మిరియంగంగపల్లెకు చెందిన ప్రత్తిపాటి వివేక్ బెంగళూరులో బీటెక్ పూర్తి చేశాడు. అనంతరం ఎమ్మెస్ చదివేందుకు ఈ ఏడాది జనవరిలో అమెరికా వెళ్లాడు

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు విద్యార్ధి దుర్మరణం పాలయ్యాడు. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా ఐరాల మండలం మిరియంగంగపల్లెకు చెందిన ప్రత్తిపాటి వివేక్ బెంగళూరులో బీటెక్ పూర్తి చేశాడు.

అనంతరం ఎమ్మెస్ చదివేందుకు ఈ ఏడాది జనవరిలో అమెరికా వెళ్లాడు. అక్కడ చదువుకుంటూనే షర్లోటేలోని ఓ పెట్రెల్ బంకులో పార్ట్‌టైం వర్క్ చేస్తున్నాడు. ఈ నెల 2వ తేదీ రాత్రి విధులు ముగించుకుని తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో అతనిని ట్రక్కు ఢీకొట్టడంతో అక్కడిక్కడే దుర్మరణం పాలయ్యాడు.

వివేక్ మరణవార్త విని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. అతని మృతదేహాన్ని బుధవారం భారత్‌కు తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

అస్ట్రేలియాలో విషాదం: ట్రెక్కింగ్ కు వెళ్లి తెలుగు వైద్యురాలి మృతి
షాకింగ్ : అమెరికాలో భారతీయ సంతతి వ్యక్తిపై దాడి, చికిత్స తీసుకుంటూ మృతి..